15వ అధ్యాయం
పురుషోత్తమ ప్రాప్తి యోగం (20 శ్లోకాలు)
15:1 నుండి 4 వరకు ఒక విభాగము
15:1
అర్థం:-
శాశ్వతమైన అశ్వద్ధ వృక్షము (సంసార వృక్షము) దివ్య పరమాత్మ ఈ విధముగా పలకెను. అశ్వద్ధ వృక్షము గురించి విజ్ఞులు ఈ విధముగా తెలిపెదరు. ఆ వృక్షము యొక్క వేర్లు ఊర్ధముగాను, దాని కొమ్మలు క్రిందను ఉండును. మరియు దాని ఆకులు వేద మంత్రములు ఈ విధమైన సంసారవృక్షమును ఈ ఈ విధ మైన సంసార వృక్షమును అర్థము చేసుకొని వారు వేదములను తెలిసిన వాడు అగును.
వ్యాఖ్యానం:-
అశ్వద్ధ వృక్షము దాని పరిమాణము చేతను, బహుకాలము జీవించి ఉండుట చేతను అది మిక్కిలి ప్రసిద్ధమైనది. ఈ అధ్యాయము మొదటి నాలుగు శ్లోకముల యందు అశ్వద్ధ వృక్షమును ఉపమానముగా చూపి, మానవుని శరీరమున విస్తృతముగా, శాకోప శాఖలుగా వ్యాపించి ఉన్న చైతన్యము, ప్రాణ శక్తి, స్పర్శ- చలన నాడుల వ్యవస్థ సముదాయము గురించి వివరించబడినది.
ఇచ్చట అశ్వద్ధ వృక్షము శాశ్వతము అయినది అని చెప్పబడినను, అశ్వద్ధము అను పదమునకు సాధారణ భాషలో దానికి విరుద్ధమైన అర్థము అనగా రేపటికి ఉండునది కాదు, భవిష్యత్తులో ఉండదు అని కలదు. అశ్వద్ధ వృక్షము ఇచట ఒక ఉపమానముగా నిత్యమును మార్పులను చెందు ప్రపంచమును, అందలి మానవులను సూచించుచున్నది. ప్రపంచము అందలి జనులు నిత్యమును మార్పును చెందుతూ ఉండేదరు. ఈ క్షణము ఉన్న విధముగా మరుక్షణం ఉండదు. (మరుక్షణము, లేక రేపు ,లేక భవిష్యత్తు ). ప్రకృతి యందలి సృష్టి కార్యక సూత్రములు పరస్పర చర్యలను పొందుట వలన అనంతమైన మార్పులు కలుగుచుండును.(పరస్పర చర్య అంటే కార్యము, కారణము వృక్షములు, జంతువులు, మనుషులు, పుట్టడం, పెరగడం, మరణించడం) ఈ మార్పులు తెచ్చు ఫలితములు ఒకే విధమైన చర్యలు ఉండవు. కానీ వీటి వెనుక ఉన్న సృష్టి కారక సూత్రములు జీవనము మరియు అశ్వద్ధ వృక్షపు గింజ శాశ్వతమైనది.(ఒక విత్తనము మొలకెత్తి వృక్షమై అది మరణించిన ఇంకొక విత్తనము ద్వారా ఇంకొక చెట్టు వస్తుంది. అలా నిరంతరం జరుగుతుంది కాబట్టి అది శాశ్వతమైనది అలాగే మానవులు పుట్టుతూ మరణించుచూ యుగములు పోయి మళ్లీ యుగాలు వస్తూ ఉంటాయి అందుకే అది శాశ్వతములు). భగవద్గీత యందలి ఈ శ్లోకముల యందు అశ్వద్ధ వృక్షము ప్రత్యేకించి మూడు పొరల (స్థూల సూక్ష్మ కారణ)మానవ దేహం పై ప్రకృతి సూత్రములు పనిచేయు విధానమును వివరించబడినది. ఈ సామ్యము విశ్వ ప్రకృతికి కూడా అన్వయము అగునప్పటికీ, ఇచ్చట మానవుడిని ఉద్దేశించి చెప్పబడినది.
సంసార వృక్షము-మానవ శరీరము మరియు మనసు:-ప్రపంచం నందలి అనేక గ్రంథముల యందు మరియు బైబిల్ నందు శాశ్వతమైన *సంసారవృక్షము అనగా మానవ దేహము మరియు మానవడి మనసు అని చెప్పబడినది*. యోగులు తమ 1.అతీంద్రియ జ్ఞానం నందు *చైతన్యము* అనబడు వృక్షము తలక్రిందులై ఉన్నట్లు గావించెదరు.
2. ఈ చైతన్యము *ప్రాణశక్తి*అనబడు తలకిందులై ఉన్న వృక్షము లోపల ఉన్నట్లు గాంచెదరు.
3. ఈ రెండును ఒకదానితో ఒకటి పెనవేసుకొని భౌతిక శరీరం యొక్క చిన్న మెదడు- వెన్నుకు ఉన్న నాడీ వ్యవస్థ అను తలక్రిందులైన వృక్షమునందు ఉన్న విధముగా దర్శించును.
(1. చైతన్యము అర్థము కారణ శరీరమందలి సంకల్ప మాత్రము శక్తులు.
2. ప్రాణశక్తి అర్థము సూక్ష్మ శరీరపు నాడీ వ్యవస్థ-ప్రాణ శక్తి ప్రవాహ మార్పులు యందు కలది.)
ఈ మూడు పొరల వృక్షము యొక్క వేర్లు అనబడు-
1. ఆలోచన స్రవంతి
2. ప్రాణశక్తి కాంతి
3.కపాలము నుండి వెలువడు నాడులు-కారణ, సూక్ష్మ, స్థూల శరీరముల వెన్ను అను కాండము పైన గల శాశ్వత విశ్వ చైతన్యము నుండి, పైనుండి క్రిందకు వేలాడుచున్నవి. మరియు ఈ వృక్షపు మూడు పొరల శాఖలు క్రిందకు వంగి ఉన్నవి.
బైబిల్ వృత్తాంతము:- "శ్యాం సన్" అను మిక్కిలి బలసాలి అయినా అసాధారణ శక్తిని కోల్పోనుటకు కారణము అతని తల వెంట్రుకలను"దలీలా ( స్త్రీ ) " కత్తిరించుటవలనే శ్యాంసన్ కొన్ని యోగా పద్ధతులను ఉపయోగించి తన వెంట్రుకల ద్వారా విశ్వ శక్తిని శూన్యము నుండి గ్రహించి ఉండవచ్చును.
దృశ్య రూప ప్రపంచమును తెలుసుకొను నిజమైన జ్ఞానము (ఆకులు యోగపరంగా జ్ఞానేంద్రియములు) సంసారవృక్షమునకు మూడు విధములైన ఆకులు ఉన్నవి. వృక్షము యొక్క ఆకులను గ్రహింప గలిగిన శక్తిని కలిగి ఉండును. ఆత్మ మూడు పొరలుగా ఉన్న దృశ్య ప్రపంచం నుండి (అనుభూతి ప్రాణ శక్తి అవగాహన ఆసక్తి).
జ్ఞానమును (వేద మంత్రములను) మూడు విధములుగా ఇంద్రియ ఆకుల రూపమున(1.అనుభూతి,2. ప్రాణశక్తి 3.ఆలోచన ,అవగాహన శక్తి) పొందును. ఆకులను వేదమంత్రములుగా పోల్చి చెప్పినప్పుడు ఆకుల యందలి సున్నితత్వము, ప్రాణ శక్తి, మరియు వాటి "చిరు సవ్వడి" జ్ఞానమునకు చెందిన మంత్రములను సూచించినవిగా భావించవలెను.( చైతన్యముతో కూడిన పచ్చటి ఆకులు ప్రాణ శక్తిని సూచించును.)
ఉదాహరణకు భౌతిక సంసార వృక్షపు ఆకులు-శరీరమునకు, ఉపరితల చర్మంపై ఉన్న ఇంద్రియములు మరియు "మెదడు అందలి వాటి స్థావరములు" -ఇవి సున్నితమైనవిగా ఉండి పూర్తి జీవనముతో ఉండును. అవి అనుభూతిని గ్రహించి వాటి జ్ఞానమును తెలియజేయును. (అంటే కన్ను చూసింది, చెవి వినింది అన్నీ తెలియజేయును) వృక్షముల ఎండలి ఇంద్రములు అనబడు ఆకుల కదలిక - అనగా నరముల స్థావరముల యందు అనుభూతికి చెందిన కదలిక - వీటి ద్వారా శరీరమునకు చెందిన జ్ఞానము, ప్రపంచమునకు చెందిన జ్ఞానమును తెలిసి కొనగలము. (అన్ని విషయములను నరాల కదిలిక ద్వారా ఇంద్రియముల నుండి మెదడుకు చేరవేస్తుంది) ఇంద్రియ సంబంధమైన ఈ కదలిక వలన ,మనము రంగులను, రూపములను చూడగలము. ఆహారము రుచిని తెలిసు కొనగలము. మనిషి తన భౌతిక - శరీర ఇంద్రియ ప్రేరణను అంతర్గతముగా ఉన్న, సూక్ష్మ కరణ శరీరపు, ప్రాణశక్తి/చైతన్యము, అనబడు వృక్షములన్నింటి తో అనుసంధానము చేసినప్పుడు (సూక్ష్మ శరీరముతో ప్రాణ శక్తితో చూస్తున్నాడు కారణ శరీరంతో చైతన్యము) అతనికి భౌతిక ప్రపంచము శక్తి యొక్క నిజమైన జ్ఞానమును సిద్ధించును. ఆత్మసాక్షాత్కారము పొందిన వ్యక్తి అంతరంగము నందు ఉన్న పరమాత్మతో అనుసంధానమైనప్పుడు అతను వృక్షం వలె విస్తరించియున్న నరముల వ్యవస్థ, ప్రాణశక్తి ,మరియు ఆలోచనలు విశ్వ చైతన్యము నుండి వెలువడుచున్నవని గ్రహించును. ఆ విధముగా అతను సర్వజ్ఞుడను అనగా సకల వేదముల సారమైన జ్ఞానమును పొందిన వాడగును.
సాధారణ వ్యక్తి ఇంద్రియ జ్ఞానము నందు మునిగి ఉండును. వెన్నెముక అను (కాండము) చెట్టు యొక్క ఆకుల ద్వారా (ఇంద్రియములు) అట్టి ఇంద్ర జ్ఞానము వ్యక్తికి కలుగును. ఆకులు, కొమ్మలు అనబడు నరముల చివరన ఉండి, అనుభూతులను గ్రహింపగలుగు శక్తిని కలిగి ఉండును. ఆ విధముగా వ్యక్తి ఆకులు అనబడు ఇంద్రియముల నుండి స్పర్శ ,చూపు, వినికిడి, వాసన ,రుచి అను ఫలితములను పొందగలుగును. "ఆడం మరియు ఈవ్ కథ యొక్క ఆధ్యాత్మిక వివరణ"బైబిల్ నందు చెప్పబడిన, మొట్టమొదటి శ్రీ పురుషులను ఆడం మరియు ఈవ్ అందురు. వీరిని భగవంతుడు వనమందలి చెట్ల యందలి ఫలములను తినమని చెప్పను. కానీ తోట యందు మధ్య ఉన్న ఒక్క చెట్టు ఫలమును, తినరాదని హెచ్చరించెను. భగవంతుడు వారితో ఇలా అనెను. "మీరు తోట మధ్య ఉన్న వృక్షము యొక్క ఫలమును తినరాదు, దానిని ముట్టుకొలరాదు అట్లు చేసినచో మీరు మరణించెదరు. "
ఆధ్యాత్మికముగా దీనిని అర్థం చేసుకొనినచో మానవులైన ఆడం ఈవ్ లను భగవంతుడు పంచేంద్రియ జ్ఞాన వృక్ష ఫలములను తినమనెను. కానీ తోట మధ్య ఉన్న-అనగా మానవ శరీరము నందలి వృక్షం అరడి నరముల వ్యవస్థకు చెందిన- సంభోగ ఫలములు గురించి భగవంతుడు ఈ విధముగా చెప్పెను "శారీరక భోగానుభవము కొరకు ప్రయత్నింప వలదు. అట్లు చేసిన మీరు మరణించెదరు. "(మరణం అనగా ప్రస్తుత అమరత్వమును మీరు కోల్పోయెదరు).
భగవంతుడు తన సంకల్పానుసారము ఒక ఆజ్ఞ ద్వారా మొట్టమొదటి జంట ఆడమ్ మరియు ఈవ్ ను రూపొందించెను. భగవంతుడు వారిని ఈడెన్ అను తోట యందు తూర్పు దిక్కున ఉంచెను. అనగా వారి చైతన్యము అతీంద్రియ దివ్య అవగాహనకు చెందిన ఆధ్యాత్మిక నేత్రమునందు ( తూర్పు దిశన) కేంద్రీకరింపబడినది అని అర్థము. భగవంతుడు వారికి శూన్యము నందలి కారణ జగత్తున వారి ఆలోచనలను వారు అనుభవింప చేసి వాటికి ఒక స్వరూపమును కల్పించు శక్తిని ఇచ్చెను. అటువంటి అద్భుతమైన సృష్టింప గల శక్తి ద్వారా అనేకము కాబటి భూమిపై జనులను రూపొందించగలరు. భగవంతుడు వారికి "చూచుట ,తినుట" అనుజ్ఞానం చే ఒకరు ఒకరు చూచుకొని, ఒకరి మాటలను మరి ఒకరు విని ఆనందించమని చెప్పాను. అదేవిధంగా ఇరువురు మాట్లాడుకొనుచు, ఆహారమును భుజించుచు, పుష్పముల వాసనను చూచుచు ,తాను సృష్టించిన వాటిని సృజించి ఆనందించమనెను. భగవంతుడు వారిని, వారి శరీరములను లైంగిక పరముగా పాక వలదని హెచ్చరించెను. అట్లు చేసినచో, వారి అవచేతన యందు నిక్షిప్తమై ఉన్న , మృగ జాతికి చెందిన లైంగిక పునర్ ఉత్పత్తి విధానమును మేల్కొల్పేదరని భగవంతుడు హెచ్చరించెను. వారు మనుష్య రూపము పొందక మునుపు మృగముల వలె ఉండి అట్టి లైంగిక విధానమును తెలిసి ఉండిరి.
అంతవరకు భగవంతుని సృష్టి యందు వివిధ జీవరాశుల రూపమున ఉన్న ఆత్మలు పరిణామ క్రమమున పై స్థాయికి చేరుతూ చివరకు ప్రవృత్తి కలిగిన జంతువుల స్థాయికి చేరెను. ఆపై భగవంతుడు జంతువుల యందు పరిణామ క్రమమున ఉన్నత స్థాయిని చేరిన ఆత్మలను మానవ శరీరములందు ప్రవేశింప చేయదలచి, మానవ శరీరములకు ప్రతిరూపమైన ఆడం ఈవ్ లను సృష్టించెను.
మొట్టమొదటి మానవ శరీరములు
1.పరిణామ క్రమమున
2. మానవ జాతిని కల్పించుటకు భగవంతుని సంకల్పముగా ప్రత్యేక సృష్టిగా ఏర్పడినది. జంతువులకన్నను మానవులు ఉన్నత స్థాయికి చెందినవారు. వారికి విశిష్టమైన చిన్న మెదడు ,వెన్ను స్థావరముల యందు దివ్యమైన ప్రాణము, చైతన్యము ఉన్నందువలన వారికి మాత్రము సంపూర్ణ దివ్యత్వమును (దైవమునకు చెందిన గుణము) ప్రకటింపగల సామర్థ్యములు, శక్తి ఉన్నవి. ఆ విధముగా మనిషి దైవత్వమును మరియు జంతు స్వభావము లక్షణములను కలిగిన వానిగా ఒక మానవ దేహముగా రూపొందెను."మనిషి పతనము యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ". స్త్రీ, పురుషులిరువురి అసలైన మూల రూపపు శరీరములు చక్కగా ఉండి, ఇరువురి యందు జనన అవయవములు లేకుండెను. భగవంతుని ఆజ్ఞను వారు అతిక్రమించిన పెదపనే వారికి జననావయవములు ఏర్పడెను."వారు నగ్న రూపంలో ఉండిరి. వారికి సిగ్గు అనునది తెలియకుండిరి". అటువంటి స్థితి అందు వారి యందలి అనుకూల ,ప్రతికూల (పాజిటివ్ ,నెగటివ్) స్త్రీ తత్వపు ,పురుష తత్వపు బుద్ధి, చిత్తము అను గుణములు ఒక వికృతమైన ఇంద్రియ సంబంధ కామముతో కూడిన ఆకర్షణలకు పరస్పరమైన పొందికతో సామరస్యంతో వారు యందు ఉండెను. అస్పష్టమైన పశువాంఛ్య జ్ఞాపకములు పురుషుని చిత్తము (ఈవ్) ను ప్రలోభరచినప్పుడు పురుషుని యందలి బుద్ధి (ఆడమ్) కూడా ఆ ప్రలోభమునకు లొంగిపోయెను. ఆడమ్ మరియు ఈవ్ ఒకరినొకరు ఇంద్రియ వాంఛతో కౌగిలించుకొని నప్పుడు వారి శరీరము లందు అప్పటివరకు జాగృతి కానీ స్థితి యందు ఉండిన కుండలిని శక్తి జాగృతమై వారి శరీరము నందు కామము పుట్టించు నరములను ఉత్తేజ పరిచెను. జాగృత మైన కుండలిని శక్తి ఊర్ద్రముగా పయనించిన ఎడల జీవిని భగవంతుని కడకు చేర్చును. లేక తానున్న స్థలము నుండి ఇంద్రియములను ఉత్తేజపరచును. ఆడమ్ ఈవ్ నందు ఈ విధమైన చలనము(నరములకు సంబంధించిన) కలిగినప్పుడు వారికి జననేంద్రియములు ఏర్పడెను.
బైబిల్ వాక్యము"ఆదామునకు అతని భార్యకు భగవంతుడు చర్మపు దుస్తులను తొడిగెను."అనుకూల శక్తి అయినా ఆడమ్ బుద్ధి అను పురుషత్వమును ప్రధానంగా కలిగి ఉండుట వలన అతను పురుషుడయ్యాను. ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) ఈవ్ స్త్రీ తత్వపు చిత్తము ప్రధానంగా కలిగి ఉండుటచే స్త్రీ అయ్యను. ఈడెన్ అనబడు దివ్యచైతన్యపు స్థితి వారికి కనుమరుగు అయ్యెను. అప్పుడు వారు తాము దిగంబరులము అని తెలుసుకొని. వారిని వారు స్వచ్ఛమైన ఆత్మలుగా చూసుకొనలేకపోయిరి. ఆత్మల అద్భుతమైన మూడు పొరల శరీరము చైతన్యము, ప్రాణశక్తి మరియు అణువుల కాంతి స్థానమున వారికి స్థూలమైన పరిమితులతో కూడిన భౌతికముగా గుర్తింప తగిన శరీరము ఏర్పడెను.
ఆడం మరియు ఈవ్ యొక్క పతనము తరువాత వారి వారసులు, తమ సంతతిని ఉత్పత్తి చేయుటకు అసహ్యకరమైన, క్లిష్టమైన లైంగిక విధానమును అనుసరించవలసి వచ్చెను. ఆడం మరియు ఈవ్ వారి ద్వారా మానవజాతి, విశ్వసూత్రములను అనుసరించి మంచి, చెడుల ద్వందములను అనుభవింప వలసి వచ్చెను. మరియు మానవజాతి మరణమును బాధాకరమైన మార్పులను అనుసరించవలసి అనుభవింపవలసి వచ్చెను. ఏల అనగా ఆడమ్ మరియు ఈవ్ మృగజాతి లక్షణముల వైపు మరలుట వలన సర్వజ్ఞతతో కూడిన తమరత్వమును పోగొట్టుకొనిరి.
మానవజాతికి కారకులైన దివ్య మూల పురుషులు:-
బైబిల్ నందలి ఆదికాండము నందు ఆ విధముగా మానవజాతికి మూల పురుషుని యొక్క పతనము వివరించబడినది. కానీ హైందవ పురాణములు ఈ భూమిపై సృష్టింపబడిన మొట్టమొదటి మానవులను దివ్య పురుషులుగా స్తుతించుచున్నవి. వారు భౌతిక శరీరములను ధరింపగలిగి, వారి సంకల్పానుసారము దివ్యమైన ఆజ్ఞచే సంతానమును పొందగలిగిఉందడిరి.
హైందవుల ప్రాచీన పురాణమైన శ్రీమద్ భాగవతము నందు ఆడమ్ , ఈవ్ వంటి మొట్టమొదటి మానవులుగా స్వయంభువ మనవు (సృష్టికర్తకు జన్మించినవారు) అతని భార్య శతరూప (నిజ ప్రతి బింబము) పురుషుడు ,స్త్రీగా భౌతిక రూపములను కలిగి ఉన్నట్లు చెప్పబడినది. వీరి సంతానము దివ్యలోక పురుషులైన ప్రజాపతులను వివాహమాడి మానవజాతికి మూల పురుషులు అయిరి. ప్రకృతి మానవుడి అవతరణ కొరకు భూమిని నిర్మించెను. భగవంతుని చే సృష్టింపబడిన మొట్టమొదటి మానవ స్వరూపములుగా దివ్య ఆత్మ లుగా ఉండి సృష్టి పరిణామ క్రమమున ఉన్నత స్థితిలను పొందిరి.
రెండవ వర్గము వారు:-
మరికొన్ని ఆత్మలు, దివ్య లోకపు ఆత్మలుగా వారు మానవజాతిని కల్పించుటకు భూమిపైకి దిగివచ్చిరి. ఏ విధముగా చూచునను మొట్టమొదటి మనిషి ఆత్మ యొక్క పరిపూర్ణత్వమును వెలుబుచ్చుచుండెను. ఆడం మరియు ఈవ్ వంటి మొట్టమొదటి మానవులు మరియు వారి సంతానము ఈడన్ అను ఆధ్యాత్మిక నేత్రమును, దివ్యచైతన్యమును కలిగి ఉండి భూమిపై వారి జీవనము ముగిసిన పిదప వంతుడిని భగవంతుడిని చేరిరి. లేక దివ్యలోకమునకు వెళ్ళిరి. కానీ పతనమైన వారు (ఇంద్రియమునకు) లోనైనా మనుషులు పునర్జన్మ చక్రము నందు చిక్కుకొనిరి. కోరికలతో నిండి ఇంద్రియములతో పోల్చుకొని మానవుల గతి అంతే.
సాధారణ మానవులు తమ భౌతిక శరీరమునకు మూలము భగవంతుడు అను విషయమును అర్థం చేసుకొనక శరీరము అనేడి తోట యందు ఆకులు అను ఇంద్రియములతో ఉల్లాసముగా కాలము గడుపుదురు. కానీ యోగి తన మనసును కామముతో కూడిన స్పర్శ నుండి విడుదల చేయుటయే కాక ఇతర స్పర్శ సంబంధముల నుండి విడుదల చేసి, మరియు మనసును పంచేంద్రియ జ్ఞానము నుండి విడుదల చేసి తాను ఈడెన్ అను దివ్య లోకమును తిరిగి పొందును. అటువంటి యోగులు నరముల వ్యవస్థ ,ప్రాణశక్తి, చైతన్యము అను తలక్రిందులైన వృక్షము యొక్క ఊర్ధ్వ భాగం చేరి విశ్వ చైతన్యము అనబడు స్వర్గ లోకమును చేరేదరు.
సాధారణ మానవుడు శరీరమునకు చెందిన అశాశ్వతమైన ఇంద్రియ సుఖముల యందు మునిగి, నిరంతరమైన, ఎడతెగని ఆలోచనలతో తనను తాను అనేక దుఃఖములకు గురి కావించుకొనును. కానీ ఆత్మసాక్షాత్కారము పొందిన వ్యక్తి తనను సృష్టించిన భగవంతుడిని విశ్వచైతన్యముతో ఏకమై , మానవ శరీరము, మనసు -అది బ్రాంతితో కూడిన ఆలోచనల రూపము అని గ్రహించి, అట్టి శరీరము మనసు ఆత్మకు భగవంతుడని విశ్వచిత్రమును దర్శింప చేయగల ఉపకరణములు.
అందువలననే భగవద్గీత ఈ విధముగా చెప్పుచున్నది. భగవంతునీ శాశ్వత తత్వము నుండి సృష్టింపబడిన తమ త్రిగుణములతో కూడిన సంసార వృక్షమును అర్థం చేసుకొని వాడు సకల జ్ఞానమును( వేదముల సారము) పొందిన వాడు అగును.
15:2
అర్థం:-
సంసార వృక్షము యొక్క శాఖలు పైన, క్రింద వ్యాపించి ఉండి, అవి త్రిగుణములచే పోషింప బడుచుండును. దాని చిగురులు ఇంద్రియ గ్రాహ్య( శబ్ద స్పర్శాదులు) విషయములు దానివేర్లు క్రింద వరకూ వ్యాపించి, (తల నుండి చిన్న మెదడు వెన్నెముక ద్వారా మూలాధార చక్రము వరకు నరముల ద్వారా వ్యాపించి ఉండుటవలన కర్మలు చేస్తాడు.)మానవులను కర్మ బద్ధులను చేయును.
వ్యాఖ్యానం:-
సంసారవృక్షమును అశ్వద్ధ వృక్షముతో పోల్చుట ఇచ్చట మరింత విసదీకరించబడినది. దాని కొమ్మలు పైనకు, కిందకు వ్యాపించి ఉండును. కొమ్మలు ఉర్ద్వము నకు వ్యాపించుట అనగా మానవ శరీరం అందలి చైతన్యము సహస్రారము దిశ గా పయనించినప్పుడు అది ఉన్నత స్థితిలోకి చెందిన జ్ఞానమును చైతన్యమును కలిగించును. కొమ్మలు క్రిందకు వ్యాపించుట అనగా మనిషి యొక్క అవగాహన శక్తి భౌతిక శరీరమునకు చెందిన జ్ఞానమునకు, భౌతిక జీవనమునకు పరిమితమగును.
కొమ్మలు అనబడు నరముల వ్యవస్థ యందు ప్రవహించు శరీరము యొక్క ఊర్ద్ర భాగమున లేక అధోభాగమున కేంద్రీ కృతమగును. అట్టి కేంద్రీకృతమైన ప్రాణశక్తి, చైతన్యమును శరీరమునందలి అహము మంచి, కార్యశీల, చెడు (సత్వ, రాజస ) స్పందించు విధానమును అనుసరించి త్రిగుణములు వాటిని పోషించును. మానవుడు చేయు కర్మలు ప్రధానంగా వృక్షపు చిగుర్లు అనబడు అనుభూతుల నుండి ప్రారంభమగును. అదియే ఇంద్రియ గ్రాహ్య విషయములు. అనగా చూచుట, వినుట (శబ్ద స్పర్శ రసాధి గుణములు) మొదలైనవి. ఈ అనుభూతులు అనగా చూచుట, వినుట, వాసన, రుచి, స్పర్శను తెలియజేయు నరముల చివర యందు పెరుగుచుండును. పరిశీలించిన లోతైన నిగూఢ భావమును పరిశీలించిన ఇంద్రియ గ్రాహ్యములు అనబడు వాటిని ఇంద్రియ అనుభూతులకు కారణమైన చిగుర్లు అనబడు శక్తులు అని వీటిని నిర్వచించవచ్చును. అనగా శబ్దము-చెవి వినగలుగునది; తాకుట/నిరోధించునది-స్పర్శ తెలుయునది; రూపము లేక రంగు కన్నులు చూడగలిగినవి; కమ్మదనము నాలుక తెలుసుకొన కలుగు రుచి; వాసన-ముక్కు తెలుసుకొన గలుగునది. ఉన్నతమైన మానసిక స్థితికి చెందిన ఈ గుణముల యందు సహజముగా, నిగూఢముగా పంచ మహా తత్వము సూక్ష్మ తరంగములు ఉన్నవి. ఈ శక్తులు త్రిగుణములతో కలియుట వలన జ్ఞానేంద్రియములుగా మరియు జ్ఞానేంద్రియములు అవగాహన చేసుకొను గుణములుగా ఏర్పడి చివరకు ఇంద్రియ గ్రాహ్యము లేక అనుభూతి గా రూపొందును.
కోరిక బీజములు మనిషిని కర్మలు చేయుటకు ప్రేరేపించును:-
సంసార వృక్షం యొక్క ప్రధాన వేర్లు ఉపరితలంపై చైతన్యము నందు ఉండును. కానీ ద్వితీయ శ్రేణికి చెందిన వేర్లు మెదడు నందలి అవచేతన ,అధి చేతన యందు ఇమిడి ఉండును. సన్నటి ఈ వేర్లు గత జన్మల యందలి కోరికల వలన మంచి చెడు కర్మల వలన ఉత్పన్నమైన ఇష్ట అయిష్టముల వలన కలుగును. (ఇదియే సంస్కారములు.) మరియు దాని సంతానమైన వాసనలు లేక (కోరికలు బీజములు.) అవి నరముల వ్యవస్థతో క్రింద వరకు వ్యాపించి భౌతిక ప్రపంచం నందు మానవులకు, ఇంద్రియములకు దిగజారి ఉండును. అవియే మానవుడిని కర్మ చేయుటకు ప్రోత్సహించును. మనిషి అందలి పాత అలవాట్లు, కోరికల సెగ చిహ్నములు మనిషిని ఆ అలవాటును అనుసరించి మంచి లేక చెడు కర్మలను చేయుటకు ప్రోత్సహించును.
సర్వమునకు ఆదిమూలము ఆ భగవంతుడే. కానీ మానవుడు తాను ఉన్న స్థితిని తానే ఏర్పరచుకొనును. మనిషి గత జన్మల యందు తానుగా కల్పించు కొనిన సంస్కారములు, వాసనలు మరియు ప్రస్తుత జన్మ యందు అతని గుణములు-వాటి పరిణామ ప్రభావమునకు ప్రతిస్పందించు కోరికలు అతనిని ఆ కోరికలు తీర్చుకొను టకు అనేక జన్మలు ఎత్తు విధముగా ప్రేరేపించును. ఆ విధముగా అతను సంసార వృక్షమును పోషించి దాని శాశ్వత తత్వమునకు సహకరించును. మరియు అనేక జన్మల యందు దాని నరముల వ్యవస్థ మరణ మరలా మొలకెత్తి భౌతిక స్వరూపమును పొంది(భౌతిక స్వరూపమును పొంది) వృక్షముగా స్థిరపడునట్లు చేయును. ఈ విధముగా మానవులు తమ కోరికల ప్రభావముచే జనన, మరణలకు బద్ధులై ఉందురు. ఈ కారణము చేతనే అశ్వద్ధ వృక్షమును సంసారం వృక్షముతో పోల్చదరు . అట్టి సంసారము ఒక ప్రాపంచిక భ్రమ అది మనిషిని పునర్జన్మల చక్రము యందు బిగించుటకు కారణమై ఉన్నది.
15:3 & 4 శ్లోకాల అర్ధాలు:-
ఈ సంసార వృక్షం యొక్క అసలైన తత్వము, దాని మొదలు ,అంతము, ఎడతెగని దాని విధానములు-వీటి యందు దేనిని సాధారణ మానవులు అర్థము చేసుకొన జాలడు. జ్ఞానులు బలమైన వేర్లు కలిగి దృఢమైన అశ్వద్ధ వృక్షమును, వైరాగ్యము అను బలమైన గొడ్డలిచే నరికి, దానిని నిర్మూలించి; "అనాది అయినా సృష్టిక్రమము ఆది పురుషుని నుండే వెలువడినది. అట్టి ఆది పురుషుని యందు నేను శరణు జొచ్చెదను".అని స్మరించుచు జ్ఞానులు తమ ఉన్నత లక్ష్యమైన దివ్య పరమాత్మను చేరెదరు.; దివ్య పరమాత్మను చేరిన వారు భౌతిక ప్రపంచమునకు తిరిగి రారు.
వ్యాఖ్యానం:-
చైతన్యము,ప్రాణ శక్తి, నరముల వ్యవస్థ అను మూడు లక్షణములు ఉన్న వృక్షము.(సూక్ష్మ శరీరంలో ఒక వృక్షము లా ఉంటుంది) మానవుల యందే ఉన్నను, మానవుడు తనను తాను అర్థము చేసుకొనలేదు. మరియు ప్రకృతిని అర్థము చేసుకొనలేడు. 1. విధానము:-నిత్యము మార్పును చెందుతూ అంతు చిక్కనటువంటి విశ్వ ప్రకృతి- మానవుడిని నిర్గాంత పరుచును.
బైబిల్ వాక్యము:- భ్రాంతితో కూడిన అజ్ఞానమనకు లోనైనా, సాధారణ గురించి ఏసుక్రీస్తు ఈ విధముగా పలికెను."వారు చూచుచుందురు కానీ చూడరు, వారు వినుచుందురు కానీ వినరు, వారు అర్థం కూడా చేసుకొనలేరు".
ప్రాపంచిక జీవనమున లోతుగా పాతుకపోయినా అలవాట్లు అను వేర్లు కలిగిన సంసారము అనబడు తన యందలి అశ్వద్ధ వృక్షమును చేదించుటకు ఒక జ్ఞాని మాత్రమే వైరాగ్యము, కోరికలు లేకపోవుట అను గొప్ప శక్తి కలిగిన గొడ్డలిని ఉపయోగించుటకు దృఢ నిశ్చయముతో ఉండును. అతను మాత్రమే, అట్టి లక్ష్యమైన భగవంతుడిని పొందగలరు.(కోరికలు అనే వేర్లను-గొడ్డలి)
ప్రాపంచిక వ్యక్తి ఇంద్రియ సుఖములు, అహంకారము అనబడు దట్టమైన సంసార వృక్ష *ఆకుల* క్రిందన ఉండి, ముక్తిని కలిగించు *విశ్వచైతన్యము* అను ఆకాశమును చూడలేడు. కానీ చిత్తశుద్ధి కల సాధకుడు, విచక్షణను, యోగసాధనను ఉపయోగించి తన మనసు నందు, అవచేతన, అధిచేతన మనసు నందు పాతుకు పోయిన ప్రాపంచిక కోరికలను, పాత అలవాట్ల చే ప్రేరేపింపబడును, కార్యకలాపములను ఒక చావు దెబ్బ కొట్టును. ఆ విధముగా స్పష్టతను భంగపరచు భౌతికమైన భ్రమ అను వృక్షమును పడగొట్టి సాధకుడు ఆకాశము అనేడి అనంతమును దివ్యమైన తన్వయత్వపు స్థితియందు దర్శించును. అచ్చట సాధకుడు తన శరీరము అను సంసారవృక్షమునకు, విశ్వము అనబడు సంసార వృక్షమునకు
"ఆది మధ్య అంతము విశ్వ చైతన్యము అని గ్రహించును."
"భగవంతుడే సర్వము" అను జ్ఞానము సాధకుడికి కలిగినప్పుడు, మరియు అతని యందు ప్రస్తుత, గత జన్మల కోరికలు అన్నియు నశించి పోయినప్పుడు అతను పూర్తిగా ముక్తిని పొందినవాడు అగును. మరియు ఇట్టి చైతన్యముతో కూడిన మానసిక స్థితిని తాను దేహముతో పని చేయునప్పుడు కూడా నిలిపి ఉంచుకొనును.(నిర్వికల్ప సమాధి స్థితి). విశ్వ సూత్రములు అతనిని పునర్జన్మలను పొందు విధముగా ఒత్తిడిని కలిగింపలేవు.
15:5 & 6 ఒక విభాగము,
అవ్యక్త పరమాత్మ నివాస ప్రదేశము:-
15:5
అర్థం:-
గౌరవ ప్రతిష్టలను కోరనివారు భ్రాంతి నుండి హానికరమైన బంధముల నుండి విముక్తమైన వారు కోరికలను త్యజించిన వారు, సుఖ దుఃఖములను, ద్వందముల నుండి జయింప బడిన వారు, ఆత్మ యందే స్థితులు అయిన వారు వివేకవంతులు-
వ్యాఖ్యానం:--
మార్పు చెందని స్థిరమైన పరమపదమును చేరును. మాయను జయించి విశ్వ చైతన్యమున ప్రవేశించిన జీవి నిరంతరమైన విశ్వాస దివ్యానందముతో నిండిపోవును. భ్రాంతికి చెందిన సాపేక్షత నుండి విముక్తుడై భగవంతునితో ఏకమైన, జీవి యొక్క మార్పు చెందని ఆత్మను-
1.ప్రకృతికి చెందిన చలన ప్రవాహ తరంగము ల రూపము మైన (గర్వము).
2. మార్పు చెందు భావోద్వేకములతో కూడి, అప్రయత్నంగా కలుగు కోరికలు.
3. దుఃఖమును కలిగించు బంధములు.
4 .ఊగిసలాడు స్వభావము కలిగిన విరుద్ధ స్వభావ ద్వందములైన సుఖదుఃఖములు. పై నాలుగు భంగపరచలేవు.
15:6
అర్థం:-
సూర్యుడు ,చంద్రుడు, అగ్ని ప్రకాశింపని ప్రదేశమే నా దివ్యమైన పరంధామము.(నిశ్చల పరబ్రహ్మ). అచ్చటకు చేరిన జీవులు మరలా జన్మించరు.(సూర్యుడు,చంద్రుడు, అగ్ని, ఇవన్నీ ప్రకృతిలో సృష్టింపబడినవి). సృష్టికి ఆవల ఉన్నవారే నిశ్చల పరమాత్మ.
వ్యాఖ్యానం:-
క్రిందటి మూడు శ్లోకములలో ప్రస్తావించబడిన కల్మష రహితుడైన యోగి.. అతను శరీరమును దాల్చి ఉన్నను, లేక భౌతిక ప్రపంచమును కూడావీడి దివ్య పరమాత్మ యందు శాశ్వతంగా ఉన్నవాడైనను.. అతను భగవత్ ఐక్యము నందు శాశ్వతముగా స్థితుడై ఉండును. అతను శరీరంతో ఉన్నప్పుడు తన చైతన్యమును ఊర్ద్వ ముఖము గావించి, శారీరక "ప్రాణశక్తి అగ్నిని" దాటి వెన్ను స్థావరముల యందు ప్రతిబింబించు క్రియాశీల కాంతి (creative light), లేక వెన్నులను దాటి, సూక్ష్మ శరీరం అందలి వేయిదల పద్మము (1000 లోటస్) యొక్క సూర్యకాంతిని దాటి సమాధి స్థితిని పొంది పరమాత్మతో ఐక్యమగును. ఆ విధముగా అతను అక్కడి నుండి విశ్వ చైతన్య మండలమున ప్రవేశించును. అది దివ్య పరమాత్మ యొక్క సర్వోత్త తృష్ఠ నివాసము. అచ్చట సూర్యచంద్రుల యొక్క, సృష్టి కారక అగ్ని యొక్క, లవలేశమైన తరంగ ప్రకంపనలు ఉండవు.
ఉపనిషత్తుల యందలి జ్ఞాన సారాంశము భగవద్గీత యందు కలదు. (ఉపనిషత్తులు అనగా వేదముల సారము.. భగవద్గీత యందు ఈ శ్లోకమున చెప్పబడిన సారాంశము ఉపనిషత్తుల యందు ఈ విధముగా చెప్పబడి ఉన్నది). ఎచ్చుట సూర్యచంద్రులు, నక్షత్రములు, మెరుపులు తదేక దృష్టితో చూచుటకు సాహసింపవు అచ్చట నా అవ్యక్త రూప నివాసము నందు నేను ఉండదను. అదృశ్య రూపమున ఉన్న కాంతి, దృష్టి యందలి కృత్రిమమైన కాంతి యందు వెలుగుచుండును.
యుగాంతమును భగవంతుడు తన అదృశ్య రూప కాంతిని ఉపసంహరించుకున్నప్పుడు ప్రకృతి యందలి అన్ని దీపములు తమ ప్రకాశమును కోల్పోవును. అదే విధంగా ముక్తిని పొందిన యోగి చివరకు భగవంతుని యందు ఐక్యతను పొందినప్పుడు, అతను పునర్జన్మను లేనివాడై ఉండగా, అతని ఆత్మ యందు ప్రకాశించు భగవంతుడు, అతని మూడు శరీర దీపములను ప్రకాశింపజేయడు. ఈ మూడు శరీరములు భగవంతుని తత్వము చేరి ఎడారి యందలి ఎండమావి వలే అదృశ్యమగును.
సర్వ వ్యాపక పరమాత్మ యొక్క అవ్యక్త రూపము శాశ్వతముగా ఎటువంటి తరంగములు లేక ఉండును. సూర్యుడు, చంద్రుడు, అగ్ని… వాటి విశాల విశ్వరూపమున, మరియు సూక్ష్మ రూపమున, అన్నియు ప్రకృతి సాగరమున అలజడి వలన ఏర్పడిన విశ్వ తరంగమునకు చెందినది.
ఎత్తైన జలపాతము దిగువన ఏర్పడు నీటి సుడిగుండము జలపాతం పైనున్న తటాకమును భంగ పరచలేదు (ప్రభావితం చేయలేదు). అదేవిధంగా విశ్వ చైతన్యం ద్వారా ఏర్పడు "తరంగ సుడిగుండము (సృష్టి)" విశ్వ చైతన్యము లోపల అలజడిని కలిగించలేవు. వర్ణించడానికి వీలులేని, అతి సూక్ష్మమైన, అనంతమైన పరమాత్మ యొక్క తరంగ రహిత దివ్యానందం యందు అతి సూక్ష్మమైన కాంతి తరంగం లేక దాని చలనం కూడా ఉండవు.
15:7 నుండి 15 వరకు ఒక విభాగం "(పరమాత్మ ఆత్మక ఎట్లు రూపొందును)"
15:7
అర్థం:
నా యందలి శాశ్వత తత్వమే భౌతిక జగత్తున జీవుల యందు ఆత్మ అయి ఉన్నది. అది పంచేంద్రియదాలను, మనసును తన వైపు ఆకర్షించుకొని ప్రకృతి యందు నిక్షిప్తమై ఉన్నది.
వ్యాఖ్యానం:
భగవంతుడు సాగరం - జీవులు అందలి కెరటం, జీవుడు పరమాత్మ నందు భాగమే, కావున వాస్తవంగా జీవుడు పరమాత్మ నుండి వేరు కాడు. మాయ యొక్క ప్రభావంచే భగవంతుని విశ్వ చైతన్యము నందు ఒక భాగము. ప్రకృతి సమకూర్చిన శరీరం ధరించి, ఆ శరీరం నందు బాహ్యమైన పంచాంగ జ్ఞానం అంతరంగం అందు మనసు అనే మరో ఇంద్రియం కలిగి ఉన్నది. ఆత్మ ఈ విధమైన ఆరు ఇంద్రియాలతో సాపేక్షతతో కూడిన ప్రపంచం నందు వ్యవహరించును.
పరమాత్మ సాపేక్షత దోషములు తనకు అంటని విధంగా తాను ఒక్కడే ఉండును. అతను తన అద్వితీయమైన దివ్య జ్ఞానంచే, సర్వజ్ఞత కలిగి చైతన్యంచే తెలిసి ఉండును. కానీ మానవుడు సంక్లిష్టతతో కూడిన వాడు. అతను ప్రకృతి యందలి విశ్వమాయకు చెందిన సంక్లిష్టమైన సాపేక్షితచే నిర్మింపబడినవాడు. అతను పరిమితులతో కూడిన అశాశ్వతమైన తన ఉనికిని, తన వెలుపల ప్రపంచాన్ని గ్రహించి అర్థం చేసుకొనుటకు అతనికి భ్రాంతితో కూడిన ఇంద్రియాలు అవసరమగును. పరిమితమైన సంఖ్య కలిగిన ఇంద్రియాలతో, పరిమితమైన వాటి శక్తిచే, అతను భగవంతుని నుండి వేరు పడినట్లు భావించును. మాయ యొక్క ప్రభావంచే అతను తనకున్న బుద్ధి స్వేచ్ఛను దుర్వినియోగ పరిచి, భగవంతునితో వేరుపడిన విధమును కొనసాగించును. చివరకు మానవుడు ఆ విధమైన బంధమునందు కొనసాగుటకు తిరస్కరించి, తన సహజ స్థితికి ఆకర్షించుకొను నిరంతరమైన భగవంతుని శక్తికి ఆత్రుతతో సహకరించును. ఆ విధంగా మానవుడు ప్రకృతితో సంబంధం తెంచుకొని, సర్వ వ్యాపక సృష్టికర్త హృదయమును చేరును.
ఒక 'వి (V)" ఆకారపు పాత్ర యందు విశాల ఆకాశం, చిన్న 'వి (V)" ఆకారం గానే ప్రతిబింబించును. అదే విధంగా భగవంతుని చైతన్యం వివిధ మానవుల యందు వివిధ రూపములగా ప్రతిబింబించును మరియు అనేక జీవరాశుల యందు అనేక రూపులుగా ప్రతిబింబించును, కానీ 'వి (V)" ఆకారపు పాత్ర నందు ప్రతిబింబించే ఆకాశం, విశాల ఆకాశతత్వం కన్నా భిన్నమైంది కాదు. అదేవిధంగా భగవంతుని అనంత చైతన్యం మరియు అన్ని జీవరాశులు యందున్న స్వచ్ఛమైన ఆత్మ రెండు ఒకటే. జీవుడు తనను శరీరంతో పోల్చుకున్నప్పుడు ఆత్మ శరీరంకు చెందిన పరిమితులను కలిగి ఉండును.
కావున మానవుడైనను, మృగమైనను పరమాత్మ ప్రతిజీవి అందు కలడు, కానీ భగవంతుడు కొద్దిపాటి అజ్ఞానం మాత్రమే కలిగిన మానవుల యందు, స్వచ్ఛత కలిగిన జీవుల యందు ప్రస్ఫుటంగా వ్యక్తీకరించబడి ఉండుటను చూడగలం. అజ్ఞానం లేక దుర్మార్గంతో కూడి పారదర్శకత లేని జీవుల యందు అతను ప్రస్ఫుటం కాదు. అజ్ఞానంతో నిండి ఇంద్రియాలపై అదుపు లేని జీవి క్రూరమైన పనులను చేయవచ్చు. అయినా అట్టి జీవి ధ్యానము చేత, జ్ఞానము చేత చీకటితో కూడిన తన అంధకారపు తొడుగు తొలగించుకొని పరమాత్మతో ఏకము కావచ్చును.
15:8
అర్థము:-
పరమాత్మ ఒక జీవుడుగా శరీరమును పొందినప్పుడు అతను తనతో పాటు మనసును ఇంద్రియ జ్ఞానమును తీసుకొని వచ్చును. గాలి పుష్పముల యందలి వాసనను తనతోపాటు తాను వీచు ప్రదేశమునకు తీసుకొని వెళ్ళు విధముగా పరమాత్మ జీవుని శరీరమును వీడునప్పుడు (మరణించినప్పుడు) అందలి మనసును ఇంద్రీయ జ్ఞానమును తీసుకొని పోవును.
వ్యాఖ్యానం:-
మునుపటి శ్లోకమునందు తెలిపిన సూక్తిని -"శాశ్వతమైన పరమాత్మ యందలి ఒక భాగమే జీవుడు ".
బలపరచుచు ఈ శ్లోకమున జీవుడే భగవంతుడు అని చెప్పబడినది. కేవలము దైవ శక్తి చే మాత్రమే మానవులు శరీరమును పొందుచున్నారు, మరియు అట్టి దైవ శక్తి చే మాత్రమే ఆ శరీరములు పోషించబడి చివరకు త్యజింపబడుచున్నవి.
ప్రస్తుత శ్లోకము మానవుని సూక్ష్మ శరీరము లేక లింగ శరీరము అతని మనసునకు ఇంద్రియ జ్ఞానమునకు, ఇతర జీవన సూత్రములకు నిలయమని తెలుపుచున్నది. మానవుని సూక్ష్మ శరీరము జీవుని పునర్జన్మల యందు అతనితో పాటు వచ్చును. ఆ విధముగా సూక్ష్మ శరీరము ప్రతి నూతన భౌతిక శరీరమును ప్రాణముతోను, ప్రజ్ఞతోను నింపును. భౌతిక శరీరము మరణించినప్పుడు అందలి లింగ శరీరము భౌతిక శరీరమును విడుచును. మరణించిన భౌతిక శరీరము పంచభూతముల యందు నిర్జీవ పదార్థముగా మిగిలి పోవును.
15:9
అర్థం:-
పరమాత్మ జీవునిగా మనసును, ఇంద్రియ జ్ఞాన విషయములైన వినికిడి, చూపు ,స్పర్శ రుచి, వాసనను, తనయందు కలిగి ఉండి ఇంద్రియ ప్రపంచమును అనుభవించును.
వ్యాఖ్యానం:-
బైబిల్ ఈ విధముగా తెలుపుచున్నది."ఓ ప్రభువా నీవు సమస్త విషయములను సృష్టించితివి. నీవు వాటిని నీ సంతోషము కొరకు సృష్టించితివి."
హైందవ శాస్త్ర గ్రంథములు సైతము భగవంతుడు" తన లీలగా, అతని క్రీడగా" మానవులను, జగత్తులను సృష్టించెను అని తెలుపుతున్నది. జీవుల రూపమున పరమాత్మ తాను సృష్టించిన జగత్తుల యందలి ఆనందమును అనుభవించును.
15:10
అర్థము:-
జీవాత్మ శరీరమునందు ఉండుట గాని, శరీరమును విడిచి వెళ్ళుట కాని, గుణములతో కూడిన ప్రపంచమును అనుభవించుట కానీ అజ్ఞానులు తెలుసుకొనలేరు. జ్ఞాన నేత్రములు తెరిచి ఉన్నవారు మాత్రము అతనిని చూడగలరు.
వ్యాఖ్యానం:-
సాధారణ మానవుని యందు త్రిగుణములు పనిచేయుచున్నందున వాటి కారణముగా అతని యందు ఉన్న అవగాహన శక్తి మరియు గుర్తింప గలుగు శక్తి, ప్రపంచమున బాహ్యమున కంటికి కనపడు విషయములను మాత్రము చూడగలుగును. అంతకు మించి సాధారణ వ్యక్తి అంతర్లీనముగా తన జీవితము నందు ఉన్న దైవ శక్తి ప్రాముఖ్యతను గమనింప లేడు. అతను ఎక్కడ నుండి వచ్చెనో ,ఈ భూమిపై అతను ఉండుటకు గల కారణములు మరియు చివరికి అతను ఎక్కడికి వెళ్ళునో అతనికి తెలియదు. జన్మించుటకు కారణమైన రహస్యము అతనికి తెలియదు. జన్మించిన పిదప మరణము అతనికి సమీపమున ఉండును. అయినను జీవిత విషయమున లోతైన పరిశీలన అవసరము అని అతను భావింపడు. భగవంతుడిని ధ్యానించుట వలన జ్ఞాన నేత్రము తెరువబడును. అప్పుడు అతను అనంత పరమాత్మ పరిమితి కలిగిన అశాశ్వతమైన సృష్టి విషయముగా ఉండుటను గ్రహించును. మరియు ఆ పరమాత్మయే సర్వమునకు కారణ భూతమైన ఏకైక శక్తి అని గ్రహించును.
మనిషి యొక్క ప్రాపంచిక దృక్పథము (ప్రపంచమునే చూడ గలగడం.) అతను పునర్జన్మలు ఎత్తునట్లు చేయును. ఈ జీవితము భగవంతుని స్వప్న నాటకము అని అతను తన అంతరంగమున అనుభవ పూర్వకముగా గ్రహించ గలిగినప్పుడు అతను పునర్జన్మలను పొందడు. అప్పుడే అతను తన జీవితమునకు చెందిన అంతిమ పాఠమును నేర్చిన వాడు అగును.
15:11
అర్థం:-
ముక్తి కొరకు తీవ్ర ప్రయత్నం చేయు యోగులు పరమాత్మ తమ యందే కలడు అని గ్రహింపగలుగుదురు. కానీ అంతఃకరణ శుద్ధి లేని వారు, జీవితముపై నియంత్రణ లేని వారు ఎంత ప్రయత్నించినను అతనిని గ్రహింపలేరు.
వ్యాఖ్యానం:-
తరగని ఉత్సాహము కలవారు, ఇంద్రియ చాపల్యమును త్యజించిన వారు, వినయభావమును కలిగి యోగ సాధనను నిరంతరము చేయువారు తమ అంతరంగమునందలి పరమాత్మను చూడగలరు. కానీ సత్ గ్రంధ పఠనము మాత్రమే చేయుచు అదియే తమకు జ్ఞానము కలిగింపగలదని భావించు వారు, నైతిక సూత్రములను జీవితము నందు అనుసరింపని వారు, తీవ్రమైన శ్రద్దా భక్తులు లేక యోగ సాధనను చేయువారు-వారు ఆశించిన ఆధ్యాత్మిక ఫలితములను పొందలేరు. అనేకమంది యోగ సాధకులు తమ యోగ సాధనను ఒక క్రమ పద్ధతిన చేయక అస్తవ్యస్త రీతిన చేయుదురు. అట్టివారు సాధన యందు ప్రగతిని సాధింపలేరు. తీవ్రమైనది అనిపించు ధ్యాన సాధన చేసినను వారు భగవంతుడిని అనుభవ పూర్వకముగా తెలుసుకొనలేరు.
ముక్తి సాధనకు పతంజలి అష్టాంగ యోగ విధానమును సూచించెను. సత్ గ్రంధముల యందు సూచించిన నైతిక ప్రవర్తనను జీవితమున ఖచ్చితముగా పాటించుచు, తెలిపిన యోగ విధానము నందు తెలిపిన అనేక దశలను పాటించిన వారు జ్ఞానమును పొందగలరు. యోగ విధానము నందలి దశలు క్రింద తెలిపిన విధముగా ఉన్నవి.
అష్టాంగ యోగ విధానము:-
1.యమ:-నైతిక ప్రవర్తన, అహింసా, సత్యసంధత, దొంగలింపక ఉండుట, సహనము, తనది కాని దానిని కోరక ఉండుట.
2.నియమ:- మానసిక, శారీరక పరిశుభ్రత, అన్ని పరిస్థితుల యందు సంతృప్తుడై ఉండుట, ఆత్మ నిగ్రహము, ఆత్మ పరిశీలన. మరియు గురువు దైవము మీద భక్తి.
3.ఆసనము:-సరి అయిన భంగిమ (ధ్యానములో), ధ్యాన సమయంలో వెన్ను నిటారుగా ఉండవలెను, మరియు శరీరము స్థిరముగా సుఖాసమున ఉండవలెను.
4.ప్రాణాయామము:- ప్రాణ శక్తి పై అదుపు.
5.ప్రత్యాహార:- నరముల నుండి సంకేతములను మనసునకు అందజేయనీయక మనసును ఇంద్రియముల నుండి వేరుచేసి, దానిని (మనసు) అంతర్ముఖము గావించు శక్తి.
6.ధారణ:-భగవంతుని స్వరూపమైన ఓం శబ్దముపై అంతర్ముఖము గావింపబడిన మనసును క్రేంద్రీకరించి ధ్యానము చేయుట. (ఇంద్రియములకు బానిస అయిన సాధారణ మానవుడు విశ్వ తరంగ శక్తి /పరిశుద్ధ ఆత్మ/భగవంతుని స్వరూపము అయినా ఓం శబ్దముపై మనసును కేంద్రీకరింప లేడు. యోగి తన అదుపు నందు ఉన్న అంతర్ముఖము గావింపబడిన మనసును భగవంతుడికి అర్పించును. ఇతరులు ఆ విధముగా మనసును భగవంతునికి సమర్పింపలేరు.)
7.ధ్యానము:- విశ్వ చైతన్య స్థితిని అనుభవించుట. అనంతమైన దివ్యానందపు ఎరుక వృత్త కారములో వ్యాప్తి చెందుట, జగత్తు అంతటా ప్రతిస్పందించుచున్న విశ్వ ఓం శబ్దమును భగవంతునిగా అనుభూతి చెందుట, అవగాహన చేసుకొనుట.
8.సమాధి:-ఆత్మ పరమాత్మలో లయమగుట.
పతంజలి యొక్క అష్టాంగ యోగ మార్గము ఒకటవ అధ్యాయము 4,5,6 శ్లోకముల యందు మరియు నాల్గవ అధ్యాయము 28వ శ్లోకమునందు వివరించబడినది.
15:12
అర్థము:-
సమస్త జగత్తును ప్రకాశవంతము చేయు సూర్యకాంతి, చంద్రుని కాంతి, అగ్ని యందలి కాంతి-ఇవన్నీయు నా యొక్క తేజస్సు అని తెలుసుకొనుము.
వ్యాఖ్యానం:-
క్రిస్టియన్ బైబిల్ నందు క్రింద తెలిపిన వాక్యములు ఉన్నవి." భగవంతుడు వెలుగు ఉండవలెను అని పలికెను. వెంటనే వెలుగు ఏర్పడను; వెలుగు మంచిదై ఉన్నట్లు భగవంతుడు చూచెను."భగవంతుడు విశ్వ చైతన్యమును ప్రకంపించి సూక్ష్మమైన కాంతిగా ఏర్పచెను. అనగా ఆ కాంతి ఇతర శక్తులైన వాయువు,ద్రవ,ఘన పదార్థములతో కలిసి సృష్టిని ఏర్పరచుటకు అనువుగా ఉండెను. ఆ ఇతర శక్తులు అయిన వాయువు, ద్రవ ,ఘన పదార్థము లన్నియు ఒక్క పరమాత్మ కాంతి నుండి వెలువడిన విభిన్న శక్తులు. ప్రజ్ఞతో కూడిన ప్రాణశక్తి అను కాంతి అనగా ఒక వాక్యము( బైబిల్లో చెప్పినది)-సృష్టి యందు విశ్వచైతన్యపు మొట్టమొదటి రూపము. భగవంతుని దివ్య శక్తి ఉదృతముగా ప్రకంపించినప్పుడు, ఆ ప్రకంపనలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఆటమ్స్ గా (పరమాణువులుగా) ఏర్పడి జగత్తుల నిర్మాణము జరిగెను.
విశ్వశక్తి నుండి ఏర్పడిన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, పరమాణువుల యొక్క స్థూలమైన కాంతి నుండి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏర్పడెను. విశ్వశక్తి ,విశ్వ చైతన్య నుండి ఏర్పడెను. కావున చివరకు అవ్యక్త పరమాత్మ యొక్క హృదయమే సూర్యుడు ,చంద్రుడు, అగ్నిగా ఏర్పడెను. మరియు అవ్యక్త పరమాత్మ హృదయమే విశ్వమునందు ఇతర వస్తు విషయములుగా శక్తులుగా ఏర్పడెను.
సూక్ష్మ స్వరూపమైన మానవుని యందుగల ఆత్మ ద్వారా భగవంతుని విశ్వ చైతన్యము ప్రకంపించును. అట్టి ప్రకంపనమే మనిషి సహస్రారము మందలి సూక్ష్మమైన వెలుగు రూపమున సహస్ర దళ పద్మముగా ఉండును - అదియే సూర్యుడు. అట్టి సూర్యుడు వెన్ను చక్రముల యందు తన ప్రతిబింబ స్వరూపము (చంద్రుడు) ద్వారా ప్రాణ శక్తితో శరీరమును అంతటిని (జగత్తులను) ప్రకాశవంతము చేయును. వెన్ను చక్రముల యందు తేజస్సుతో ఉన్న శక్తియే అగ్ని.
15:13
అర్థము:-
నా ప్రకాశము చే భూమి అంతటినీ ఆవహించి అందలి జీవులను నేను పోషించెదను. ద్రవ రూప చంద్రుడిగా నేను వృక్ష రాశిని కల్పించి పోషించెదను. "సోమ రసాత్మకః"
వ్యాఖ్యానం:-
పరమాత్మ యొక్క సర్వవ్యాపక దివ్యకాంతి జగత్తు నందలి జీవరాశిని ఇతర సృష్టి పదార్థమును, ఇతర శక్తులను కల్పించును. పరమాత్మ దివ్య కాంతి నిరంతరము ప్రసరించు చుండుట వలన జీవరాశి ఇతరము, ఇతర శక్తులు ఆ కాంతి చే పోషించబడును.
సినిమా ప్రొజెక్టర్ నుండి వెలువడు కాంతి ఆగిపోయినచో తెరపై చిత్రములు మాయమగును. అదేవిధంగా పరమాత్మ తన సృష్టికారక దివ్యకాంతిని ప్రసరిం పనీయక ఆపినచో శూన్యము అను తెరపై ఏర్పడు జీవరాశి దృశ్యములు తక్షణమే కనుమరుగై పోవును. (ప్రళయ కాలమున పరమాత్మ తన దివ్య కాంతిని ఉపసంహరించుకొనును.)
ఈ శ్లోకము నందు భూమి, ప్రాణి కోటి, చంద్రుడు, వృక్ష రాశి వీటన్నిటినీ కలిపి చెప్పబడినది. అట్లు చెప్పుట యందు వాటి మధ్యన గల సన్నిహిత సంబంధము వ్యక్తము అగుచున్నది. "భగవంతుని విశ్వ కాంతి ఈ భూమిని కల్పించును". ఈ భూమియే సమస్త ప్రాణి కోటికి ఆవాసము. నీటిని ఇతర ద్రవపదార్థములను పరిపాలించు చంద్రుడు వాటి ద్వారా వృక్ష రాశిని పెంచి పోషించును.
భూమి ,ప్రాణకోటి ఉత్పాదక శక్తి కలిగిన చంద్రకాంతి, మూలికలు, వృక్షములు వీటి నివాసము, భక్షింపునవి, భక్షింపబడునవి వివిధ కార్యకలాపములను నిర్వర్తించు సమస్తము ఒక్క విశ్వ కాంతి నుండి ఏర్పడినవే.
మరింత లోతైన భావముతో పరిశీలించినచో ఓం శబ్దము అనగా సృష్టికారక తరంగము విశ్వశాంతిగా ఏర్పడి జీవరాశిని కల్పించి, వాటిని పోషించు, జీవశక్తిగా ఉన్నది. నిర్జీవ పదార్ధములు కూడా భగవంతుని శక్తిచే వాటి యందలి పరమాణువుల కారణముగా జీవశక్తిని కలిగి ఉన్నవి. ప్రకృతి యందలి మూల పదార్థము రూపు దాల్చుట వలన జీవరాశి ఏర్పడి పోషింపబడుచున్నది. ఇవి అన్నియు భగవంతుని సృష్టికారక కాంతిరేఖల విభిన్న రూపములే.
ప్రత్యేకించి మానవుని విషయమున "భగవంతుడు ప్రకృతి రూపమున", " ఆత్మ అహము రూపమున", మానవుడి శరీరమును నిర్మించి పోషించుచుండును. అట్టి శరీరమును ఇతర సృష్టి విషయములను అహము తానుగా దర్శించునదై ఉండును. (అహము తనను తాను చూచు కొనెదే కాక చుట్టూ ఉన్న విషయములను దర్శించును). అహము నుండి పంచేంద్రియ జ్ఞానము అట్టి జ్ఞానమును కలిగిన మనసు, కర్మేంద్రియములు, ఇంద్రియ గ్రాహ్యములు జనించును. (ఘన , ద్రవ , కాంతి, వేడి, వాయువు, ఆకాశ రూపములు కల్పించును).
సోమరసాత్మక:
అను పదములకు "నీటితో కూడిన చంద్రుడు" అని అర్థము వచ్చును. మరియు చంద్రుడి ముఖ్య లక్షణము ద్రవము లేక రుచి కల అనగా రసాత్మకము అని తెలియవచ్చును. ఆ విధముగా చంద్రుడు భూమిపై ఉన్న ద్రవ పదార్థములపై వృక్షరాశిపై తన ప్రభావమును చూపును, కానీ యోగ విధానము నందు పరిశీలించిన మరి ఒక విభిన్నమైన అర్థము స్ఫురించును. సోమ అనగా చంద్రుడు ప్రకృతి అయి ఉన్నాడు. అతని వెలుగు పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపము.
సోమ=చంద్రుడు= ప్రకృతి.
ప్రకృతి= భగవంతుడు.
రస=చైతన్యవంతమైన
ఆత్మక=కుదింపబడిన.
ఆత్మ=అహం (మనసు, ఇంద్రియములు ఆత్మను సరిగా అర్థం చేసుకోలేదు అందుకనే ఆ కుదింపు పోయిన ఆత్మ అహము). సంక్షిప్తంగా భగవంతుడు తనను అహముగా వ్యక్తపరుచు కొనుచున్నాడు.
అట్టి వెలుగు నందు సృష్టి మూల తత్వములు పరమాత్మ యొక్క దివ్య ఆనందము కారణంగా ఏర్పడినవి. రసాత్మక అనగా ప్రకృతి తనను సూక్ష్మ రూపమున వ్యక్తపరచు కొనిన చైతన్యవంతమైన ఆత్మ లేక అహము. రస అనగా చైతన్యవంతమైన, ఆత్మక అనగా ఆత్మ యొక్క కుదింపబడిన రూపు అనగా అహము.(మనసు ఇంద్రియములు తమకున్న పరిమిత శక్తిచే ఆత్మను కుదించిన రూపము గా అనగా అహముగా చూచును)
వెన్ను చక్రముల యందలి ఇంద్రియ జ్ఞాన శక్తులు బాహ్య ప్రపంచమును ఏ విధముగా అవగాహన చేసుకొనును:- మానవుడు భూమిపై తనకు కనపడు అనేక దృశ్యములను చూచును. అతను ఘన పదార్ధ భూమిని, నీటిని, అగ్నిని చూచును. గాలి వీచుట వలన ఆకులు కదులుట చూచును. విశాల ఆకాశమును అహం ప్రధానంగా ఉన్న మనుషులు కార్యకలాపములు చేయుటను చూచును. అతను వివిధ కార్యకారణ సంబంధము విషయములను తనకు గల గ్రహింపగలుగు శక్తులచే వాటి స్థూల సూక్ష్మ తత్వము లను అనుసరించి తెలుసుకొన కలుగును.
1. భూమి:- ఘనపదార్థమైన భూమి ఒక స్థూల రూపమున వ్యక్తమగు చుండును. అట్టి దానిని మనిషి పంచేంద్రియములు అన్నిటిచే గ్రహించి తెలుసుకొనగలుగును. పంచేంద్రియ జ్ఞానము సూక్ష్మ రూపమున, సూక్ష్మ శరీర వెన్ను స్థావర చక్రముల యందు జనించును. అవి మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము వరకు ఊర్ద్వ గమనమున క్రమముగా మొదట వాసన, రుచి, చూపు, స్పర్శ, వినికిడి జ్ఞానము గల ఆయా చక్రముల యందు జనించును.
2. నీరు:-నీటిని ఘ్రాణ (వాసన) శక్తి తప్ప మిగిలిన అన్ని జ్ఞానేంద్రియములు ద్వారా తెలుసుకొని వచ్చును.
3. కాంతి:- నీటికన్న సూక్ష్మమైన కాంతిని చూపు, స్పర్శ (కాంతి యొక్క వేడిని స్పర్శ ద్వారా గ్రహింపవచ్చును). వినికిడి ద్వారా గ్రహింపవచ్చును. కాంతికి వాసన. రుచి ఉండవు. (శబ్దము లేక తరంగము కాంతి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన లక్షణము).
4. గాలి:- కంటికి కనపడని గాలి స్పర్శ ,వినికిడి ద్వారా గ్రహింపవచ్చును. (చూపు వలన గాలిని గ్రహింపజాలము. గాలి వీచుట వలన ఆకులు కదలుట, మేఘములు కదలుట ద్వారా చూడగలము. అంతియే గాని గాలిని చూడలేము).
5. ఆకాశము/శూన్యము:- అనంతము వరకు వ్యాపించి ఉన్న ఆకాశము /శూన్యము సూక్ష్మమైన అణువుల యందు కూడా వ్యాపించి ఉండును. అట్టి ఆకాశము/ శూన్యమును ఈధర్ అని కూడా చెప్పవచ్చును. ఆకాశము/ శూన్యము అన్ని రూపముల కన్నను అత్యంత సూక్ష్మమైనది. దీనినే వేదిక చేసుకుని విశ్వసృష్టి నడిపింపబడుచున్నది. దీని తరంగ శబ్దమును విశ్వ ఓం గా గ్రహింపగలము. విశ్వ నాటకము నందు ఇంద్రియ గ్రాహ్యములకు ఆవల (అవతల) వాటిని కల్పించిన , వాటిని గ్రహింపగలుగు అత్యంత సూక్ష్మమైన మనసు, అహము చైతన్యము కలిగిన మనిషి యందు కలవు. కావున ఘనపదార్థము, ద్రవపదార్థము, అగ్ని, కాంతి (శక్తి), వాయువు (ప్రాణశక్తి), మరియు ఆకాశము, మనసు, అహము అన్నియు ఒక్క చైతన్యమునకు చెందినవి. మరియు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నవి. కానీ వీటిని గ్రహించు మానవుడు వాటి స్థూల, సూక్ష్మ రూపము విషయముల గానే చూచును. (భిన్న విషయములు గానే చూచును).
స్థూల సూక్ష్మ విషయాలను గ్రహించి అర్ధము చేసుకొనుట మానవుని యొక్క గ్రహించు శక్తి, ఉపకరణములపై ఆధారపడి ఉన్నది:-
పాంచ భౌతిక విశ్వ జగత్తు, మనిషి అందలి మనసు, అహము- అన్నియు భగవంతుని విశ్వ చైతన్య కాంతి నుంచి ఏర్పడినది, కానీ ఇంద్రియములు, మనసు వాటి స్థూల రూపమలనె చూడగలదు. అహము మనసు నందలి వాటి సూక్ష్మ రూపములను చూచును. యోగి యందలి సూక్ష్మమైన, పరిశుద్ధమైన ఆధ్యాత్మికముగా పరిశుద్ధమైన అహమును ఆత్మ నుండి వెలువడు అతీంద్రియ జ్ఞానముచే గ్రహించి తెలుసుకొనగలుగును. (అహము తనను తాను తెలుసుకొనుట.) మనసు, ఇంద్రియములు తమకున్న పరిమితమైన శక్తిచే ఆత్మను కుదించిన రూపున అనగా ఆహ్వాముగా చూచును.
ఆత్మ ప్రకృతి యొక్క సూక్ష్మ రూపము:- భగవంతుడు అహము రూపములో ఉన్నాడు.
సోమ రసాత్మక: చంద్రుని వెలుగు పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపము అట్టి వెలుగు నందు సృష్టి మూలతత్వములు (పంచభూతములు) పరమాత్మ యొక్క దివ్యానందపు కారణంగా ఏర్పడినవి.
15:14
అర్థము :-
జీవించు ప్రాణి కోటి శరీరముల యందు వైశ్వానరుడనై (అగ్ని వంటి శక్తి) ఉన్నాను. మరియు జీవన శరీరముల యందలి ప్రాణ, అపాన శక్తుల ద్వారా పనిచేయుచు, వారి యందు ఆహారమును నేను నాలుగు విధములైన పద్ధతుల ద్వారా స్వీకరించి జీర్ణము చేసుకొందును.
వ్యాఖ్యానం:-
భగవంతుని విశ్వ కాంతి మానవుని జీర్ణకోశ వ్యవస్థ యందు వైశ్వానరుని రూపంలో ఉన్నది. అదియే ఆహారమును జీర్ణం కావించి జఠరాగ్ని. జఠరాగ్ని ప్రాణ -అపాన శక్తులతో కలిసి పనిచేయును. ఈ రెండు శక్తులు సక్రమముగా పనిచేయడం వలన శరీర పోషణకు అవసరమగు ఆహారము జీర్ణము కాబడి వంట పట్టును. అట్టి ఆహారము నాలుగు విధములుగా స్వీకరింపబడి జీర్ణాశయము చేరును. ఆహారమును స్వీకరించు నాలుగు విధములు:-
1 నమలుట.
2 జుర్రుకొనుట
3. నాలుకతో నాకి తినుట.
4.మింగుట.
ఒక యోగికి ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయము. అతను తాను స్వీకరించిన ఆహారము నుండి "వడబోసిన ప్రాణశక్తిని" గ్రహించి తన ప్రాణమును నిలుపుకొనును. అతను ఆహారమును నాలుగు విధములుగా స్వీకరించును. అవి
1 నమలుట (గట్టిపదార్ధములు)
2.జుర్రుకొనుట (ద్రవ పదార్థములు)
3. నాలుకతో నాకి తినుట.( నాలుకతో తినుట).(కేసరి ముద్ర పదో అధ్యాయంలో 28వ ఉన్నది)
4. మింగుట, (నములుట, జుర్రుకొనుట, నాలికతో నాకి తినుట ఈ మూడు పదాలు తో అవసరం లేకుండా నేరుగా మింగి తినుట.).(శ్వాస యందలి ప్రాణ వాయువు నుండి లేక అంతర్గత ప్రాణ ప్రవాహము నుండి ప్రాణ శక్తిని క్రియా యోగము ద్వారా మింగుట).
మానవుని శరీరమున అంతర్గతముగా మరియు ఉన్న విశ్వ ప్రాణశక్తి శరీరము పనిచేయుటకు అసలైన కారణమై ఉన్నది. అత్యాశతో కూడి, హితమును పాటింపక గత జన్మలయందు జీవించి ఉండిన యెడల, లేక ప్రస్తుత జన్మ యందు ఆ విధముగా జీవించిన ఎడల అది జీర్ణ రసముల, ఇతర గ్రంధులు శ్రవించుట యొక్క సక్రమమైన విధానమును భంగపరిచి ఆరోగ్యమునకు హాని కలిగించెను. శరీరమునందు "ప్రాణ ప్రవాహ శక్తికి భంగము కలిగినప్పుడు, అపాన ప్రవాహ శక్తి కూడా భంగపడి శరీరమునకు అనారోగ్యం కలుగును".
భగవంతుని విశ్వప్రాణ శక్తి చే శరీరమును స్వస్థపరచుట:-
దీర్ఘకాల అనారోగ్య సమస్యల యందు సాధారణంగా జనులు వాడు ఔషధములు ఫలితములను ఇవ్వలేకపోవచ్చును. అటువంటి వ్యక్తులకు భగవంతుని అపారమైన శక్తి యందు ఘాడమైన నమ్మకము సత్ ఫలితములను ఇచ్చును. అజీర్ణము వంటి సాధారణ శారీరక అస్వస్థలకు చికిత్స చేయు విధానము నందు శారీరక లక్షణములను పరిశీలించెదరు. కానీ మూల కారణమైన ప్రాణశక్తి ప్రవాహము నందలి అసమగ్రతను పరిశీలింపరు. సాధకుని నిరంతరమైన విశ్వాస ప్రభావము వలన పరమాత్మ సాధకుని శరీరమందలి ప్రాణ శక్తి యొక్క స్వస్థ పరచు శక్తిచే అద్భుతమైన రీతిలో శరీర మందలి అనారోగ్యమును పోగొట్టి స్వస్థత చేకూరినట్లు ఆదేశించును. నయము కానీ దీర్ఘకాల వ్యాధులతో బాధపడువారిని భగవంతుని సహాయమును కోరమని భగవద్గీత సూచించుచున్నది. భగవంతుడు మానవుని శరీరము నందే ప్రాణ అను స్వస్థపరచు శక్తిని కల్పించి ఉన్నాడు.
మానవుని శరీరము నందు అదృశ్యముగా ఆ పరమాత్మయే ఒక ప్రధాన పాకశాస్త్ర నిపుణుడై ఉన్నాడు. అతను (పరమాత్మ) ఆహార పదార్ధముల నుండి, ప్రాణవాయువు నుండి, సూర్య రశ్మి నుండి ప్రాణ శక్తిని వడబోసి శరీరమునకు శక్తిని సమకూర్చి పోషించుచున్నాడు. మానవ శరీరము అణువుల సమాదాయము చే నిర్మించబడినది. బాహ్యమైన జీవశక్తి పోషక పదార్థముల నుండి దైవ శక్తిని అణువుల రూపమున వడపోసి వాటిచే మానవ దేహంలో పోషించుచున్నది. సాధకులు అందరూ తమ శరీర ఆరోగ్య క్షేమము కొరకు భగవంతునిపైనే ఆధార పడవలెను అను దానిని గుర్తింపవలెను. ఇతర విధానములు అన్నియు శరీరమందలి జీవశక్తిని పాక్షికముగా మాత్రమే జాగరుకము చేయును. కావున సాధకులు తమకు భగవంతుని అదనపు సహాయము లేక స్వస్థత చేకూరుటకు అటువంటి విధానములపై పూర్తిగా ఆధారపడరాదు. భగవంతుని అదనపు సహాయము లేక ఔషధములు, ఆహార నియమములు, ఉపవాసము, ఇతర నివారణ పద్ధతులు నిష్ప్రయోజనము అను విషయమును గుర్తించు సమయము భవిష్యత్తున రావచ్చును. మనిషి యొక్క విశ్వాసము అతని అంతర్గతము నందు ఉన్న, ఉన్నతమైన దైవిక నివారణ శక్తిని జాగృతము చేయను." ప్రాణ శక్తి ఉన్నచోట సఫలత పై ఆశ (హోప్) కూడా ఉన్నది."
*పరమాత్మ అధీనమునందు ఉన్న శరీరము అంతటిని ప్రాణ శక్తితో నింపుట మరియు శరీరమును ఒక పవిత్రమైన దేవాలయం వలే కాపాడుట*:-నిజమైన యోగి క్రియ యోగము వంటి శాస్త్రీయ ప్రాణాయామమును ఆచరించి ప్రాణ యొక్క సంఘటిత ప్రవాహమును, అపానా యొక్క విసర్జిత ప్రవాహమును నిస్తేజ పరచి, వాటిని తన అదుపు నందు ఉంచుకొని, శరీర కణములు నశించి పోవుటను స్తంభింప జేయును. ప్రాణ, అపాన లను అదుపు చేయుట వలన, దాని మూలమున శరీరకణములు నశించి పోవుటను ఆపుట వలన, శరీరము దివ్యశక్తితో నిండి అది పరమాత్మ అదుపు నందలి పవిత్ర దేవాలయముగా పోషించబడును. భగవంతుని కొరకు సాధన చేయు నిజమైన సాధకులకు శరీర పోషణ ప్రాధాన్యమైనది కాదు. భౌతిక జీవనమునందు వారు అహం పూరిత కోరికలకు తావివ్వరు. కానీ వారు శరీరంపై తగు శ్రద్ధ వహించి దాని యందు గల భగవంతుని పూజించుట కొరకై దానిని స్వచ్ఛముగా ఉంచుటకు గట్టి ప్రయత్నం చేసెదరు.
క్రీస్తు ఈ విధంగా పలికెను "మీ జీవితము కొరకు, మీరు భుజించు ఆహారం కొరకు చింతింప వలదు". అనగా శారీరక అవసరంల కొరకై అధికముగా ప్రయాస పడరాదు. భగవంతుని సేవ కొరకై జీవింపవలెను. దాని కొరకు మాత్రమే భుజింపవలెను. అంతియే కానీ జిహ్వ చాపల్యమును సంతృప్తి పరచుటకు భుజంపరాదు. ఆ విధముగా( జిహ్వా చాపల్యము కొరకు)చేసిన అనారోగ్యము, కష్టములు సంభవించును. ఆరోగ్య విషయమున ప్రకృతి సూత్రములను పాటించ వలయును. మరియు శరీరంను దైవసాక్షాత్కారము పొందుట కొరకై పోషించవలెను. భగవంతుని ప్రేమను పొందుట కొరకై మానవునికి జన్మ లభించెను. చెడు అలవాట్లతో కూడిన భావోద్వేగ పూరితమైన జీవితమున గమ్యము లేక అటు ఇటు సంచరించుచు, మానవుడు పైన తెలిపిన లక్ష్యమును - భగవంతుడి ప్రేమను పొందుటను మరచిపోయెను.
15:15
అర్థము:-
సర్వ జీవుల హృదయముల యందు స్థితుడై ఉండు వాడను నేనే. జీవులకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, విస్మృతి (మరచి పోవడం), నా వలననే కలుగును. వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేనే. వేదములను తెలిసిన వాడను నేనే. వేదాంతములను రచించిన వాడను నేనే.
వ్యాఖ్యానం:-
ముందు శ్లోకములో తెలిపిన విధముగా భగవంతుడే మానవుని యందలి జీవము, మనసు, ఇంద్రియములు, ఆత్మ, అహము అంతేకాక మానవుని హృదయమందలి తలపునకు (ఫీలింగ్) కారణమగు శక్తి కూడా పరమాత్మయే. మానవులు, ఇంద్రియ జ్ఞాన శక్తులైన శబ్ద, స్పర్శాదులు తాము ఎదుర్కొను విషయములతో లేక తాము వ్యక్తులతో నిర్ణయించునది ఇట్టి శక్తియే. మానవుడు తాను అవగాహన చేసుకొనిన విషయములను, గ్రహించిన విషయములను ఒకచోట చేర్చి వాటిని జ్ఞాపకములుగా మిగుల్చును. అట్టి జ్ఞాపకములకు శక్తిని ఇచ్చి పోషించినది పరమాత్మయే. మానవుడు కాలక్రమమున తన జ్ఞాపకములను ఒక దానికి మరి ఒకటి కలుపుతూ తన జ్ఞానమును విస్తరింప చేసుకోనును. అతనికి అటువంటి శక్తిని ఇచ్చినది పరమాత్మయే. భగవంతుడే విశ్వ మాయ విశ్వ సమ్మోహన శక్తితో భ్రాంతిని కల్పించువాడు. మాయ మానవునిని యందలి దివ్య శక్తులైన పరిశుద్ధ స్మృతిని , జ్ఞాపకశక్తిని, జ్ఞానమును మరుగుపరిచి, ఆత్మను కించపరచు భావోద్వేగపులచే ఇష్ట అయిష్టములచే బ్రాంతిచే అజ్ఞానము చేప గట్టిగ స్మృతిని జ్ఞాపక శక్తిని జ్ఞానమును నశింపచేయును.
భ్రాంతి యందు మునిగిన మానవులు తమ శరీరములతో బంధమును తెంచుకొనెదరు. వారు జీవితమున తెలుసుకొను అనుభవములను తమవిగా భావించి, తమ అపేక్షను అనుసరించి అట్టి అనుభవములను తమకు అనుకూలముగా మార్చుకొందురు, కానీ మానవులు ఈ సృష్టి అను నాటకమును రచించినది భగవంతుడే అనునది మరచిపోయదరు మరియు మానవులే పాత్ర దారులుగా తాము నటించు పాత్రను, తమకు చెందిన భాగమును ఎంచుకొందురు.
ఒక సాధకుడు తనకు ముక్తిని ప్రసాదించు మార్గమునకు చెందిన పాత్రను ఎంచుకొనును. అతను భగవంతుడితో అనుసంధానం అగుటకు మిక్కిలి ప్రయాసపడును. అతను తన్వయత్వపు స్థితిని పొంది, జీవిత నాటకమున తాను ఎదుర్కొను మిక్కిలి కలతలను కల్పించు, కష్టములను కలిగించు విరుద్ధ స్వభావ ద్వందముల నుండి విముక్తిని పొందును. మానవుని
1 పరిమితమైన అవగాహన.
2 జ్ఞాపకశక్తి
3 హృదయము నకు చెందిన భావోద్వేగపు బంధము- ఇది ఒక శాసనము వలె మానవునిపై సాధకుడు గ్రహించెను, అవి భగవంతుని విశ్వనాటకము నందలి ఒక భాగమని అతనికి తెలిసి ఉండును. సాధకుడు స్వచ్ఛమైన తలపులతో, దివ్యమైన జ్ఞాపకశక్తితో, జ్ఞానముతో తాను ఆత్మ స్వరూపము అని గ్రహించినప్పుడు (అనగా ఆత్మసాక్షాత్కారము పొందినప్పుడు) , పైన తెలిపిన శాసనముల వంటి విషయములు అదృశ్యమై సాధకుడు వాటి పరిమితుల నుండి విముక్తుడు సాధారణ మానవుడు మాయకు చెందిన సమ్మోహన శక్తి యందు మునిగి అజ్ఞానమునందు నిలిచి తనకు తాను ఒక భౌతిక శరీరము అనే భావించును జ్ఞానము చెందిన మానవుడు తన దైవత్వపు స్థితి యొక్క జ్ఞాపకము జాగరుకము గావించి అట్టి జ్ఞాపకముల యందు సదా గురుకుడై ఉండును.
సర్వ వ్యాపక పరమాత్మక త తో అనుసంధానమై అతనితో ఒక్కడైన యోగి ఆ పరమాత్మ అందరి మానవుల హృదయము యందు, జ్ఞాపకముల యందు, అవగాహన శక్తి యందు స్థితుడై ఉన్న విధమును గాంచును. అంతేకాక తన మాయా ప్రభావంచే మానవుల హృదయముల యందు శక్తి, జ్ఞాపకశక్తి, అవగాహన శక్తిని వక్రీకరించి వారిని మోహమునకు గురి కావించును. మరియు ఆత్మసాక్షాత్కారమును పొందిన జీవుల యందు భ్రాంతికి గురి అయిన చైతన్య శక్తిని అతను నిర్మూలించును.
సకల జ్ఞానసారము భగవంతుడే. వేదముల యందలి వేదాంతముల యందలి జ్ఞానమునకు మూలము భగవంతుడే. సర్వజ్ఞత కలిగిన పరమాత్మ తెలుసుకోవలసిన సత్యములన్నింటినీ (వేదములన్నింటినీ) తెలిసినవాడు. సంపూర్ణ జ్ఞానము అయిన వేదాంతములను రచించిన వాడు అతనే. మానవుని గ్రహించు శక్తి యొక్క ప్రక్రియను అదుపు చేయువాడు సచేతన జీవుల యందలి చైతన్యము అతనే. అనగా దేవదూతల, దేవతల, యోగుల, సాధారణ మనుషుల , ప్రేతముల, జంతువుల, మరియు ఇతర జీవుల యందలి చైతన్యము అతనే.
ఆత్మ పరమాత్మ నుండి దిగివచ్చి మానవుని శరీరమును పొందు నంత వరకు గల వివిధ దశలను భగవంతుడు తెలిసినవాడై యుండును. శరీరమును పొందిన ఆత్మ యొక్క అవగాహన లను అన్నింటిని అతను తెలిసినవాడై ఉండును. మరియు ఆత్మ శరీరము నందు మాయకు గురి అయి ఉండగా ఆ శరీరపు ఇంద్రియముల నరముల వ్యవస్థ అనుభూతులన్నింటిని అతను తెలిసినవాడై ఉండును. ఆత్మ శరీరము నుండి ముక్తి మార్గమును అనుసరించి పరమాత్మ యందలి ముక్తిని పొందిన స్థితిని చేరు వరకు ఆత్మ అనుభవించు అవగాహన లను అన్నింటిని తెలిసినవాడై ఉండును.
కెరటములు అన్నియు సముద్రపు హృదయముపై నాట్యము ఆడును. అదేవిధంగా సచ్చేతన జీవుల అవగాహన ప్రక్రియను భగవంతుని యందు అతని నిరంతర జాగృతికత స్థితి యందు సంభవించును. సర్వజ్ఞుడైన ఆ అనంత పరమాత్మ సాగర హృదయముగా ఉన్న తనయందు కదలాడు ప్రతి అవగాహన కెరటమును, ప్రతి తరంగమును తెలిసినవాడై ఉండును.
15:16
అర్థం:-
ఈ విశ్వం నందు నశింప బడువారు, నశింప పడని వారు అను వివిధములైన వారు కలరు. జీవులన్నియు నశింపబడునవి.
వ్యాఖ్యానం:--
కూటస్థ చైతన్యము నశింప బడనిది. ఈ శ్లోకము ప్రకృతిని వివరించుచున్నది. విశ్వ ప్రకృతి నిత్యమైన మార్పులతో కూడి జీవకోటిని తనయందు కలిగి ఉన్నది(ఓం) మరియు మార్పు చెందని దివ్య ప్రజ్ఞ కూటస్థ రూపమున ప్రకృతి యందు అంతర్లీనముగా ఉండి ప్రకృతి స్వరూపమును తెలియజేయుచున్నది. (తత్).
15:17
అర్థము:-
వేరొక ఉన్నతమైన పరమాత్మ కలడు. అతనిని "సర్వోత్రుష్ణ చైతన్యము" అని చెప్పుదురు. అతనే శాశ్విత పరమాత్మ. మూడు లోకములను ఆవహించి వాటిని పోషించి అతనే. వేదములు "సత్- తత్- ఓం" అని చెప్పు దానిని బైబిల్ "తండ్రి- కుమారుడు- పరిశుద్ధాత్మ" అని చెప్పుచున్నది.
వ్యాఖ్యానం:
ఈ శ్లోకమునకు ముందు శ్లోకము భగవంతునికి చెందిన "ఓం" అను అంశమును , "తత్" అను అంశమును ప్రస్తావించి చెప్పబడినది. (ఓం=ప్రకృతి-అదృశ్య తరంగ శక్తి, పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మ, తత్- కూటస్థ ప్రజ్ఞ-కుమారుడు-సృష్టి యందలి కృష్ణ-క్రీస్తు చైతన్యము). (ప్రస్తుత శ్లోకము తండ్రి లేక "సత్ " అనబడు భగవంతుని అంశమును "ఈశ్వరునిగా" తెలుపుతున్నది. (సత్ = విశ్వ చైతన్యము-, నిరాకార పరబ్రహ్మము-సృష్టికి తండ్రి) అతనే సర్వోత్క్రష్ణ పరమాత్మ, సర్వోత్క్రష్ణ చైతన్యము, సర్వమునకు అతీతమైన-సర్వమునకు ఆదిమూలమైన కారణము-అతను సృష్టి యందు అంతర్గతముగా సర్వత్ర వ్యాపించి ఉన్నను,(తత్ రూపములో), సాధకుడు సృష్టి యందలి తరంగ శక్తి మార్పు చెందు స్థితిని అదిగామించ నంతవరకు ప్రకృతికి లేక మానవునికి అతను అందని వాడు-తెలియని వాడు.
15:18,19,20 అర్ధాలు
15:18అర్థము:-
జగత్ ప్రభు అయిన నేను నశించు వాటికన్నను వేరైనా వాడను. మరియు నశింపని వానికన్నను ఉన్నతుడను(ప్రకృతి కన్నా వేరైనా వాడను కూటస్తము కన్నను ఉన్నతుడను) .కావున జగత్తుల యందు, వేదముల యందు నన్ను పురుషోత్తముడు అని చెప్పబడినది. అనగా అత్యంత ఉన్నతమైన వాడు. ( Utter most beeing).
15:19
అర్థము:-
భరత వంశస్తుడైన ఓ అర్జున :- మాయ నుండి విముక్తులైన వారు నన్ను నిర్గుణ పరమాత్మగా గుర్తించెదరు. మరియు వారు సర్వమును తెలిసి ఉండువారు అట్టి వారు నన్ను సంపూర్ణమైన భక్తితో స్వీకరించురు. పాపరైతుడైయిన ఓ అర్జున అత్యంత నిగూఢమైన జ్ఞానమును నీకు బోధించితిని. దీనిని అర్థము చేసుకొని గ్రహించిన వ్యక్తి తాను నిర్వర్తించవలసిన ధర్మములు అన్నింటిని సంపూర్తిగా నిర్వర్తించిన వాడై కర్మబంధములు అంటక కర్తవ్య కర్మలను నిర్వర్తించు జ్ఞాని అగును.
15:20
అర్థము:-
అతీంద్రియ దివ్యజ్ఞాన అవగాహనతో మాత్రమే దివ్య పరమాత్మను తెలుసుగొనగలము. (అటువంటి అవగాహన ఎ వేదములు అని చెప్పబడు నిజమైన జ్ఞానము.
15:18,19,20 :- వ్యాఖ్యానము:-
సాధారణ మానవుడు మాయ నుండి విముక్తుడై నప్పుడు అతడు సర్వజ్ఞుడు అగును. అతను" విశ్వ సర్వజ్ఞ కాంతికి" దివ్య పరమాత్మ నుండి వెలువడుటను చూచును. అటువంటి దివ్య కాంతి యొక్క కిరణములు సృష్టి విషయములయందు నాట్యమాడు రీతిన ఉండుటను వాటి కార్యకలాపములకు అదియే కారణ మైన విధమును అతను గమనించును.
అల్ప జీవి అయిన మనిషి ఆత్మసాక్షాత్కారము పొందిన పిదప మానవుని రూపమున ఉన్న దైవముగా మారి అతని అనిర్విచనీయమైన ఆనందమున మునిగిపోవును. అతని ఆత్మ, అతని హృదయము, అతని మనసు, వాటి ఉపకరణముల తో (జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు) సహా అతని శరీరము అందలి ప్రతి అణువు పరమాత్మను ఆరాధించు అనంతమైన భావములతో పులకించి పోవును. ఆ స్థితియందు అతనికి సంభవించు అనుభవములు అన్నియు దివ్య పరమాత్మ, దివ్య ఆసన రూపమై ఉండును.
నిష్కల్మష మైన సాధకుని అతీంద్రియ అవగాహన విశ్వ చైతన్యము నందు విస్తృత పరచబడినప్పుడు అతనికి సర్వాతీత పరమాత్మ అంతర్గతముగా పనిచేయుట అవగతమగును. అతను భ్రాంతి నుండి విముక్తుడు అగుట వలన కర్మలు అతనిపై విధింపబడదు. జ్ఞానము నందు పదిలముగా స్థితుడైన అతను, భగవంతుడు తనకు ప్రకృతి ద్వారా ప్రసాదించిన ఉపకరణముల ద్వారా కర్మలను చేయును. మరియు అహముచే ప్రేరేపించబడు కర్మబంధముల యందు చిక్కుకొనక ఉండును.
అతను ధర్మములను నిర్వర్తించినప్పుడు అవి ప్రకృతి తన ధర్మమును నిర్వర్తించునదిగా ఉండును. (ఆ స్థితిలో అతను ప్రకృతిలో ఏకమై ఉంటాడు) మరియు నిస్వార్ధ సేవగా భగవంతునికి సమర్పించినది గా ఉండును. వారిని కృతకృత్యుడు(నెరవేర్చ వలసిన పనిని నెరవేర్చుట) అంటారు. అతడు కృతార్థ చరితుడు, మరియు కృత కర్ముడు. అతను సర్వోకృష్ణమైన సమాధి యందు భగవంతునితో ఐక్యమైన వాడు - అదే సమయమున పరమాత్మ రూపమైన సృష్టి యందు దివ్యమైన కర్తవ్యం కర్మలను నిర్వర్తించువాడు. (నిర్వికల్ప సమాధి స్థితి)
20 శ్లోకాల 15వ అధ్యాయము, పురుషోత్తమ ప్రాప్తి యోగం సంపూర్ణం