1) Arjuna Vishada Yogam (అర్జున విషాద యోగం) 47

 15 Nov 2023


భగవద్గీత గురించి దయామా తొలిపలుకులు:

పరమహంస యోగానంద గారి ఆధ్యాత్మిక ఉత్తరాదికారి 1955 yss/srf ప్రెసిడెంట్

 "సిద్ధ పురుషులు ఎవరును సత్యమునకు చెందిన దివ్య సందేశమును మానవాళికి ఇవ్వక ఈ భూమిని వీడరు. బంధములు తొలగిన సత్పురుషులు తమ దైవసాక్షాత్కార దివ్య కాంతిని ఇతరులపై ప్రసరింప చేయవలెను." శ్రీ పరమహంస యోగానంద గారు ఎంత గొప్ప ఔన్నత్యముతో ఈ బాధ్యతను నెరవేర్చిరి! శృతి విహితమైన పలుకులను వారు తొలి రోజులలో ప్రపంచ సదస్సుల యందు పేర్కొనిరి. భావితరమునకు వారు వారి ఉపన్యాసములను రచనలను మించి మరేమియో ఇవ్వలేదని భావించినను వారు గొప్ప ఉదార స్వభావంతో దివ్యమైన దైవ కాంతిని ప్రసాదించిన వారి శ్రేణి యందు తమ స్థానమును కలిగి ఉందురు.గురువుగారు భగవంతునితో అనుసంధానమై విస్తారముగా రచించిన సాహిత్య గ్రంథములలో కెల్లా భగవద్గీత అనువాదము మరియు వ్యాఖ్యానము వారు అందించిన వాటిలోకెల్లా మిక్కిలి సమగ్రమైన గ్రంథముగా అది ఒక్క గొప్ప కానుకగా పరిగణింపవలెను.

 ఆ గ్రంథము మిక్కిలి విస్తారమైనదే కాక సంపూర్ణ జ్ఞానమును పొందుపరిచి ఉన్నటువంటి గ్రంథం.

        భారతదేశపు ప్రసిద్ధి చెందిన సద్గ్రంధము శ్రీభగవద్గీత మొట్టమొదటిసారిగా నా 15 ఏళ్ల ప్రాయమున నాకు ఇవ్వబడినది.అది సర్ ఎడ్విన్ అర్నాల్డ్ గారు అనువదించిన ప్రతి. మనోహరమైన పద్య పంక్తులు భగవంతుని తెలుసుకొనవలనను ప్రగాఢమైన కోరికను నా మనసు నందు నింపినవి. కానీ భగవంతుని చెంతకు దారిని చూపగల వారు ఎక్కడ ఉన్నారు?

         పై సంఘటన జరిగిన రెండు సంవత్సరముల పిదప 1931 వ సంవత్సరమున నేను శ్రీ పరమహంస యోగానంద గారిని కలిసితిని. వారి ముఖ వర్చస్సు వారి నుండి స్పష్టముగా ప్రసరించుచున్న ఆనందము మరియు దివ్యమైన ప్రేమ ఇవన్నీ వారికి భగవంతుడు తెలియను అను దానిని ఖచ్చితముగా మిక్కిలి ప్రభలముగా విశదపరుచుచుండెను. నేను అనతి కాలమునందే వారి సన్యాస ఆశ్రమం నందు చేరితిని. తరువాత 20 సంవత్సరములు పైగా వారి అనుగ్రహముతో వారి సమక్షమున జీవించుటకు వారి మార్గదర్శకత్వము న భగవంతుని పొందు ప్రయత్నం చేయుటకు అవకాశము లభించినది. మరియు ఆ అవకాశం వారికి శిష్యురాలి గా ఉండుటకు మరియు ఆశ్రమము సంస్థాగత కార్యకలాపము లను పర్యవేక్షించుటకు వారి కార్యదర్శిగా పనిచేయుటకు లభించినది. నేను మొదట వారిని చూసినప్పుడు మిక్కిలి భక్తి పూర్వక విస్మయముతో వారి యందలి ఆధ్యాత్మిక స్థాయి ఉన్నతిని గుర్తించితిని. నాకీ భావము నా యందు మరింత బలపడుచుండగా తర్వాతి కాలమంతయు గడిచిపోయెను. ఈ ప్రపంచము నందు వారు భగవద్గీత సారమునకు ఒక దృష్టాంతముగా ఉన్నట్లు నేను గమనించితిని. మానవజాతిని ఉద్ధరించుటకు వారి జీవితమున వారు చేయు సేవ యందు, భగవంతునిలో నిరంతరము వారు అనుసంధానమై ఉండుట యందు స్వచ్ఛమైన ప్రేమను కనపరచు ప్రియతమ దైవము వలె వారు గీతా సారమును వ్యక్తపరిచి దానికి ప్రతీకగా నిలిచిరి.

            శ్రీ పరమహంస గారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు సూచించిన యోగశాస్త్ర ధ్యానము నందు సంపూర్ణమైన ప్రావీణ్యతను కలిగి ఉండిరి.వారు అతీతమైన సమాధి స్థితియందు మిక్కిలి సులువుగా ప్రవేశించుటను నేను పలుమార్లు గమనించితిని.వారు భగవంతునితో అనుసంధానమైన సమయములో వారి నుండి వెలువడు అనిర్వచనీయమైన ప్రశాంతత మరియు దివ్యనందము నందు సమీపమున ఉన్న మేమందరము

మునిగెడివారము. ఒక్క స్పర్శతో లేక ఒక్క పదముతో లేక ఒక్క చూపుతో వారు ఇతరుల యందు దైవ సన్నిధిని మేల్కొల్పేడు వారు లేక వారితో అనుసంధానమైన ఉన్న శిష్యులకు అధిచేతనాస్థితి యొక్క తన్మయత్వ అనుభవమును ప్రసాదించెడి వారు.

             ఉపనిషత్తుల యందలి ఒక ప్రకరణము ఈ విధంగా తెలుపుచున్నది. ఎడతెగని ధ్యానము ఫలితముగ లభించిన బ్రహ్మము అనబడు అమృతమును మాత్రము సదా సేవించుచుండు యోగి ఒక గొప్ప మహిమాన్వితమైన తపస్వి అగును. అతనిని పరమహంస అని అందురు. భౌతిక బంధములు లేని వేదాంతి అయిన అవధూత అతని ఒక్క చూపు మాత్రమున ఈ ప్రపంచమంతయు

పునీతమగును. అతని సేవ యందు నిమగ్నమైన అజ్ఞాని సైతం ముక్తిని పొందును .

 16-11-23

    పరమాంస యోగానంద గారు భగవత్ సాక్షాత్కారమును పొందిన ఒక సద్గురువు. వారు జ్ఞానమును కలిగి ఉండుట యందు కర్మను చేయుటయందు భగవంతుడుని ప్రేమించుట యందు ఒక సజీవమైన సద్గ్రంధము వంటి వారు. వారు భౌతిక విషయముల యందు సంపూర్ణమైన అనాసక్త తో ఉండి వేల మంది అనుచరులు వారిని గొప్ప పొగడ్తలతో ముంచెత్తినను వారు

 నిర్వ్యా మోహితులై ఉండి భగవద్గీత యందు సూచించిన పరిత్యాగమును సేవా తత్పరతను తమ యందు ప్రదర్శించిరి. వారి అజేయమైన అంతర్గత శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి వారు ప్రదర్శించు సహజమైన మధురమైన నమ్రత యందు ప్రస్ఫుటమగుచుండెను. అటువంటి వారి ప్రవర్తన యందు 'నేను' అను

 అహం భావమునకు చోటు లేకుండెను. వారి గురించి వారు తెలుపునపుడు లేక వారు చేసిన దానిని తెలుపునప్పుడు కూడా వారి యందు ఏ విధమైన వ్యక్తిగతమైన కార్య సాఫల్యతా భావము ఉండడిది కాదు. వారు భగవత్ సాక్షాత్కారము పొందిన వారు. అనగా తన ఆత్మసారము భగవంతుడేనని గ్రహించిన వారు. వారు భగవంతునితో ఏకమైన తత్వముగనే తమను తాము తెలిసియుండిరి.

         భగవద్గీత అధ్యాయము 11 -విశ్వ సందర్శన యోగమునందు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన అత్యున్నత ఉపదేశము కలదు. అందు దివ్య పరమాత్మ తన విశ్వరూపమును ప్రదర్శించును. జగత్తులపై జగత్తులను అనూహ్యమైన పెద్ద వాటిని అనంత సర్వశక్తిమంత నిర్గుణ పరబ్రహ్మ సృష్టించి పోషించుచుండెను. అదే సమయమున ఆ పరబ్రహ్మ అణువు కన్నను చిన్నదైన పదార్థం యొక్క కదలికను అతి పెద్ద నక్షత్ర మండలముల యొక్క విశ్వ గమనమును భౌతిక దివ్యలోకముల యందు ప్రతి జీవి యొక్క ప్రతి ఆలోచనను భావమును మరియు వాటి చర్యను తెలిసి ఉండెను.

-------------------

పరమహంస యోగానంద గారు ఆ విధమైన విశ్వదృశ్యమును దర్శించిన శుభ సందర్భమున మేము వారి సమక్షమున ,

 గురువుగారి చైతన్యము యొక్క సర్వవ్యాపకత్వమును , వారి ఆధ్యాత్మిక ప్రభావపు పరిధిని దర్శించితిమి.1948 వ సంవత్సరము జూన్ నెల ఒకరోజు సాయంత్రం మొదలు , ఆ రాత్రి అంతయు, మరిసటి రోజు ఉదయం 10 గంటల వరకు యోగానంద గారు తన్మయావస్థ యందు వారు దర్శించిన విశ్వ జగత్తుల దర్శనమును , వారికి అగుపించిన విధముగా వారు వర్ణించుచుండగా, మేము కొంతమంది శిష్యులము ఆ గొప్ప అనుభవము వినుటకు అర్హులమై ఉంటిమి.

         సంభ్రమాత్సర్యములను గొలుపు ఆ ఘటన భూమిపై వారి సమయము ఆసన్నమైనది అను దానిని సూచించెను. ఇది జరిగిన వెంటనే పరమహంస గారు మోజావే డిసర్ట్ యందలి చిన్న ఆశ్రమం నందు సమయము ఏకాంతముగా గడిపెడి వారు. తమకు మిగిలిన కొద్ది సమయమును అచ్చట సాధ్యమైనంత వరకు తాము పూర్తి చేయవలసిన రచనలను రాయుటకు వినియోగించే వారు. వారు ప్రపంచమునకు ఈయవలసిన సందేశములపై ఏకాగ్రతతో పనిచేసిన ఆ కాలము, వారి సమక్షమున ఉన్న మాకు అది మిక్కిలి విలువైన కాలము. వారు తమ అంతరంగము నందు దర్శించుచున్న సత్యముల యందు పూర్తిగా నిమగ్నమై, వాటితో ఏకమై , వాటిని బాహ్యముగా పలికి వ్యక్తపరచడి వారు. ఆ కాలమున పరమహంస గారు వసించుచున్న ఏకాంత ఆశ్రమ ప్రాంగణమున పనిచేయుచున్న సన్యాసి ఒకరు తమ అనుభవమును గుర్తుచేసుకొని ఈ విధముగా తెలిపిరి...." వారు పెరటి ఆవరణ యందు గడుపుటకై వచ్చిరి.వారి కన్నుల యందు అంతులేని అగాధమైన లోతులు కనబడుచుండెను. వారు నన్ను సమీపించి ఈ విధముగా పలికిరి. "ముల్లోకములు నాలోన నీటిబుడగల వలె తేలియాడుచున్నవి." వారి నుండి వెలువడుచున్న గొప్ప శక్తి నిజమునకు నన్ను వారి నుండి కొన్ని అడుగుల దూరమునకు 

  నెట్టివేసినది.

        మరొక సన్యాసి గురువుగారు పనిచేయుచున్న వారి గదిలోనికి ప్రవేశించినప్పుడు తమ అనుభవమును ఈ విధముగా గుర్తు చేసుకునిరి.."ఆ గది యందలి తరంగ శక్తి నమ్మశక్యము కానిది... ఆ గది యందు ప్రవేశించుట అనునది భగవంతుని యందు ప్రవేశించిన దానివలె ఉండె ను."

      ఆ కాలమందు ఒక విద్యార్థికి లేఖ ను రాయుచు పరమహంస గారు ఈ విధముగా రాసిరి." నేను రోజు అంతయు శాస్త్ర గ్రంథ

భావార్థములను , మరియు లేఖలను, ఈ ప్రపంచము వైపున నా కన్నులు మూసుకొని , ఆపై నా కనులు దివ్య లోకము యందు సదా తెరిచి ఉంచి

 ప్రవచించుచుందును "

        శ్రీ పరమహంస గారు భగవద్గీత వ్యాఖ్యానమును అనేక సంవత్సరములకు పూర్వమే ప్రారంభించి , వారు డెసర్ట్ ఆశ్రమమునందు ఉండు కాలమున ముగించిరి. (భగవద్గీత వ్యాఖ్యా నము srf పత్రిక యందు ప్రప్రదమముగా 1932వ సంవత్సరము నుండి ధారావాహికగా ప్రచురించబడినది) డిసర్ట్ ఆశ్రమమునందు చేపట్టిన పనులు ఈ విధముగా ఉన్నవి.... అనేక సంవత్సరముల పాటు రాసిన వ్యాఖ్యానమును పునః సమీక్షించుట ...

అనేక అంశములకు వివరణ ఇచ్చుట మరియు విపులీ కరించుట..

ధారావాహిక యందు కొత్తగా చదువుతున్న వారి సౌలభ్యం కొరకు మరలా మరలా రాసిన ప్రకరణలు సంక్షిప్తపరచుట....

ప్రేరణ ఇచ్చు నూతన అంశములను చేర్చుట...

మరియు యోగ శాస్త్రముల యొక్క లోతైన తత్వ జ్ఞాన విషయములను సంకలన పరుచుట....

(నవీన శాస్త్ర విజ్ఞానము ను పొందని సామాన్య జనులకు పరమహంస గారు యోగ శాస్త్రము యొక్క లోతైన తత్వ జ్ఞాన విషయములను తొలుత తెలియపరచలేదు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం భగవద్గీత యందలి సృష్టి నిర్మాణ విషయములను, మానవుని శారీరక మానసిక ఆధ్యాత్మిక దృక్పదమును పాశ్చాతులకు సులభముగా అర్థమవునట్లు చేసెను. కనుక యోగ శాస్త్ర విషయముల సంకలనము వారు చేపట్టిన పనులలో ఒకటి)

పైన తెలిపిన అంశము అన్నింటిని క్రోడీకరించి ఒక పుస్తక రూపములో ప్రచురించుట.

-----------

గ్రంథ సవరణ విషయమును తనకు సహాయముగా గురుదేవులు శ్రీ తార మాత గారిపై ఆధారపడిరి. (laurie v.prutt) శ్రీ తార మాత గారు మిక్కిలి పరిమితి చెందిన శిష్యులు.వారు గురుదేవులను 1924వ సంవత్సరమున కలిసి వారి రచనల యందు వారికి తోడ్పడుచు 25 సంవత్సరములకు పైగా గురుదేవులతో పాటు పని చేసిరి.పరమహంస గారు తారామాత గారి సేవలకు గుర్తింపునివ్వక మిక్కిలి స్వామి భక్తి కలిగిన తారామాత గారి పాత్రను ప్రశంసింపక ఈ గ్రంథ ప్రచురణకు సమ్మతింపరని నాకు నిస్సందేహముగా తెలియును శ్రీ తార మాత గారి గురించి గురుదేవులు ఈ విధముగా పలికిరి.

        "ఈమె భారతదేశముకు చెందిన ఒక గొప్ప యోగి. అనేక జన్మలు ఆమె ప్రపంచపు దృష్టియందు పడక అజ్ఞాతముగా జీవించిరి.ఈ విధమైన సేవ చేయుట కొరకై ఈమె ఇచ్చట జన్మించిరి. "

 అనేక బహిరంగ సందర్భముల యందు గురుదేవులు తారమాత గారి సాహితీపరమైన కుశాగ్ర బుద్ధి పై మరియు వారి వేదాంత జ్ఞానము పై తమ విలువైన అభిప్రాయములను వెల్లడించిరి." ఆమె ఈ దేశంలోకెల్లా బహుశా ప్రపంచంలోకెల్లా ఉత్తమ గ్రంథ సవరణ కర్త. (ఎడిటర్) నా పరమ గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారిని మినహాయించి లౌరీతో భారతదేశ వేదాంతము గురించి మాట్లాడినప్పుడు నాకు కలిగిన ఆనందం మరెవరితోనూ మాట్లాడినప్పుడు కలుగలేదు."

          తమ జీవితపు తదుపరి అంకమునందు పరమహంస గారు మృణాలిని మాత అను సన్యాస శిష్యురాలిని ఎంపిక చేసి వారికి గ్రంథ సవరణ విషయములయందు శిక్షణ ఇవ్వసాగిరి.గ్రంథ సవరణ యందు మృణాళిని మాతకు తాను శిక్షణ నిచ్చు విషయమును గురుదేవులు మాకందరకు స్పష్టపరిచిరి. తమ రచనలను ఉపన్యాసములకు చెందిన అన్ని విషయములను ఏ విధముగా పొందుపరచవలసినది ఏ విధముగా పుస్తక రూపకల్పన చేయవలసినది అను దానిపై వారు మృణాళిని మాతకు వ్యక్తిగతముగా సూచనలు ఇచ్చేడి వారు.

           భూమిపై వారి చివరి రోజులలో ఒక దినము వారు ఒక రహస్యమును చెప్పిరి.నేను లౌరి విషయమై మిక్కిలి ఆందోళనముగా ఉన్నాను ఆమె అనారోగ్య కారణం చేత నా రచనల పనిని ఆమె పూర్తి చేయజాలదు.     

             గురువుగారు తారామాత పై అధికముగా ఆధారపడి ఉండుటను తెలిసిన మృణాళిని మాత తన వ్యాకులతను తెలియజేయుచు ఇలా పలికిరి "గురుదేవా మరి ఆ పనిని ఎవరు చేయగలరు?"అని ప్రశ్నించిరి .

          గురుదేవులు నిశ్చయా త్మకముగా ఇట్లు పలికిరి."నీవు చేసెదవు".

           1952వ సంవత్సరము న పరమహంస గారి మహాసమాధి అనంతరము తార మాత గారు భగవద్గీత శ్లోకములను గురువుగారి వ్యాఖ్యానంతో పాటు ఎస్ఆర్ఎఫ్ పత్రిక యందు ధారావాహికంగా ప్రదర్శించుటను కొనసాగించిరి.

 (తార మాత గారు ఎస్ఆర్ఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నందు ఒక సభ్యురాలిగా మరియు ఒక అధికారిగా మరియు అన్ని ఎస్ఆర్ ఎఫ్ ప్రచురణలకు ముఖ్య ఎడిటర్ గా అనేక బాధ్యతలను నిర్వహించుచు గొప్ప సమయాభావంతో ఉన్నప్పటికీ పైన తెలిపిన సేవను అందించిరి.)

 కానీ పరమహంస గారు ముందుగా ఊహించిన విధముగా తారామాత గారు భగవద్గీత గ్రంథమును గురువుగారు కోరిన విధముగా తయారు చేసి ముగింపక మునిపే కాలం చేసిరి. ఆ తరువాత ఆ బాధ్యత మృణాళిని మాత భుజస్కంద ములపై పడెను.గురువుగారు ఊహించిన విధముగా తారామాత గారి నిర్యాణానంతరము ఆ బాధ్యతలను సక్రమముగా నిర్వర్తింపగలిగిన వారు ఒక్క మృణాలిని మాత మాత్రమే. అనేక సంవత్సరముల పాటు గురువుగారి వద్ద శిక్షణను పొంది వారి ఆలోచనలకు అనుగుణముగా అనుసంధానమై ఉండుటవలన మృణాళిని మాత ఆ బాధ్యతను నిర్వర్తింపగలిగిరి.

              అనేక సంవత్సరము లు ఎదురుచూచిన పిదప పరమహంస యోగానంద గారి భగవద్గీత అనువాదము మరియు వ్యాఖ్యాన గ్రంథము ఆవిష్కరింపబడుట మిక్కిలి సంతోషకరమైన విషయము. నిజమునకు ఎస్ఆర్ఎఫ్ చరిత్ర యందు ఇదొక ముఖ్యమైన ఘటన. ఈ సంవత్సరముననే ఎస్ఆర్ఎఫ్ తన 75 వ వార్షికోత్సవమును జరుపుకొనినది.( సెప్టెంబరు 19 1920వ సంవత్సరమున పరమాంస యోగానంద గారు అమెరికా దేశము నందు అడుగిరి.మరియు భారతదేశపు ప్రాచీన యోగ శాస్త్రమును ప్రపంచమంతటా వ్యాప్తి చెందించుటకు ఎస్ఆర్ఎఫ్ ను స్థాపించిరి.) పరమహంస యోగానంద గారు ఈ భూమి పై రెండు విధములైన బాధ్యతలను నిర్వర్తించరి. వారి పేరు,వారు నిర్వర్తించిన కార్యక్రమములు వారు స్థాపించిన ప్రపంచవ్యాప్త సంస్థ (ఎస్ఆర్ఎఫ్/ వైఎస్ఎస్ ఆఫ్ ఇండియా) తో ఒక అసమానమైన విధముగా సరిపోలినవి.

1. మరియు ఎస్ఆర్ఎఫ్ వైఎస్ఎస్ క్రియాయోగ బోధనలను స్వీకరించిన అనేక వేల మందికి ఆయన వ్యక్తిగతమైన గురువు. 2.అయినను ఆయన ఒక జగద్గురువు. అనగా ప్రపంచమునకు గురువు. వారి జీవితము వారి అద్వితీయ దివ్య సందేశములు అనేక మార్గములను అనేక మతములను అనుసరించుచు వారి అనుచరుల అభ్యున్నతికి తోడ్పడి వారికి స్ఫూర్తినిచ్చు మూలముగా ఉన్నవి.వారి ఆధ్యాత్మిక వారసత్వ సంపద ఈ ప్రపంచమునకు ఇవ్వబడిన దివ్యమైన వరప్రసాదము.

                 భూమిపై వారి చివరి దినమైన మార్చి 7 1952వ సంవత్సరము నాకు గుర్తుకు వచ్చుచున్నది. వారా దినమున మిక్కిలి ప్రశాంతముగా ఉండిరి. వారి మనో చైతన్యము సాధారణము కన్నను మరింత లోతుగా అంతర్ముఖము

గావింపబడి ఉండెను. ఆ రోజున అనేకసార్లు అతని శిష్యులమైన మేము వారి దృష్టి భౌతిక ప్రపంచం వైపు కాక తమ సర్వాతీత లోకమందలి ప్రత్యక్ష పరమాత్మ వైపు తదేకముగా చూచుచున్నట్లు గమనించితిమి.వారు అతి స్వల్పముగా మాట్లాడినను అది గొప్ప వాత్సల్యముతోనూ ప్రశంసాపూర్వకముగను దయతోను కూడి ఉండెను. కానీ నా జ్ఞాపకము నందు ఎంతో స్పష్టముగా నిలుచునది ఏమనగా వారి గది యందు ప్రవేశించిన వారందరు వారి నుండి ప్రవహించుచున్న గొప్ప విస్తారమైన శాంతి తరంగములను గాఢమైన దివ్య ప్రేమ భావమును గమనించిరి.

 జగన్మాత తానే స్వయముగా- అనగా అనంతపరబ్రహ్మ యొక్క ఒక అంశము సున్నితమైన దయ మరియు కరుణ మరియు స్వచ్ఛమైన ప్రేమగా రూపు దాల్చి ఉన్నటువంటిది ఈ జగత్తులను రక్షించి మోక్షము ఇచ్చునది- వారిని పూర్తిగా తమ స్వాధీనమునకు తీసుకొని ఆమె కల్పించిన సృష్టి అంతటినీ ఆవహించు విధముగా గురుదేవుల నుండి ప్రేమ తరంగములను వెదజల్లునట్లు ఉండెను.

------------

      ఆరోజు సాయంత్రము భారతదేశపు రాయబారి నిమిత్తము ఏర్పాటుచేసిన గొప్ప స్వాగత సమారోహము నందు పాల్గొని , పరమహంస గారు ప్రధాన ఉపన్యాసకులుగా మాట్లాడవలసి ఉండగా, ఆ సమయమున గురుదేవులు శరీర త్యాగం చేసి పరమాత్మను చేరిరి.

       మానవజాతిని సంరక్షించుటకు భూమి పైకి అరుదుగా వచ్చు మహనీయుల ప్రభావము భూమిపై నిలచి ఉండు విధముగా , పరమహంస గారి ప్రభావము ఈ భూమిపై వారి తరువాత కూడా నిలచి ఉండును. వారి అనుచనురులు పరమహంస గారిని 'ప్రేమావతారము'గా భావించెదరు. అనగా భగవంతుని దివ్య మైన ప్రేమ స్వరూపము. మానవుడిని సృష్టించిన భగవంతుడిని మరచి నిద్రించుచున్న హృదయములను మేల్కొలుపుటకై వారు ఈ భూమి పైకి భగవంతుని ప్రేమను కొని వచ్చిరి. మరియు భగవంతుడిని కోరుచున్నవారికి ఒక దివ్య ప్రకాశ మార్గమును చూపుటకై వారు భూమి మీదకి వచ్చిరి. భగవద్గీత వ్రాత ప్రతులను నేను సమీక్షించుచున్నప్పుడు , పరమహంస గారి వ్యాఖ్యానముల యందు సరికొత్తదైన దివ్య ప్రేమ యొక్క ఆకర్షణను నేను గమనించితిని. అది సదా మనలను భగవంతుడిని కోరునట్లు చేయును. ప్రతి మానవుని ఉన్నత లక్ష్యము ఆ భగవంతుడే. ఆ భగవంతుడే సర్వవేళ ల తన రక్షణ సమక్షమును అందరికీ కల్పించు చున్నాడు.

        పరమహంస యోగానంద గారి సమగ్రమైన, సర్వోన్నతమైన, సర్వజనహితమైన ప్రార్థన శ్లోకము నా ఆత్మ యందు మరలా మరలా ప్రతిధ్వనించుటను నేను వినుచున్నాను. ఆ ప్రార్ధన వారి విశ్వజన సేవా తత్పర సంకల్పమును ప్రతిబింబించు శక్తిగా , మరియు భగవద్గీత యొక్క వికాస పూరిత దివ్యసందేశమును మనకందరికీ పంచిపెట్టు అతని స్ఫూర్తిగా ఉన్నది.

"*దివ్య లోకపు తండ్రి, తల్లి, స్నేహితుడా , ప్రియ దైవమా 

నీ పవిత్రమైన ప్రేమ నా భక్తి అను ఆలయముపై శాశ్వతముగా ప్రకాశించుగాక.

నేను నీ పవిత్ర ప్రేమను సర్వ జనుల హృదయముల యందు మేల్కొలుపుదును గాక.*"

లాస్ ఏంజెలిస్ 

19 సెప్టెంబర్ 1995.

దయామా తోలి పలుకులు సంపూర్ణం

-------------------

భగవద్గీత ఉపోద్ఘాతము

గ్రంథములలో కెల్లా గంధమైన భగవద్గీత భారతదేశపు అత్యంత ప్రీతికరమైన సద్గంధము. అది హైందవులకు బైబిల్ వంటిది. భగవద్గీత ఒక్కటే శాస్త్ర ప్రమాణత నిర్ధారణకు ఉన్నతమైన ఆధారమని భావించి, పండితులందరూ ఈ గ్రంథము పైనే ఆధారపడదరు. భగవద్గీత అనగా "భగవంతుని గీతము"అది మానవునికి సృష్టికర్తకి మధ్యన జరిగిన , సత్యమును సాక్షాత్కరింప చేయు దివ్య సంభాషణ. అది దివ్య పరమాత్మ ఆత్మ ద్వారా బోధించిన ఉపదేశము. అది నిరాటంకముగా నిత్యము పాడవలసిన గీతము.

      భగవద్గీత యందు *సర్వేశ్వరవాదము* అను సిద్ధాంతము ప్రతిపాదింపబడినది. సర్వేశ్వర వాదము అనగా సర్వము భగవత్ స్వరూపమే. భగవద్గీత యందలి శ్లోకములు సృష్టికి ఆవల ఉన్న నిర్గుణ, నిశ్చల పరమాత్మను కనుగొని, అతనే సమస్త సృష్టి స్వరూపము నందు అదృశ్య రూపమున ఉన్నాడని కీర్తించుచున్నవి. ప్రకృతి అనంత మైన రూపములను తనయందు కలిగి ఉండి, మిక్కిలి కఠినమైన ప్రకృతి సూత్రములతో పొందుపరచబడి ఉన్నది. అటువంటి ప్రకృతి ఒక్కడైనా పరమాత్మ నుండి ఏర్పడినది. ప్రకృతి తన యందలి విశ్వమాయ ద్వారా --మాయాజాలముతో నియంత్రించునది --"ఒక్కడే అయినా దివ్య పరమాత్మను అనేక విభిన్నమైన రూపముల యందు దర్శింపచేయును."తనదైన వ్యక్తిగత రూపమును , తెలివిని కలిగి ఉండి, ఒక్కడైనా ఆ దివ్య పరమాత్మతో వేరుపడి ఉండునట్లు కనపడును.

"యోగానంద స్వామి భగవద్గీత ఉపోద్ఘాతం"

------

స్వప్నమును కాంచుచున్న వ్యక్తి తన స్వప్నమునందు తన చైతన్యమనే విభిన్న రూపములుగా ఏర్పరిచిన విధముగా విశ్వ స్వాప్నికుడైన భగవంతుడు తన చైతన్యమును వివిధ విశ్వరూపములుగా విభజించెను. ఆ విధముగా ఏర్పరచిన వివిధ రూపములకు తన నుండి కల్పించిన వ్యక్తిగత ఆత్మను జత చేసి వాటియందు అహము ను కల్పించెను. ఆత్మతో అహముతో కూడి ఉన్న ప్రతి జీవి ప్రకృతి నిర్దేశించిన విశ్వ స్వప్నము అను నాటకము నందు తన ఉనికిని తన స్వప్నము నందు కాంచును.

 "భగవద్గీత యందలి ప్రధాన విషయము"

భగవద్గీత యందు అంతటను ప్రస్తావించబడిన ప్రధాన విషయం ఏమనగా వ్యక్తి తన భౌతిక శరీరమునందు అవిద్య (అజ్ఞానము )కారణముగా స్థిరపడి ఉన్న అహము ను అతను సన్యాస విధానమును అనుసరించి పరిత్యజింపవలెను. కోరికలు అహము ను పరమాత్మ నుండి వేరు పరచును.కనుక అహము మరియు దాని కనుబంధమైన వాటి నుండి( ఇంద్రియములు) వెలువడు కోరికలను పరిత్యజించుట వలన యోగా ధ్యానం యొక్క తన్మయత్వ సమాధిని పొంది విశ్వస్వాప్ని కుని తో కలియుట వలన మనిషి తనను నిర్బంధించు ప్రకృతి శక్తుల నుండి విడివడి వాటిని నశింప చేయను. ప్రకృతి యందలి శక్తులే భ్రాంతితో కూడిన ద్వైతము ను కల్పించి ఆత్మను పరమాత్మ నుండి వేరైనట్లు గోచరింపచేయును.

          సమాధి స్థితి యందు విశ్వ స్వప్న బ్రాంతి నశించిపోవును. తన్మయత్వ సమాధి స్థితిని అనుభవించు జీవి జాగరుకుడై సర్వోన్నత పరమాత్మ యొక్క శుద్ధ విశ్వ చైతన్యముతో ఏకమగును. ఆ సర్వోన్నత పరమాత్మయే శాశ్వతమైన వాడు,నిత్య జాగరుకమైనవాడు, మరియు అతనే నిత్య నూతన దివ్యానందము.

         ఈ విధమైన భగవత్ సాక్షాత్కారమును కేవలము గ్రంథములు చదువుట వలన పొందజాలము. భగవత్ సాక్షాత్కారము పొందు విధమేదనగా

1. పైన తెలిపిన సత్యమును సదా జ్ఞప్తి యందు ఉంచుకొని జీవితమొక అనేక విధములైన వినోదములు కల్పించు స్వప్న చలన చిత్రమని అది ద్వంద్వ ములతో కూడిన ఆపదలతో మరియు చెడుకు చెందిన ప్రతి నాయకులతో (దుర్గుణాలు) పరాక్రమముతో కూడిన మంచిని కలిగిన సాహసములతో (ఆత్మ నిగ్రహం) నిండి ఉన్నదని భావించును.

 2. లోతైన యోగా ధ్యానం చేయుచు మానవ చైతన్యమును భగవంతుని విశ్వచైతన్యంతో కలుపుట వలన భగవత్ సాక్షాత్కారము కలుగును. ఆ విధముగా భగవద్గీత సాధకులను వారు తమ లక్ష్యములను చేరుటకై శారీరక మానసిక ఆధ్యాత్మిక సత్కర్మలను చేయుమని ప్రబోధించుచున్నది. మనము భగవంతు నుండి వచ్చితిమి. కనుక మన అంతిమమైన లక్ష్యము మరలా భగవంతుని వద్దకు చేరుటయే. లక్ష్యము- లక్ష్యమును చేరు మార్గము ఈ రెండును యోగము అనబడును. అనగా భగవంతునితో కలియుట. ఆ విధముగా యోగ శాస్త్రము అన్నియుగములకు చెందిన శాస్త్రము .

           ఆధ్యాత్మిక విషయములయందు భగవద్గీత ఒక మార్గదర్శిగ ఎంతటి సమగ్రమైన దనగా అది ప్రముఖమైన నాలుగు వేదములు 108 ఉపనిషత్తులు హైందవ తత్వశాస్త్రములకు చెందిన షట్ దర్శనముల సారము అని చెప్పబడినది. 

భగవద్గీతను అతీంద్రియ అవగాహన శక్తి చే చదివి అర్థం చేసుకొనవలెను. లేక విశ్వ చైతన్యముతో అనుసంధానమైనప్పుడే ఎవరైనను ఈ గ్రంథమును పూర్తిగా అర్థం చేసుకొనగలరు. ప్రపంచము నందలి అన్ని గొప్ప సద్గ్రంధముల యందలి అతి ముఖ్యమైన పారమార్థిక సూత్రములన్నియు భగవద్గీత యందలి 700 సంక్షిప్త శ్లోకముల యందు పొందుపరచబడిన అనంతమైన జ్ఞాన సంపదతో సయోధ్య పూర్వకముగా ఏకీభవించుచున్నవి.

-------

20 నవంబర్