16 వ అధ్యాయము:-
"దైవ గుణములను అలవర్చుకొని అసుర గుణములను త్యజించుట"
16:1,2,3 శ్లోకాలు ఒక విభాగము;
"మానవుని భగవంతుని వలె చేయు ఆత్మ లక్షణములు":-
16:1వ శ్లోకము అర్థము:-
(దైవ లక్షణములు 26 కలవు).
దైవ గుణాలు:-దివ్య పరమాత్మ ఈ విధముగా పలికెను.
1. భయము లేకుండుట.
2. అంతఃకరణ శుద్ధి
3. జ్ఞానమును సంపాదించుటయందు యోగ సాధన యందు మత్తు విడవక పోవుట.
4. దానము.
5.ఇంద్రియ నిగ్రహము.
6. పవిత్రమైన యజ్ఞ కర్మలు చేయుట.
7. పవిత్ర గ్రంథ పఠనము.
8.తపస్సు.
9.ఋజత్వము.
16:2 వ శ్లోకము అర్థము:-
10. అహింస.
11. సత్య సంధత.
12. కోపము లేకుండుట.
13.పరి త్యాగము
14.శాంత స్వభావము.
15.పరనింద చేయకుండుట.
16. సర్వ జీవుల యందు దయ.
17.విషయముల యందు ఆసక్తి లేకుండుట.
18.మృదుత్వము.
19.ధర్మ విరుద్ధ కార్యములను చేయుటకు సిగ్గుపడుట.
20.చంచల స్వభావము.
16:3 వ శ్లోకము అర్థము:-
21. తేజస్సు.
22.క్షమా గుణము.
23.ఓర్పు .
24.శుచి.
25.ఎవరినీ ద్వేషించ కుండుట.
26.అహంభావము లేకుండుట -
ఓ భరత వంశస్తుడా దైవత్వంతో కూడి ఉన్న వ్యక్తి, పైన తెలిపిన గుణ సంపదను కలిగి ఉండును.
16:1,2,3 శ్లోకాలకు వ్యాఖ్యానము:-
దివ్య పురుషులందరూ తాము తెలుపు ఆధ్యాత్మిక విషయములను అనుమానమునకు తావు ఇవ్వని సూటి అయిన విధముగా తెలుపుతురు. అటువంటి విషయములు సాధన ప్రేక్షకులకు సాధ్యమా, లేక అసాధ్యమా అను విషయమును మనము పరిశీలింపక, వారు చెప్పిన విషయములు గొప్ప ఆధ్యాత్మిక ప్రయత్నములు చేయుటకు ప్రమాణ పూర్వకమైనవి (అవి అన్నియు నిరూపింపబడినవి) అని మనము గ్రహింప వలెను.16 వ అధ్యాయము సాధకులు ఆత్మసాక్షాత్కారమును సాధించుటకు అవసరమైన సత్వ గుణ లక్షణములను తెలుపుచున్నవి. మరియు ఈ అధ్యాయము మానవులు దైవసాక్షాత్కారమును పొందు విషయమును విఫలము చేయు తామసిక/చెడు లక్షణములను ఎత్తి చూపుచున్నది. ఈ అధ్యాయమున మొదటి 3 శ్లోకముల యందు 26 ఉన్నత గుణములను క్రింద తెలిపిన విధముగా పేర్కొనబడినవి.
1. అభయము:-నిర్భయత్వము అనునది ఒక అభేధ్యమైన కొండ వంటిది. అట్టి అభేధ్యమైన కొండ పై సాధకుడు తన ఆధ్యాత్మిక జీవనము అను గృహమును సాధించు కొనవలెను. అంతటి ప్రాముఖ్యత ఉన్నందున "నిర్భయత్వమును" మొట్టమొదటి సత్య గుణ లక్షణముగా సూచింపబడినది. *నిర్భయత్వము* అనగా భగవంతునిపై విశ్వాసము, అతని రక్షణ యందు విశ్వాసము, అతని న్యాయము, అతని జ్ఞానము, అతని దయ, అతని ప్రేమ, అతని సర్వవ్యాపకత్వము పై విశ్వాసము ఉండాలి.
ఆధ్యాత్మిక మార్గమున మిక్కిలి ధైర్యముతో సాగు సాధకుడు తన ప్రగతిని అడ్డగించు ఎటువంటి శత్రువును అయినను ఎదుర్కొనుటకు గొప్ప సామర్థ్యముతో కూడిన సాయుధుడై ఉండును. భ్రాంతికి చెందిన "అప నమ్మకము", "అనుమానము" అనునవి మొదటి శ్రేణికి చెందిన దాడికి చెందును. సాధకుడు భగవంతునిపై గల చెక్కుచెదరని విశ్వాసము వీటిని సమూలముగా నిర్మూలించును.
అదేవిధంగా *కోరికలు, వాటి ప్రలోభ శక్తులు* సాధకులు వాటిని తీర్చుకొనని యెడల అతని జీవితము ఆనందరహితమగునని అతనిని బుకాయించి బెదిరింపచూచును. కానీ అదే విధమైన చెక్కుచెదరని విశ్వాసమును భగవంతునిపై నిలిపి వాటిని నిర్మూలించున మానవుని యందు ఆత్మ యొక్క అజయమైన శక్తి ఉండును. కానీ మానవుని యందు "భయము" అనునది కలిగిన ఎడల అది ఆత్మ యొక్క "అజయమైన శక్తిని"కాజేయును. ఇంకనూ మానవుని యందు ప్రకృతి సహజముగా నిజమైన శక్తి ఒక సామర్ధ్యముగా పనిచేయుచుండును. భయము అనునది మానవుని యందు కలిగినప్పుడు అది దైవ శక్తి యొక్క సామరస్యమైన పనితనమును భంగపరుచును. అంతేకాక భయము మానవుని యందు శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా, "కలతను" సృష్టించును. మితిమీరిన భయము మనిషి గుండె పని చేయుటను ఆపి ఆకస్మిత మరణమును కలిగింపగలదు. చిరకాలము కొనసాగు మానసిక ఆత్రుత (క్రానిక్ యాంగ్జైటీ) మానసిక రుగ్మతను కల్పించి "దీర్ఘకాలము" బాధపెట్టు నరముల బలహీనతలను కల్పించును.
భయము అనునది మనసును, హృదయమును, చిత్తమును, శరీర భావముతో కట్టివేయును. అప్పుడు అంతర్గత చైతన్యము మానసిక, శారీరక బలహీనతను సంచరించుకొనును. పర్యవసానము ఆత్మ అహమనకు, శరీరమునకు భయమును కల్పించును. వస్తువుపై కేంద్రీకృతమగును.
అనుమానములు:
స్థిరమైన ఆత్మ ప్రశాంతతపై మనసును కేంద్రీకరించి శక్తిని అనుమానములు అడ్డగించును. దీనిని గ్రహించిన సాధకుడు తన మనసునుండి అన్ని రకములైన అనుమానములను తొలగించవలెను.
పురాతన కాలమున భారతదేశము నందు మరియు క్రైస్తవ సాంప్రదాయం నందు కూడా మునులు తమకు ఆటంకము కలగని విధముగా ధ్యానము చేసుకొనుటకు ఏకాంత నివాసమును ఏర్పాటు చేసుకొనుట ఒక వాడుకగా ఉండేది. అందుకొరకు వారు అరణ్యమునకు ఎడారులకు, పర్వత ప్రదేశములకు వెల్లడివారు. జనవాసమునకు దూరమైన ఈ ప్రదేశములు పాములకు, తేళ్లకు, వేటాడు క్రూర మృగములకు సహజమైన నివాస ప్రదేశము. భారత దేశమున ప్రస్తుత కాలమును కూడా ఏకాంత వాసము ఉండు మునులను చూచినవారు, అట్టి మునుల విషయమును కధలవలె చెప్పుచుందురు. అటువంటి మునులు ఏకాంతవాసమున పాములను, తేళ్లలను తమ సహచరులుగా కలిగి ఉందురు. అవి మిక్కిలి సౌమ్యంగా మునుల దేహముపై పారాడుతూ వారి శరీర వెచ్చదనమును అనుభవించుచుండును. మరికొన్ని ప్రదేశముల యందు భయంకరమైన పులులు సౌమ్యమైన పిల్లుల వలె ఆ మునుల సమక్షము ఉండును.13 వ శతాబ్దమున సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అశసి గుబియో ప్రాంతమునందలి క్రూరమైన తోడేలును లొంగదీసుకునిన పురాణ గాధ మనకు ఆశ్చర్యమును కలిగించును. సాధు సత్పురుషుల దివ్య శరీరముల నుండి వెలువడు, దివ్య తరంగములను మృగములు గుర్తించును. భగవంతుడిని ఎరిగిన సాధు సత్పురుషులు ప్రతి జీవి యందు పరమాత్మను చూచెదరు. వారు ఆ విధంగా పరమాత్మను దర్శించినది ఒక భ్రాంతి కాదు. ఒక వాస్తవ అనుభవము. సాధుసపురుషులు మృగములను, ఇతర జీవజాలమును చూచినప్పుడు ఏ విధమైన భయమును పొందరు. మరియు ఆ మృగము లేక ఆ జీవి యందు ఏ విధమైన భయమును కల్పించరు.
సంపూర్ణ జ్ఞానము పొందని వారు ఇటువంటి విషయముల యందు ధైర్యంతో పాటు జాగ్రత్తను కూడా పాటింప వలెనను సూచింపబడినది. మరియు వారు ధైర్య గుణమును కలిగి ఉండి అదే సమయంలో తమను తాము ప్రమాద బారిని పడనివ్వక కాపాడు కొనవలెను. మరియు తమ యందు అటువంటి సందర్భముల యందు ఇతర భయములు కలుగనివ్వక జాగ్రత్త పడవలెను. (అనగా తమ విశ్వాసమును ప్రదర్శించుటకు ప్రయత్న పూర్వక మైన అవకాశంలు కల్పించుకొని రాదు.) తమ విశ్వాసము యొక్క శక్తిని నిరూపింప ధైర్యమును ప్రదర్శించు అనేక అవకాశములను ప్రతి ఒక్కరికి భగవంతుడు యాదృచ్ఛిక రీతిన కల్పించును. మానవుని యందలి విశ్వాసమును అంతిమముగా పరీక్షించినది మరణము. అది జీవితమున ఒక్కసారి సంభవించును.
తప్పనిసరి అగు మరణము గురించి భయపడుట మూర్ఖత్వము. మరణము సంభవించిన పిదప ఆ అనుభవము గడిచిపోవును. మరణము వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిగత గుర్తింపును (ఆత్మ) నిజతత్వమును క్షీణింప చేయదు.
మనిషి యొక్క విశ్వాసమును పరీక్షించు మరి ఒక అంశము "అనారోగ్యము" . అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, తన వ్యాధిని పోగొట్టుకొనుటకు తీవ్ర ప్రయత్నంలు చేయవలెను. వైద్యులు రోగి జీవించ అవకాశము లేదు అని ప్రకటించినను, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రశాంతతతో ఉండవలెను. అట్టి సమయమున అనారోగ్యంతో ఉన్న వ్యక్తి భయమును పొందిన యెడల, *ఆ భయము సర్వజ్ఞుడైన దివ్య పరమాత్మ యొక్క ప్రత్యక్ష ఉనికిని అతని నుండి మరుగు పరుచును*. అతను ఆందోళన చెందుటకు బదులు స్థిరమైన ప్రార్థనను ఈ విధముగా చేయవలెను. - "నీ ప్రేమ పూర్వకమైన రక్షణ కోట యందు నేను ఎల్లప్పుడూ సురక్షితముగా ఉందును."(భగవంతుని ప్రేమ రక్షణగా ఉన్నప్పుడు , మనము జబ్బుకు భయపడ నవసరము లేదు). నయము కానీ వ్యాధి వలన ఒక నిర్భయస్తుడైన సాధకుడు, అతను మరణించు సమయమున తన మనసును భగవంతునిపై కేంద్రీకరించి శరీర పంజరం నుండి ముక్తిని పొంది మరణానంతరమున దివ్యమైన సూక్ష్మ లోకములు చేరుటకు సిద్ధముగా ఉండును. అటువంటి వ్యక్తి మరో జన్మ యందు శాశ్వత ముక్తిని పొందు లక్ష్యమునకు చెరువుగా ఉండును. భగవంతుని యందలి తన విశ్వాసమును, తన ఆత్మ యొక్క శాశ్వత తత్వ జ్ఞాపకములను నిరాశ, నిస్పృహలకు సమర్పించి భీతి తో మరణించిన వ్యక్తి నిస్తేజ మైన భయమును, బలహీనతను తన మరుసటి జన్మకు కొనిపోవును. మరుసటి జన్మ యందు ఈ చిహ్నములు అతనిని అదేవిధంగా విపత్తునకు గురిచేయును. మనిషి "కర్మ "నేర్పు పాఠములను నేర్చుకొనని యెడల ఒక జన్మదిన మరి ఒక జన్మ యందు కొనసాగుచుండును.
ధైర్యశాలి అయిన సాధకుడు ఓడిపోయిననూ (మరణించినను) అతను ముక్తి కొరకు చేయు యుద్ధము నందు గెలిచిన వాడగును. ఆత్మ చైతన్యము స్థూల శరీరమునకు చెందిన విపత్తులన్నింటినీ గెలవ గలదు అని మానవులందరూ గ్రహింపవలెను.
ఒక వ్యక్తి యొక్క అవచేతన (సబ్ కాన్సస్) యందలి భయముతో తరచూ అతని మనసున మెదలుచున్న, అతను బలమైన మానసిక శక్తితో వాటిని ప్రతిఘటించవలెను. అయినను ఆభయములు మనసున కదలుచుండిన అది మిక్కిలి లోతైన కర్మ ఫలితములకు సంకేతము. అటువంటి స్థితి యందు సాధకుడు మరింత గట్టి ప్రయత్నము చేసి తన మనసును ధైర్యముతో కూడిన ఆలోచనలతో నింపి, తన దృష్టిని ఇతర విషయములకు మరల్చవలెను. అత్యంత ముఖ్యమైన విషయము ఏమనగా, అటువంటి విషయముల యందు సాధకుడు నమ్మకమును ప్రసాదించు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉండవలెను. ఆత్మసాక్షాత్కారమును పొందుట కొరకు మనిషి నిర్భయత్వంతో ఉండవలెను. (మనకు వద్దన్నా పదే పదే ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా ఈ విధముగా మనము చేయవచ్చును.)
2. అంతఃకరణ శుద్ధి (సత్వ సంవృద్ది):- అంతఃకరణ శుద్ధి అనగా సత్యమును దర్శింపగలుగు మానసిక స్వచ్ఛత, నిర్మలత్వము కలిగి ఉండుట. మానవుడు తన మనసు నందు ఇంద్రియ గ్రాహ్య విషయములపై ఇష్టఅయిష్టములను తొలగించు కొనవలెను. బాహ్య వస్తువులపై ఇష్ట అయిష్టములు మనసును భౌతిక తరంగములతో మలిన పరచును. భిన్న స్వరూపములు కలిగిన ద్వందములు చిత్తమును ప్రభావితము చేయరాదు. (మనసును నిర్మలముగా ఉంచుకొనవలెను.) స్వచ్ఛమైన చిత్తము మాత్రమే ధ్యానము నందలి దివ్యానందమును పొందగలదు. క్రీస్తు ఈ విధముగా పలికెను. "హృదయము స్వచ్ఛముగా ఉన్నవారు ధన్యజీవులు వారు దైవమును చూడగలరు".
3.జ్ఞానమును సంపాదించుట యందు, యోగ సాధన యందు పట్టు విడువక పోవుట:-
(అనునవి ముక్తిని చేరుటకు అతి ముఖ్యమైనవి). తన డైనందిన జీవితము నందున సాధకుడు తన గురువు సూచించిన గ్రంథములో యందలి జ్ఞాన సూత్రములను పాటింపవలెను. మరియు క్రమము తప్పని యోగ సాధన యందు తనకు లభించు ప్రశాంతత యందు మునిగి ఉండవలెను. (ఆ ప్రశాంతతయే జ్ఞానము). జ్ఞానము సాధకుని సరియైన బుద్దిని అవగాహనను కల్పించి అతను అజ్ఞానమునందు, ఇంద్రియ సుఖముల లోతుల యందు పడనివ్వక రక్షించును.
4. దానము :-
దాన గుణము మిక్కిలి ప్రశంసనీయమైనది. అది మనసును విస్తృతపరుచును. దాతృత్వ గుణము, నిస్వార్థ గుణము గల స్వభావునికి ఆత్మను ఇతర ఆత్మల కన్నను ప్రాధాన్యతను ఇచ్చి భగవంతుని సమక్షముతో కలుపును. స్వప్న నాటక జీవితము నందు ఈ గుణము మానవుల యందు *నాకు చెందినది* అనుభ్రాంతి కరమైన యాజమాన్య భావమును నిర్మూలించును.( ఈ భావము బంధములను కలిగించును). సృష్టి యందలి సమస్తము విశ్వస్వాప్నికునికి (భగవంతుడు) చెందినవి. ఆ విధముగా ఈ భూమి నుండి ఉదారముగా మనకు లభించు సంపద అంతయు భగవంతుడు మనకు అప్పుగా ఇచ్చుచున్నాడు. భగవంతుడు మనకు ఇచ్చినది మనకు ఉపయోగపడి మరియు ఇతరుల కష్టములను తీర్చినదై ఉన్నప్పుడు దానిని వివేకముతో ఉపయోగించుకొనవలెను. నిజమైన సాధకుడు తన విశాల హృదయముతో అప్రయత్నంగానే స్వచ్ఛందముగా తన సంపదను, జ్ఞానమును, ఆత్మ పరిజ్ఞానమును ఇతరులతో పంచుకొనుటకు ఇష్టపడును. భగవంతుడిని ప్రేమించువారు అతని "అంతర్లీన వ్యాపకత్వమును గుర్తించిన వారు సహజముగానే అపారమైన నిస్వార్థ బుద్ధిని కలిగి ఉందురు".(అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్న భావము కలిగినప్పుడు నిస్వార్ధము సహజముగా వస్తుంది). అజ్ఞానముతో ఉన్న వారిని, బాధలచే దుఃఖించు వారిని చూచి ఏసుక్రీస్తు మిక్కిలి విలపించెను. ఏలా అనగా వారి రూపము నందున్న భగవంతుడు కష్టపడుటను అతను గమనించెను. ఈ జగత్తు నందలి సర్వజీవులపై ప్రేమ, కరుణ భావములను కలిగి ఉన్నవారు తమ జీవితమును, తమ సర్వస్వమును భగవంతుని సేవకై, అతని పిల్లల సేవకై సమర్పింతురు.
పేదలకు ధన సహాయము చేసినప్పుడు పేదలు ఆ ధనమును ఆహార పదార్ధముల కొరకు కాక మత్తు పదార్థముల కొరకు వినియోగించిన ఎడల అట్టి ధన సహాయము పాపమును పోషించినది అగును. అదేవిధంగా మానసికముగా విరుద్ధమైన ఎదురుతిరిగు స్వభావము ఉన్నవారికి, అర్థము చేసుకొను స్వభావము లేని వారికి జ్ఞాన బోధ చేయరాదు. కానీ విచక్షణ గల సాధకుడు వివేకంతో తన సంపదను,జ్ఞానమును, ఆధ్యాత్మిక సంపదను యోగ్యులైన వారితో, దాని అవసరము తెలిసిన వారితో మరియు గ్రహించు శక్తి గల వారితో పంచుకొనినప్పుడు అతను ముక్తి పొందుటకు అర్హుడగును.
5.దమము (ఇంద్రియ నిగ్రహము):-
దమము అనగా ఇంద్రియములు శబ్ద ,స్పర్శ ,రూప, రస, గంధాతులచే కల్పింపబడు ఉల్లాసకరమైన అనుభూతులచే ప్రభావితమైనప్పుడు వాటిని అదుపునందించు కొను శక్తి ఇంద్రియములపై పూర్తి అదుపును కలిగిన సాధకుడు ముక్తిని పొందుటకు అర్హుడై ఉండును. ప్రలోభములకు లొంగిపోవు వ్యక్తి ఆత్మజ్ఞానమును గ్రహింపలేక ఇంద్రియ విషములకు బందీ అయి ఉండును. ఇంద్రియ ప్రలోభమునకు ఒక్కసారి గురి అయినను ఆ అనుభవములను పొందు కోరిక మనసు నందు మరింత బలపడును. ఆ అనుభవములను మరలా మరలా పొందిన యెడల అది మనిషి యందు బలమైన అలవాటుగా మారును.
6.పవిత్రమైన యజ్ఞ కర్మలు చేయుట:-
వేదములు మరియు ఇతర గొప్ప సద్గంధములు మానవులు యజ్ఞ కర్మలను చేయుటను ఒక ఆదేశానుసారము సూచించుచున్నది. ఒక సాధకుడు తాను పొందిన ఆధ్యాత్మిక ప్రగతిని అనుసరించి నేతిని హోమగుండము నందు సమర్పించు భౌతిక యజ్ఞ క్రతువును చేయవచ్చును. లేక జ్ఞానాగ్ని యందు ప్రాపంచిక కోరికలను మానసికముగా సమర్పించవచ్చును. యోగి ఆత్మకు చెందిన తన్మయత్వము అను ఆధ్యాత్మిక హోమం నందు మనసునకు చెందిన చంచలత్వమును సమర్పించును.
చివరిగా మానవుని జీవితమంతయు ఒక యజ్ఞం అని భావించవలెను. అట్టి యజ్ఞం నందు మానవుని ప్రతి ఆలోచన, అతను చేయు ప్రతి కర్మ, భక్తి పూర్వక హృదయము చే శుద్ధి చేయబడి భగవంతునికి నివేదనగా సమర్పింపవలెను. (ప్రతి ఆలోచన భగవంతునికి సమర్పిస్తే అది యజ్ఞం అవుతుంది)
6. పవిత్రమైన నిత్య కర్మలు చేయుట :-
వేదములు మరియు ఇతర గొప్ప సద్గంధములు మానవులు యజ్ఞ కర్మలను చేయుటను ఒక ఆదేశానుసారము సూచించుచున్నది. ఒక సాధకుడు తాను పొందిన ఆధ్యాత్మికత ప్రగతిని అనుసరించి నేతిని హోమగుండము నందు సమర్పించు భౌతికమైన యజ్ఞం క్రతువును చేయవచ్చును. లేక జ్ఞానాన్ని యందు ప్రాపంచిక కోరికలను మానసికముగా సమర్పించవచ్చును. యోగి ఆత్మకు చెందిన తన్మయత్వము (సమాధి స్థితి) అను ఆధ్యాత్మిక హోమములను మనసుకు చెందిన చెంచలత్వమును సమర్పించును.
చివరగా మానవుని జీవితమంతయు ఒక యజ్ఞము అని భావించవలెను. అట్టి యజ్ఞము నందు మానవుని ప్రతి ఆలోచన , అతను చేయు ప్రతి కర్మ , భక్తి పూర్వక హృదయము చే శుద్ధి చేయబడి భగవంతునికి నివేదనగా సమర్పింపవలెను.
7. పవిత్ర గ్రంథము :-
స్వ అధ్యాయము ముక్తికి దారితీయును. సాధారణ వ్యక్తులు అనేక సద్ద్రంధములను చదివి వాటి భావమును అర్థం చేసుకొనలేక వాటిని ఆచరణ యందు ఉంచలేరు. కానీ సద్భక్తుడు తాను చదివిన సద్గంధముల భావమును గ్రహింప గలడు. గ్రంథ పఠనము, అందలి దివ్య బోధనలను సాధకుడు ఆచరించు విధముగా అవి అతనిని ఉత్తేజపరిచిన యెడల, ఆ పఠనము సాధకుడికి ఉపయుక్తము అగును. జ్ఞానముతో కూడిన ఆలోచనలు వ్యక్తికి నిరంతరమైన సహచరుల వలె ఉండిన, అవి అతనికి నమ్మకస్తులైన మార్గదర్శకులు గను, రక్షకుల గను ఉండును "(మన మంచి ఆలోచనలే మన మంచి స్నేహితులు)"
అన్ని యుగముల యందు దివ్య గ్రంథముల యందలి సిద్ధాంత పరమైన జ్ఞానము గల వృత్తిపరమైన ఆచార్యులకు మరియు నిజమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి కలిగిన వ్యక్తులకు మధ్యన వివాదము ఉన్నది. పండితులము అని గర్వించువారు వారికి అంతర్గతమైన జ్ఞాన దృష్టి లేక పోయిననూ వారు వారి పాండిచ్చేమును పొగుడు కొనుచుందురు. అట్టివారు భగవంతుడిని ఎరిగి
సత్య సందులై జీవించు వారిని అసూయతో చూసేదరు. ఆ విధముగాని ఏసుక్రీస్తు పారసీ పండిత వర్గము నుండి వ్యతిరేకతను ఎదుర్కొనెను. భారతదేశము నందలి అనేక సాధు సత్పురుషులు మరియు శ్రీ చైతన్య ప్రభువు వంటి దివ్యపురుషులు పండితులచే అవమానించబడిరి.
విముక్తి అనునది మేధాపరమైన జ్ఞానమును కలిగి ఉండుటవలన లభించదు. అటువంటి జ్ఞానము మనిషి యందు మార్పు కలిగించిన ఎడల ముక్తి లభించును. (అనుభవ పూర్వకమైన జ్ఞానము వలన ముక్తి కలుగును). ఒక వ్యక్తికి, వ్యక్తి అందలి జ్ఞానమునకు మధ్యన ఒక అనుబంధమైన సంబంధము ఉండవలెను. (పుస్తక జ్ఞానం ఉన్న వాళ్లకి - లడ్డు అనేది ఒకటి ఉంది అని తెలుసు కానీ అది తింటేనే దాని రుచి అంటే ఆచరణ తెలుస్తుంది) అట్టి సంబంధం వలన అతని జ్ఞానమునకు చెందిన సత్యము అతనిలో ఒక అంతర్భాగమై ఉండును. అప్పుడు అది దానికి విరుద్ధమైన ప్రలోభముల చేత, సందేహముల చేత అతని నుండి వేరు పడజాలదు. అదియే అతీంద్రియ జ్ఞానము లేక సాక్షాత్కారము. (మేధోపర జ్ఞానము అంటే పుస్తక జ్ఞానం మాత్రమే, అతీంద్ర జ్ఞానము అంటే అనుభవపూర్వకమైన జ్ఞానము.)
8.తపస్సు:-
తపస్సు అనగా వ్యక్తి తనను తాను అదుపు నందు ఉంచుకొనుట - బ్రహ్మచర్యము, ఆకలిపై అదుపు, శరీరమునకు అనేక విధములైన శిక్షణను ఇచ్చి చలి ,వేడి ఇతర అసౌకర్యములు మానసిక కలతలను కలుగ నివ్వకుండుట అను అంశములు అన్నియు తపస్సు నందలి భాగములే. తపసుకు చెందిన ఈ సాధన అంశములను తెలివితోను, సత్సంకల్పముతోను అభ్యసించిన యెడల , సాధన క్రమము నందు శరీరమునకు కలుగు బాధలు చివరకు శరీరమును, మనసును ఆధ్యాత్మికత తరంగములతో సమన్వయ పరచుటకు తోడ్పడును. "తాను అదుపు నందు ఉంచుకొనుట" అనునది "తనను తాను హింసించుకొనుట " వేరైనది. తపస్సు యొక్క లక్ష్యము - ఫకీరు ల వంటి వారు మేకుల పరుపు వంటి మీద పడుకొని ఒక ప్రదర్శన ఇచ్చున్నటువంటిది కాదు. మనిషి యందు ఉన్న అశాశ్వతములైన ఇంద్రియ సుఖములను కోరు చెడు సంస్కారములను శాశ్వతమైన ఆత్మానందమును కోరు విధముగా మార్చుటయే తపస్సు యొక్క లక్ష్యము. ప్రాపంచికమైన కోరికలను ఆధ్యాత్మిక అభిలాషగా మార్చుటకు ఒక చక్కని శ్రీయ క్రమశిక్షణ మార్గము అవసరము. తపము ఆచరించడం వలన ధ్యానము చేయుట వలన సాధకుడు తనకు తానుగా శారీరక మానసిక ఆనందమునకు, మరియు ఆధ్యాత్మిక ఆనందమునకు మధ్యగల తారతమ్యమును తెలుసుకొను అవకాశం ఏర్పడును.
సోమరితనమే అలవాటుగా కల వ్యక్తిని ఒకరోజు అంతయు శ్రమించి పనిచేయు విధముగా నిర్బంధించిన ఎడల అతను శారీరకముగా గొప్ప బాధను అనుభవించును. కష్టించు పనిచేయు అలవాటు గల వ్యక్తికి అటువంటి శారీరక బాధ తెలియదు. అదేవిధంగా ఒక సాధకుడు తనకు తానుగా జీవితమంతా సుఖములను త్యజించిన తపము ఆచరించిన ప్రారంభించిన యెడల అతను శారీరక మానసిక బాధలను అనుభవించును. అప్పుడు ఆ సాధకుడు శరీరంతో తనను పోల్చుకొని, అహము యొక్క తిరుగుబాటును లెక్కింపక క్రమముగా మిక్కిలి శ్రమతో కూడిన ఆధ్యాత్మిక క్రీడాకారిణి వంటి జీవితమునకు అలవాటు పడవలెను. అతను తపస్సును అదేవిధంగా కొనసాగించిన ఎడల ఆ సాధన అతనిని శారీరకముగా, మానసికముగా పరిశుద్ధుడిని గా చేయును. క్రమముగా అతను ఆరంభమున భయపడిన విధముగా శారీరక బాధను అనుభవింపక, గొప్ప ప్రశాంతతను, ఆనందమును అనుభవించును. మానవుడు తన అంతరంగము నందు ఉన్న స్వర్గ సమాన దివ్యానందమును ఒక్కసారి అయినను అనుభవించి తీరును. అతను తన గత జీవితం నందలి దురభిప్రాయములను గ్రహించి తొలగించుకొనును. అతను తపము ఆచరించు ప్రస్తుత జీవితముతో మిక్కిలి సంతోషించినను మానవుడు ఇంద్రియ సుఖములు కలిగించు ఆనందములు అన్నియు అనుభవించి నను పూర్తి సంతృప్తుడు కాజాలడు. అతను తాను పోగొట్టుకొనిన ఆత్మ యొక్క దివ్య ఆనందమును తిరిగి పొందు క్రమమున, తప్పైనా మార్గమున సంచరించి ఇంద్రియ ఆనందములను పొందుటకు ప్రయత్నించును.
కఠినమైన నియమ నిష్టలను పాటించుట, శారీరక సుఖములను లెక్కింపక సాధన చేయుట, పరిత్యాగము, తపస్సు - ఇవన్నీయు సాధన మార్గములు. అంతేకానీ అదే లక్ష్యములు కావు. అటువంటి సాధనామార్గమును అనుసరించి, దివ్య పరమాత్మ యొక్క అనంత సామ్రాజ్యమును చేరుటయే అసలైన లక్ష్యము. పేదరికమును అనుభవించిన వ్యక్తి ధనవంతుడు అవగానే అతను తన మురికి, చింపిరి వస్త్రములను త్యజించును. అదేవిధంగా భగవత్ సాక్షాత్కారమును ఉంది అతని దివ్యనంద ప్రపంచమును చేరిన సాధకుడు తుచ్చమైన ప్రాపంచిక బంధములు అన్నింటిని సంతోషముతో విడిచి వేయను.
9.ఋజుత్వము:-
పూజ్యులైన వ్యక్తులు ఋజుమార్గమును అనుసరించెదరు. ఋజుమార్గము వ్యక్తి యొక్క చిత్తశుద్ధి తెలుపును. *సచ్చీలమైన, నిష్కపటమైన అతని కన్నులు మాత్రమే భగవంతుని వీక్షించ గలవు*. *నిజాయితీతో కూడిన వ్యక్తి , నిష్కల్మషము తో కూడిన భగవంతుడిని చూడగలడు*. కపటముతో కూడిన వ్యక్తి విశ్వసూత్రములకు విరుద్ధమైన వాడు. పరహితము ముసుగు న స్వార్థమును దాచి అసత్య ప్రమాణములు చేయుచు, స్నేహము ముసుకున ద్రోహము చేయుచు, వంచనతో జీవించువారు విశ్వసూత్రముల నుండి తమ వినాశనమును కొని తెచ్చుకొందురు. నిజమైన భక్తుడు మోసమునకు, కుటిలత్వమునకు, దూరముగా ఉండును. మానవుడు తన సహజ సిద్ధిని పొందుటకు (ఆత్మను తెలుసుకొనుటకు) నిజాయితీని, సూర్యుని తేజస్సు వంటి నిష్కలంక తత్వమును కలిగి ఉండవలెను.
10.అహింస :-
హైందవ పవిత్ర గ్రంథములు అహింస అత్యంత ఉన్నతమైన గుణము అని ప్రశంసించుచున్నది. బైబిల్ నందలి దేవుని పది ఆజ్ఞల యందు ఒకటి "నీవు చంపకూడదు". దీని అర్థము మానవుడు బుద్ధి పూర్వకముగా భగవంతుడి జీవులైన - మానవులను, జంతువులను, మొక్కలను సంహరింపరాదు. కానీ విశ్వ నిర్వాహణా క్రమమున (ప్రపంచము నడిచే విధానము) మానవుడు తాను జీవించి ఉండుటకు మొక్కలను చంపి ఆహారముగా తీసుకోవలసినది. ధ్రువ ప్రాంతమున నివసించు ఎస్కిమోలు SEAL అను చాపలను చంపి ఆహారముగా స్వీకరించి జీవింతురు. మానవుడు తాను జీవించి ఉండవలెనన్న, మరియు కొన్ని అత్యవసర సమయములయందు అతను సృష్టి యందలి అల్ప జీవులను సంహరింపక తప్పదు. మానవుని శరీరము నందు ప్రతి దినము లక్షల కొలది బ్యాక్టీరియా నశించిపోవు చుండును. గాలి యందలి -నీటి యందలి అత్యంత సూక్ష్మమైన జీవులు, మానవుడు గాలిని పీల్చినప్పుడు, నీటిని తాగినప్పుడు అవి మరణించును.(కొన్ని సమయములందు అట్టి సూక్ష్మజీవులు ప్రతిఘటించును)
మహాభారతము నందు అహింసయే సకల ధర్మమని చెప్పబడినది, కానీ దుర్మార్గమును ఎదిరించినప్పుడు ద్వేష రహితమైన హాని కలిగి తీరును. అటువంటి సందర్భముల యందు " అహింసచే ధర్మము పరిరక్షింపబడును" అని అచట ఏ విధమైన ప్రతిఘటన చేయనిచో దానివలన మరింత హాని కలుగును. ధర్మపరమైన న్యాయము జరగవలనన్న ఉద్దేశము "న్యాయమును నడిపించిన తీరు", ఈ రెండును ఆ సందర్భమును అనుసరించి అవి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణింపబడును.
1935 వ సంవత్సరమున నేను మహాత్మా గాంధీని సందర్శించినప్పుడు అహింసను బోధించు గాంధీ గారిని అహింస యొక్క నిర్వచనమును తెలుపమంటిని. దానికి వారు ఈ విధముగా సమాధానము చెప్పిరి."ఆలోచన యందు, ఆచరణ యందు ఎటువంటి జీవికి హాని కలిగించకుండుట ". అహింసను పాటించు వ్యక్తి బుద్ధిపూర్వకముగా ఎవ్వరికి హాని కలిగింపడు, తలపెట్టడు. "ఇతరులు మీకు ఏమి చేయ వలెనని భావింతువో దానినే నీవు ఇతరులకు చేయుము"అను దివ్య సూత్రము నకు గాంధీజీ ఒక ప్రతిరూపము.
11.సత్యము (ట్రూత్) :-
సత్యము అనునది ఈ జగత్తునకు మూలాధారము. "ఈ జగత్తులు అన్నియు సత్యము ఆధారముగా నిర్మితమైనవి". అని మహాభారతం తెలుపుచున్నది. మానవులైనను,లేక మానవ నాగరికత అయినను సత్యం పట్ల వారు అవలంబించు విధానమును అనుసరించి వారి ప్రగతి,లేక వారి వినాశనము ఉండును.
సచ్చిలత కల వ్యక్తి సదాలోచన పరుల ప్రశంసలను సహజంగానే, స్వచ్ఛందంగనే పొందును. సత్య నిష్ట గల వ్యక్తి తాను మాట్లాడు సమయమున తన బుద్ధిని వ్యవహార జ్ఞానమును ఉపయోగించి మాట్లాడవలనని హైందవ పవిత్ర గ్రంథములు సూచించుచున్నవి. కేవలము సత్యమును మాత్రమే పలుకుట సరిపోదు. వ్యక్తి యొక్క మాటలు ఇతరులకు మధురముగను , స్వాంతన కూర్చుముగను, ఉపయుక్తముగను ఉండవలెను. మనసును బాధించు మాటలు అవి సత్యమైన మాట్లాడకపోవటేయే ఉత్తమము. సత్యమును అసందర్భముగా మాట్లాడుట వలన అనేకమంది హృదయములు భగ్నమై జీవితమును విచ్చిన్నమైన సంఘటనలు ఉన్నవి. ఒక వివేకవంతుడు ఒక వివేకవంతుడు తాను మాట్లాడు సమయమున మిక్కిలి జాగ్రత్త వహించును. అతనే సత్యమునే చెప్పదలచినను అతని పలుకులు ఇతరములను భావించి వారికి ఉపయుక్తము కాని సందర్భమున అనేక అతను తన మాటలను చెప్పకపోవుటయే మేలని భావించెను.
వేదములు మూడు రకములైన వేదములు మూడు రకములైన సత్యముల గురించి తెలుపుచున్నవి.
1. మనిషి యొక్క, ప్రకృతి యొక్క జీవన ప్రమాణములు(విలువలు) వ్యవహారిక సత్యములు అని చెప్పబడును .అనగా ఆ ప్రమాణములు అతను జాగరుక స్థితి యందు ఉన్నప్పుడు అతనిపై ప్రభావమును చూపును. అనగా అవి నిత్యము మార్పు చెందుతూ చంచల స్వభావమును కలిగి ఉండునవి.(ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి అన్ని సత్యములే కానీ మారుచుండును.)
2. మానవుడు నిద్రించినప్పుడు అవచేతనా స్థితి స్వప్నవస్థను కలిగించి, ఆ స్వప్నము నందు సూక్ష్మ రూపమున దృశ్య ప్రపంచంను కలిగించును. అట్టి స్వప్నము ప్రతిపాదిత సత్యము అనబడును. వాటి విలువ స్వప్నము ఉన్నంతవరకే మనిషి జాగ్రాదావస్ద యందు వీక్షించు దృశ్య ప్రపంచమున కన్నను స్వప్న ప్రపంచము మరింత అస్పష్టత, అన్చితి తో అశాశ్వతమై ఉండును.
3. ఘాడమైన స్వప్నములేని నిద్ర యందు (సుఘుప్తి) మరియు యోగి యొక్క ధ్యాన సమాధి యందు, మనిషి తన నిజ స్థితి యందు ఉండును. అది ఆత్మస్థితి. అట్టి స్థితియందు నిర్గుణ పరమాత్మ అవగతమై ఉండును. అది పారమార్థిక సత్యము.
సాధారణ మానవులు భగవంతునితో అనుసంధానమై ఉండరు అనునది సత్యము కాదు. మానవులు ఒక్క నిమిషమైనను స్వప్నములేని గాఢనిద్ర పొందనిచో వారు జీవింప జాలరు. సాధారణ మానవుడు గాఢ నిద్ర యందు భగవంతునితో అనుసంధానము మగుట (ఆత్మానుభవము) అతనికి గుర్తు ఉండదు. మానవుడు తన జీవనాధారమైన మరియు ప్రేమ, తత్వ రూపము అయినా ఆ దివ్య పరమాత్మతో అనుసంధానమై ఎప్పటికప్పుడు తన ప్రాణ శక్తిని నింపుకొనును. ఈ సూత్రము జగత్తునంతటకి వర్తించును. మనోవాక్కాయ కర్మల యందు సత్యమును అనుసరించు వ్యక్తి సృష్టితో, సృష్టికర్తతో అనుసంధానమై ఉండును. అటువంటి సత్పురుషుల సందర్శన భాగ్యముచే సాధారణ మానవులు వారి నుండి వెలువడు సామరస్య పూరిత తరంగముల వలన ఉద్ధరింప బడుదురు. నిజమైన భగవత్ సేవకుడు జగత్తుకు చెందిన బాధాకరమైన ద్వంద్వముల నుండి, సాపేక్షతకు చెందిన వైవిద్యముల నుండి వేరుపడి చివరకు
నిర్గుణ సత్యము నందు ఆశ్రయమును పొందును.
12.క్రోధము లేకుండుట:-
క్రోధ రాహిత్యము మనశ్శాంతికి దగ్గరి మార్గము. కోరికలు నెరవేరక పోవుటవలన క్రోధము కలుగును. కోరికలు లేని వ్యక్తికి క్రోధము ఉండదు. ఇతరుల నుండి ఏమియు ఆశింపని వ్యక్తి, తమ అవసరముల నిమిత్తము భగవంతుడినే ఆశ్రయించు వ్యక్తి ఇతరుల పట్ల కోపమును, నిరాశను ప్రదర్శింపడు. సత్పురుషుడు ఈ జగత్తు భగవంతునిచే నడిపించ బడుచున్నదని గ్రహించి, అందు దేనికి లోటు ఉండదని తెలిసి ఉండును. అట్టి వ్యక్తి ఆగ్రహము, శత్రుత్వము, తిరస్కార స్వభావము లేనివాడై ఉండును.
ఈ ప్రపంచము కార్యకరణ సంబంధముతో కూడి ఉన్నది. అట్టి ఈ ప్రపంచమున సత్పురుషులు పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రవర్తనను కలిగి ఉందురు. (కోపము చూపించాలిసిన చోట్ల చూపించాలి). కొన్ని సందర్భముల యందు సాధు జనులకు అపకారము కలగకుండుటకై వారు గొప్ప ధైర్యంతో కూడిన క్రోధమును, ధర్మమును అనుసరించిన ఆగ్రహమును ప్రదర్శింతురు. కానీ యోగులు ఎంతటి దుర్మార్గుల యందును,అజ్ఞానుల యందును, ఏ విధమైన ద్వేష భావమును కలిగి ఉండరు. ఆత్మసాక్షాత్కారము పొందిన వ్యక్తి ఆగ్రహమును అతి కొద్ది సమయమును
లేక మరికొద్ది ఎక్కువ సమయమును ప్రదర్శించవచ్చును. కానీ ఆ మరుక్షణము అతను తన ప్రశాంతమైన దయార్థ స్థితిని చేరును.
సాధారణ వ్యక్తి యందు ఆగ్రహము అతని అదుపు నందు ఉండదు. కోరికలు లేని నిర్మల హృదయాలు మాత్రము క్రోధమును దరిచేరనివ్వరు.
కుటుంబముల యందు, దేశముల యందు ప్రశాంతతకు భంగము కలిగించునది క్రోధము. కోపోద్రిక్తుని అతని మిత్రులు విడిచి పెట్టెదరు. అతని మిత్రులచే ద్వేషింప బడెదరు. తరచుగా కోపమును పొందుటవలన ఆరోగ్యము ప్రభావితమగును. మరియు కోపము హింసకు తావిచ్చును. క్షణిక ఆవేశమునకు గురి అయ్యి అనేకమంది ఘోర నేరములు చేసి కారాగారము పాలైరి, మరియు మరణశిక్షను కూడా పొందిరి. అనేక మంది కనీసము తమ వ్యక్తిత్వమును కాపాడుకొనుటకై దూర దృష్టితో కోపమును అదుపు చేసుకొందురు.
13.త్యాగము:-
భౌతిక ప్రపంచమునకు చెందిన అల్ప సంతోషములను వదిలి ఉన్నత సౌఖ్యములను పొందగోరు సాధకుడు త్యాగము అను దివ్యమైన మార్గమును అనుసరించును. అతను తాత్కాలికమైన ఇంద్రియ సుఖములు వదలి శాశ్వతమైన ఆనందమును పొందగోరును. త్యాగము అనునది సాధన యందు ఒక దశ ,లేక ఒక భాగము మాత్రమే. అంతియే కాని త్యాగమును అనుసరించుటతో సాధన పరిపూర్తి కాదు. త్యాగము సాధకుని యందు ఆత్మ లక్షణములను ప్రస్ఫుటము చేయుటకు తోడ్పడును. సాధకులు ఎవ్వరునూ శారీరక సౌఖ్యములను, ఆనందములను త్యజించుటకు వెనుకాడరాదు. శరీర సౌఖ్యములను త్యాగం చేసి సాధన చేయువారికి లభించు ఆధ్యాత్మిక దీవెనలు దేనితోనూ సరి పోల్చ లేనివి.
ఫలములను ఆశింపక కర్మను చేయుట నిజమైన త్యాగము. భగవంతుడు నిజమైన గొప్ప త్యాగ పురుషుడు. అతను సృష్టికి చెందిన కార్యకలాపములను ఏ విధమైన బంధము లేక చేయును. గృహస్థ సాధకులైనను, లేక సాదు వర్గమునకు చెందిన సాధకులు అయినను ఆత్మసాక్షాత్కారము కొరకు ప్రయత్నించినప్పుడు వారు కర్మలను భగవంతుని కొరకు చేసి ,భగవంతుని కొరకే జీవింపవలెను. భగవంతుని సృష్టి అను నాటకం నందు వారు ఏ విధమైన భావోద్వేగము తోను (ఎమోషన్) మునిగిపోరాదు.
14.శాంతి:-
ప్రశాంతత అనునది ఒక దివ్యమైన దైవీ గుణము.
బైబిల్ వాక్యము:-
"భగవంతుని ప్రశాంతతతో అనుసంధానమైన యోగి సకల జ్ఞానమునకు మించిన దివ్యజ్ఞానము కలవాడగును. "అటువంటి యోగి తన సంయోగ కరమైన గులాబీ పువ్వు వంటి వాడు. అతను తన యందలి ప్రశాంతత, నిర్మలత్వము అను సుగంధమును తన పరిసరముల యందు వెదజల్లుచుండును.
దృశ్య ప్రపంచము నందలి సమస్తము క్రియాశీలక కలిగి నిత్యము మార్పులు చెందుతుండును. కానీ ప్రశాంతత అనునది భగవంతుని లక్షణమై ఉన్నది. ప్రశాంతతకు గల లక్షణములనే ఆత్మ స్వరూపుడైన మానవుడు కూడా తన యందు కలిగి ఉన్నాడు. మానవుడు తన చైతన్యము నందలి 3 విధములైన మానసిక స్థితులను కలత చెందనీయక శాపం ప్రశాంత పరచినప్పుడు (జాగ్రత్ ,సుఘప్తి, స్వప్న ,) మరియు సుఖదుఃఖములపై అనాసక్తతతను ప్రదర్శించినప్పుడు అతను తన అంతరంగమునందే నిశ్చలమైన దివ్య ఆత్మ ప్రశాంత సాగరము అనంత పరమాత్మ యొక్క అవధులు లేని శాంతి సాగరమునందు విలీనమగుటను గాంచును.
15. నిందారోపణ చేయకుండుట:-
పరానింద, దోషారోపణ చేయకుండుట వలన వ్యక్తి మనసు ఇతరుల బలహీనతలపై కేంద్రీకరింపబడక అతని ఉన్నతి కొరకు దృష్టి కేంద్రీకరింపబడి ఆ విధముగా అతని ఆధ్యాత్మిక అభివృద్ధిని వేగిర పరుచుటకు తోడ్పడును. ఒక వ్యక్తి గూడాచారి వలె ఇతరుల బలహీలతలను గుర్తించుట యందు నిమగ్నమైనప్పుడు, అతను తాను దోష రహితుడని లేక ఇతరుల మంచి చెడులను నిర్ణయించుటకు అర్హత కలవాడని ఒక తప్పైనా ఆదిత్య భావనను పెంపొందించును. ఇతరుల తప్పు ఒప్పులను ఎత్తు చూపు వ్యక్తి తన జీవితమునందలి తప్పులను ఎన్నటికీ సరిదిద్దుకొనలేడు. ఒక అలవాటు ప్రకారము ఇతరులను విమర్శించు వ్యక్తి ఇతరుల నైతిక కురుపుల పై (దెబ్బలపై) వ్రాలు ఈగ వంటి వారు. నిజమైన సాధకుడు తొమ్మిదవ వలె తన సహచరుల హృదయలయందలి సద్గుణములు తేనెను త్రాగు వాడు. (ఇతరుల యందు మంచిని గ్రహించువాడు). క్రీస్తు ఈ విధముగా పలికెను." వీరు ఇతరులపై తీర్పును ఇవ్వ వలదు: అప్పుడు మీపై కూడా తీర్పు ఇవ్వబడదు.. నీవు ఇతరులపై తీర్పును ఇచ్చిన విధముగానే నీపై కూడా తీర్పు ఇవ్వబడును. నీవు ఇతరులను ఏ విధముగా ఎంచెదవో నీవు కూడా అదే విధముగా ఎంచబడెదవు. నీవు నీ సహోదరుని కంటి యందు నలుసు నేల చూసెదవు. నువ్వు నీకంటే యందని దూలమును ఎలా చూడవు. నీకంటే ఎందుకు దూలము ఉండగా ఈ సహోదరిని కంటి అందలి నలుసును తీయుదునని ఎల పలికేదవు. ఓ కపటమైన మనిషి మొదట నీ కంటి యందలి దూలమును తీసివేయుము ఇప్పుడే నీవు ఇతరుల కళ్ల యందలి నలుసును స్పష్టముగా చూసి తీయగలవు."
దుష్ట బుద్ధితో ఇతరులను దూషించు వ్యర్థ ప్రసంగములు లాడు వారు, ఇతరులను అపనింద పాలు చేయువారు, ఇతరుల తలలను నరికి (ఇతరులను చిన్న బుచ్చి) తాము ఉన్నతుల మయ్యదమని చెడు అభిప్రాయమును కలిగి ఉందురు. కానీ అటువంటి సంస్కారం లను వెలిబుచ్చువారు తమను తాము సంస్కార హీనులుగా వ్యక్తపరచుకొందురు. చాడీలు చెప్పు వారు ఇతరుల యందలి భగవంతునకు తమ యందు కల దైవమునకు అపరాధమును కలిగింతురు. సద్గుణవంతులు ఏ విధమైన అహంకారము లేక ఇతరుల అభివృద్ధికి తోడ్పడి ఔనత్యమును పొందెదరు. ఆ విధముగా వారు నీచ గుణములు కల ఇతరుల కన్నను ఉన్నతముగా ఉండేదరు.
ఇతరులపై అపవాదమును మోపి చాడీలు చెప్పువారు ఇతరులకు మంచి సూచనలను ఇచ్చి ప్రోత్సాహ పడుట ఎందుగల ఆనందమును ఒక్కటే వారిని స్వస్థత పరచును.
మంచిది కాక చెడును ప్రచారం చేయు వారికి, వ్యర్థ ప్రసంగములతో కాలము గడుపు వారిని, ఇతరుల తప్పు ఎన్నో వారిని ఎవ్వరును విశ్వసింపరు. మనుషుల బలహీనతలను భగవంతుడు పదిమంది ఎదుట బహిరంగపరచడు. భగవంతుడు ప్రతి వ్యక్తికి అంతరాత్మను ప్రసాదించి వారి తప్పులను వారు ఆత్మ అంతరంగమున వారు తప్పులను వారు సరిదిద్దుకొని విధముగా అవకాశమును కల్పించుకొందురు.
ఏసుక్రీస్తు : వ్యభిచారి స్త్రీని శిక్షించబోవు శిక్షకులతో ఈ విధముగా పలెకను."మీలో పాపము చేయని వారు ఆమెపై మొదటి రాయిని విసర వలెను. "అప్పుడు వారిపై ఆమెపై నిందను మోపు వారు తమ యందలి తప్పులను, నిందలను గుర్తించి అచ్చట నుండి జారు కొనిరి. ఏసుక్రీస్తు గొప్ప హృదయం కలవారు పాపము చేసిన వారి మీదింపట వారిపై ప్రేమను చూపిరి.
16:- సర్వ జీవుల యందు దయ:-
సాక్షాత్కరింప చేసుకొనుటకు మానవుని యందు దయ అను గుణం ఉండవలెను. ఏల అనగా భగవంతుడు దయాస్వరూపుడు. సున్నితమైన హృదయము కలవారు ఇతరుల బాధలను అర్థం చేసుకొని వారి బాధలను తీర్చుటకు ప్రయత్నించురు. దయా గుణము కలిగి ఉండుట వలన కర్మ వలన ఏర్పాటు ప్రతిఫలమును మార్చ వచ్చును.
భగవంతుడు తన పిల్లలైనా మానవులపై దయ చూపక ,వారిని క్షమింపక, వారి పాపముల నుండి విముక్తిని చేయని యెడల తప్పులను చేయు మానవులు అనంతకాలము అనేక జన్మలను ఎత్తుచూ బాధలను అనుభవించెదరు. మానవుడు తనను తాను నియంత్రించుకొని కొండంత తన పాప భారమును తగ్గించు కొనుటకు ప్రయత్నించిన ఎడల భగవంతుడు కూడా తనకు సహాయపడును. మానవుడు తన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపము చెందు చుండిన యెడల భగవంతుడు మానవునికి ముక్తిని కలిగించు తన దివ్యమైన కాంతిని ప్రసరింపచేసి, ఒక్క క్షణమున అతని పాపాంధకారము తొలగించును. (ఒక్కసారి భగవంతుడు దయ కలిగితే ఎంతటి పాపమైనా మనకు తొలగిపోవును).
గౌతమ బుద్ధుడు దయతో కూడిన అవతార మూర్తి అతడు ఒక మేక ప్రాణమును బలి కావింపబడుట నుండి రక్షించుటకు తన ప్రాణమని ఇచ్చుటకు సిద్ధపడనని తెలియు చున్నది. జంతువులను హోమమునందు బలిగా ఇచ్చుచున్న అప్పటి రాజు జంతు బలిని ఆపి గౌతమ బుద్ధిని మిక్కిలి భక్తునిగా,అనుచరునిగా మారిపోయాను. ఒక తండ్రి తన పురుష గుణ తత్వమైన బుద్ధిని ఉపయోగించి తన పుత్రుని నేర నిర్ణయము గురించి తీర్పు ఇవ్వవలసి వచ్చిన, అతను న్యాయ సూత్రములకు అనుగుణముగా తీర్పును ఇచ్చును. కానీ ఒక తల్లి స్త్రీ తత్వపు చిత్తముచే సున్నితమైన తత్వమును కలిగి ఉండి దయా స్వరూపమై ఉండును. ఆమె తన కుమారుడు హంతకుడు అని తెలిసిన ను వాడిని క్షమించును. భక్తులు దైవమును దయతో కూడిన దివ్య మాతగా పూజించిన ఎడల వారి పాపములు తరగి పోవును. కానీ భగవంతుడు పురుష రూపమున దివ్యమైన న్యాయ నిర్ణేతగా జీవుల పాప పుణ్యములను నిర్ణయించినప్పుడు మిక్కిలి ఖచ్చితముగా కర్మ సూత్రములను అనుసరించి తన తీర్పును ఇచ్చును.
17.కోరికలు లేకపోవుట:-
తన ఇంద్రియములను అదుపు చేసుకొని వ్యక్తికి దురాశ ఉండదు. అందుచే అతను భౌతిక ఆనందములపై, భౌతిక వస్తు విషయమలపై ఆసక్తిని ప్రదర్శింపడు. అంతరంగ ఆనందమును అనుభవించు భక్తులకు దురాశ అసూయ అను లక్షణములు ఉండవు. అంతరంగా ఆనందముతో సరిపోలునది భౌతిక ప్రపంచమున ఏదియు లేదు.
18.మృదుత్వము:-
ఆధ్యాత్మిక సహనము మృదుత్వము అను లక్షణమును కలిగి ఉండును. తప్పులను చేయు తన పిల్లల పట్ల భగవంతుడు మృదు స్వభావమును ప్రకటించును. మరియు వారిపై కోపమును ప్రదర్శింపక, వారు అతనిని దూషించినను, తిరస్కరించినను అతను నిశ్చలముగా ఉండును. భగవంతునితో అనుసంధానమై ఉన్న వారు దయ కలిగి, ఓర్పు సహనమును కలిగి ఉందురు. మృదు స్వభావము కల వ్యక్తి ఈ జగత్తు నందు స్నేహితులను తన వైపు ఆకర్షించు కొనును. అంతియే కాక అతను స్నేహితులలో కెల్లా స్నేహితుడైన భగవంతుడిని ఆకర్షించును. ఆధ్యాత్మికముగా సహనము కల వ్యక్తి ఎవ్వరిని ద్వేషింపడు. అతను మిక్కిలి దుర్మార్గుడైన వ్యక్తిని కూడా ద్వేషింపడు.
19.సిగ్గు:-
ఒక వ్యక్తి తాను చేసిన చెడు పనుల వలన తాను సిగ్గు పడిన యెడల అట్టి వ్యక్తి తన తప్పును దిద్దుకొనుటకు ఆసక్తి చూపును. తనకు తానుగా ఆత్మ సంతోషంతో ఉండు వ్యక్తి అసభ్యతతో కూడిన వాడై తనకు తానే ఆదిత్యతకను ఆపాదించుకొనును. తన ఆధ్యాత్మిక ప్రగతిని అతిశయముగా చెప్పుకొను వ్యక్తి ఆత్మసాక్షాత్కారము కొరకు లోతైన సాధనను చేయుటను విరమించుకొనును. నిరాడంబరమైన అమరికతో విషయముతో ప్రదర్శించు ఒక వినయశీలుడు ఆకర్షించును. తమకు తాము బహిరంగ పరుచుకొనని బిడియము స్త్రీలకు ఆభరణము అని మన పురాణ గ్రంథములు తెలుపుచున్నది. ఆధునిక కాలమునందు యువతి యువకులు ఒక విధమైన మొరటు తనమును ప్రదర్శించుచున్నారు. కావున యువతి యువకులు ఇరువురికి బిడియము అత్యవసరమైన గుణము. నిర్లజతో కూడిన ప్రవర్తన చెడు స్నేహితులను సమకూర్చును. అటువంటి స్నేహితుడు తమ కోరికలు తీరిన పిదప వారిని నిరాకరించి విడిచి పెట్టేదరు. వినయ స్వభావము కల వ్యక్తులు, సద్గుణములు కల అటువంటి వారిని ఆకర్షించుదురు.
సున్నిత తత్వము గల వ్యక్తి యొక్క గొప్ప లక్షణము ఏమనగా అతను ఆధ్యాత్మికంగా హేయమైన గుణము గురించి సిగ్గుపడును. అట్టి గుణమును అతని యందు ఎవరైనా గుర్తించి అతనికి తెలిపిన యెడల అతను తన తప్పును గ్రహించును.
దానివలన అతను సిగ్గుపడి తన నుండి ఆ గుణమును రూపుమాపును. ఆధ్యాత్మిక ఆత్మ అవగాహన (సోల్ డెలికసి) లేని వ్యక్తి యందు గల దుర్లక్షణాములను మార్చుకొన వలసినదిగా చూసిన ఎడల అట్టి వ్యక్తి ఎదురు తిరుగును. అతను వ్యంగ్యమును ప్రదర్శించి తనకు ఇవ్వబడిన సూచనను నిర్లక్ష్య పరచును. నిజమైన భక్తుడు వినమ్రతతో ఉండును. అతను భగవంతుడిని పొందవలెను అను ఆకాంక్షతో తన గురువు మరియు ఆధ్యాత్మికముగా ఉన్నత స్థితి యందు ఉన్నవారు సూచించిన మార్గమును అనుసరించి , మానవ సహజమైన తన దోషములను తొలగించుకొనును. ఆధ్యాత్మికముగా హేయమైన గుణమును గురించి సిగ్గు పడుట ఒక మంచి లక్షణం. అటువంటి సాధకుడు మానవ శరీరముతో కర్మానుసారము మరలా మరలా పునర్జన్మను పొందుట యందలి అవమానమును లేక నీచత్వమును పూర్తిగా గ్రహించును.ఆత్మను శరీరము నందు నిర్బంధించి ఉంచుట అనునది నిజ తత్వమునకు విరుద్ధమైనది. అట్టి నిర్బంధము అవధులు లేని ఆత్మకు అపరాధము కలిగించినది అగును.
20.చంచల స్వభావము (అశాంతి లేకుండుట):-
చెంచల స్వభావము లేనిచో అది మానసికముగా శారీరకముగా వ్యక్త వ్యర్థ కార్యకలాపముల యందు నిమగ్నమొగుటను తప్పించును.
చంచల స్వభావనకు కారణములు:-
1.నిరంతరము ఇంద్రియ భోగములను అనుభవించడం వలన,
2 ప్రతికూల ఆలోచనలను అలవాటుగా కలిగి ఉండుట .
3. భావోద్వేకపు సమస్యల వలన (మనకు తెలియకుండానే దుఃఖము సంతోషము రావడం)
4. గొప్ప ప్రాపంచిక ఆశయముల కొరకు
ఆరాటపడుట. మనిషి యందు అధైర్యము (నర్వస్నెస్), వ్యాకులత లేక అశాంతి లేక చంచలత్వము కలుగును.
భగవంతుని తత్వమునందు అశాంతికి తావులేదు. కావున సాధకుడు మానసిక, శారీరక చపలత్వమును తిరస్కరించుటను ప్రయత్నించి నేర్చుకొనవలెను. సాధకుడు ఆధ్యాత్మిక కార్యకలాపముల యందు తన మనసును నిమగ్నం చేసి, లక్ష్యము లేని కార్యకలాపములను విసర్జింపవలెను.
21. తేజస్సు:-
భగవంతుని దివ్యచైతన్యము యందలి విశ్వ జ్యోతి నుండి తేజస్సు వెలువడును. అట్టి తేజస్సు మనిషి యందు మరియు ఇతర చైతన్యం కలిగిన జీవుల యందు ఎరుక అను ప్రజ్వలన గా ఉండును. తేజస్సు అనునది సర్వ జీవుల యందు ప్రధానమైన జీవశక్తి, (వైటాలిటీ), మరియు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్సు, ఆటమ్స్ అందు ఈ తేజస్సు ప్రధానమైన జీవశక్తి అయి ఉన్నది. ఆ దివ్య పరమాత్మ యొక్క అలుపు ఎరుగని దివ్యశక్తి నడిపించును. భగవంతునిపై దీర్ఘకాల ధ్యానము వలన సాధకుని శరీరము విశ్వ జ్యోతి యొక్క కాంతిచే నిండిపోవును. (దేని గురించి మనం ధ్యానం చేస్తామో అది మనకి వస్తుంది.అంటే భగవంతుని గురించి). తమ యందు ఆ దివ్య పరమాత్మ యొక్క దివ్య శక్తిని స్పష్టముగా వెలిబుచ్చు ఆ సాధకుల యందు తేజస్సు మానసిక, నైతిక స్త్యెర్యము కలుగజేయును. మరియు అట్టి సాధకుల యందు తేజస్సు దృఢమైన ధర్మవర్తనమును కలుగచేయును. సాధకుడు ఈ విధమైన అనుభవములను కలిగినప్పుడు అతనొక ఉన్నతమైన ఆధ్యాత్మిక పురుషుని వలె అభివృద్ధి చెందును. ఆధ్యాత్మిక సాధన యందు గొప్ప ధైర్యసాహసములు ప్రదర్శించిన సాధకులు తాము విశ్వసించిన మార్గమును విడుచుట కన్నా ప్రాణ త్యాగమునే ఎంచుకొనిరి. ఒక సాధకుడు యందు దివ్య తేజస్సు అతనికి ఆధ్యాత్మికపరమైన ఆకర్షణ శక్తిని కలిగించును. అట్టి ఆకర్షణ శక్తి అహంభావము ఎరుగని మంచితనపు తరంగ సౌరభవమును(మంచి సువాసన) అతనికి కలిగించును. అది అతని అంతరంగ ఆనందమునకు చిహ్నము.
22. క్షమ :-
తమకు హాని కలిగించిన వారిని శిక్షింపని దయా గుణము మరియు తమ మనసు నందు వారికి శిక్షను సైతము తలవని దయా గుణము దివ్య పురుషుల లక్షణము. విశ్వ సూత్రములు జరిగిన అన్యాయములు అన్నింటిని సరిదిద్దునని దివ్య పురుషులకు తెలిసి ఉండును. అందువలన విశ్వసూత్రములు పనిచేయు విధానమును త్వరితపరచు ప్రయత్నం, వాటిని సరిదిద్దు ప్రయత్నము అనవసరము. మరియు అట్టి చర్య తొందరపాటుతో కూడినది. కర్మ విధానములు స్థిరమైనవి మరియు మార్పు చెందనివి. అవి విధించు ప్రతిఫల చర్య యొక్క ప్రయోజనము మరియు లక్ష్యము దూర దృష్టితో కూడినవి. పాపము చేసినవారికి విమోచన కలిగించుటకై అవి నిర్ణయింపబడినవి.
ఇచ్చట తప్పులు చేసిన వారిని దండింప కూడదు అని చెప్పుటలేదు. మానవుని సాంఘిక వ్యవస్థకు కొన్ని నిబంధనలు ఉన్నవి . నిబంధనలు లేని సాంఘిక వ్యవస్థ నిలువ జాలదు. న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించువారు మానవ క్షేమమును దృష్టి యందు ఉంచుకొని వారు కర్మ సిద్ధాంతములకు ఉపకారణముల వలె పని చేయవలెను. న్యాయ నిర్ణేతలు న్యాయ నిర్ణయమును ప్రకటించినప్పుడు వారు దురుద్దేశమును ప్రతీకార భావమును కలిగి ఉండరాదు. తాము నిర్ణయించు విషయముల యందు సంపూర్ణ న్యాయము జరగలేదని వారు భావించినను కర్మ సూత్రములు సరైన న్యాయ సూత్రమును చేకూర్చును.
మహాభారతము నందలి ఒక ప్రకరణము ఈ విధముగా తెలుపుతున్నది. "ఎటువంటి అపరాధమునైనను క్షమింపవలెను.మానవుల యందలి క్షమాగుణము వలన ఈ జగత్తున జీవరాశి జీవనమును కొనసాగించుచున్నది. క్షమాగుణము మిక్కిలి పవిత్రమైనది. జగత్తు క్షమా గుణము వలన ఈ జగత్తు ఒక్కటిగా నిలిచి ఉన్నది. క్షమా గుణము అనునది మిక్కిలి శక్తివంతుల యందుగల శక్తి అయి ఉన్నది. క్షమా గుణమే త్యాగము. క్షమాగుణమే మనసు ప్రశాంతతను ఇచ్చునది. క్షమాగుణము, మృదు స్వభావము అనునవి ఆత్మ నిగ్రహమున గల వారి లక్షణములు. అవి శాశ్వత సుగుణములు".
ఒక బలహీనుడిని, ఒక బలవంతుడు చెంప దెబ్బ కొట్టినప్పుడు బలహీనుడు నిన్ను క్షమించు చున్నాను అని చెప్పి అచట నుండి అతను పారిపోయిన ఎడల అది నిజమైన క్షమా గుణము కాదు. అది పిరికితనము.
ఉదాహరణకు:- ఒక బలవంతుడు తన విరోధి వలన హాని కలిగినప్పుడు అతను దయ ,ఓరిమి ప్రదర్శించిన యెడల అది నిజమైన క్షమా గుణము.
("క్షమాపణము ఎలా వస్తుంది?")
1.ఆధ్యాత్మిక క్రమశిక్షణను బహుకాలము పాటించడం వలన,
2.మన యందు సహజముగా కల విడదీయరాని దివ్యమైన మానవ సోదర భావమును గుర్తించుటవలన మన యందు క్షమాగుణము కలిగి ఉండును.
1948వ సంవత్సరమున మహాత్మా గాంధీ మరణించు సమయమున తన శరీరమునకు తుపాకీ గుండ్లు తగులు సమయమున తన రెండు చేతులను పైకెత్తి హంతకుని పై తన ఉదార క్షమా గుణమును వ్యక్తపరచెను. వారికి నివాళిని అర్పించుచు నేను ఈ విధముగా రాసితిని.
"అతని నిస్వార్థ జీవితము నందు అతను అనేక త్యాగములను చేయుట వలన అతను ఆ విధమైన తన చివరి సంజ్ఞను (Gesture) చేయగలిగెను. "(ఎమోషనల్ ఇంటెలిజెన్స్). (కష్ట కాలము వచ్చేటప్పుడు సరైన విధముగా ప్రవర్తించ గలిగినప్పుడు భయము, దుఃఖము, కోపము అటువంటి సమయాలలో నిర్ణయము తీసుకోవడం,వ్యక్త పరచడం చేయగలగాలి).
ఏసుక్రీస్తు తన సహాయార్థము 12 దేవతా సైన్య విభాగములను రప్పింప కలిగిన శక్తి కలిగి ఉండెను . అయినను క్రీస్తు తనను బంధించుటను సిలువ వేయుటను నిరోధించలేదు. క్రీస్తు పలికిన మాటలు- "తండ్రి వారిని క్షమింపుము. ఎందుకనగా వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. "దివ్యమైన దైవదృష్టి తన యందు ఉండుటవలన ఆయన మనుషుల యందు తప్పులను ఎంచలేదు. ప్రతి మనిషి సహజముగా ఒక ఆత్మయే అను అవగాహన ఏసుక్రీస్తుకు ఉండును. భగవంతుని సంతానమని మరియు ప్రతి మనిషి భగవంతుని సంతానమని , అట్టి వ్యక్తి వ్యక్తపరచు దుర్గుణము మనిషి సహజ తత్వము కాదని అతనికి తెలియును. అట్టి దుర్గుణము, అజ్ఞానము - తెలియకపోవు ట అను అపోహ వలన కలిగినది. అంతేకానీ అది శాశ్వతమైనది కాదు. మనిషి తన నిజ తత్వమును మరచినప్పుడు అటువంటి భ్రాంతి యందు మునిగిపోవును.
23. ఓర్పు లేక సహనము:-
సాధకుని యందలి సహన గుణము అతనికి దురదృష్టము, అవమానము కలిగిను వాటిని ఒక సమమైన దృష్టితో భరించు శక్తిని ఇచ్చును.
అతను ఆత్మసాక్షాత్కారమే తన జీవిత లక్ష్యముగా పనిచేయునప్పుడు , బాహ్యమైన కార్యకలాపములు అతనిని అస్థిర పరచవు. తాత్కాలికమైన అంతరంగ అలజడి అతని లక్ష్యము నుండి అతని దృష్టిని మరల్ప జాలదు. నిశ్చలతను అభ్యసించుటవలన ప్రపంచమున సాధకుడు బాహ్య ప్రపంచమున అన్ని సందర్భముల యందు దివ్యమైన కార్యకలాపములను చేయుటయందు తన మనసును నిమగ్నము చేయగలును. మరియు ధ్యానమునందు తనకు లభించు సత్య దర్శనమును నిలుపుకొనగలుగును. (నిశ్చలతను అభ్యసిస్తే - ధ్యానం చేసేటప్పుడు ,ధ్యానము కుదురుతుంది, మనసు లగ్నం అవుతుంది జ్ఞానములో లభించే సత్య దర్శనము అంటే ఆనందము వెలుగు అవి నిలుపుకోగలము) అతను తన ఆత్మానంద అనుభవములను తన యందు దృఢముగా నిలుపుకొని మనసును ప్రాపంచిక విషయముల యందు నిలుపక, తన అనుభవములను కాంతి విహీనము కానివ్వక కాపాడుకొనును.
సాధకుని నిరంతర సహన ప్రవృత్తి అతనికి భగవంతుడిని అవగాహన చేసుకొను శక్తిని ఇచ్చును. ద్రుతి అను ఈ గుణము అతని చైతన్యమును అవగాహన పరచిన విశ్వ చైతన్యమును తనయందు నిలుపుకొను శక్తిని ఇచ్చును.
24. శారీరక మానసిక పరిశుభ్రత:-
శారీరక , మానసికపరిశుభ్రతను పాటించటం వలన వ్యక్తి తన అంతరంగము నందు ఉన్న మచ్చలేని పరమాత్మను గౌరవించిన వాడగును. దైవత్వము తరువాత అతి ముఖ్యమైనది శుభ్రత అని చెప్పబడినది. వేకువన నిద్ర లేచిన పిదప శరీరమును నోటిని శుభ్రపరచుకొని ధ్యానము చేయవలెను. శారీరక శుభ్రత అనునది ప్రతి వ్యక్తి ఆచరింపవలసిన తప్పనిసరి అయిన నియమము. ప్రత్యేకించి ధ్యానము చేయుటకు ముందు శారీరక శుభ్రత అనునది ఒక ఆధ్యాత్మిక యజ్ఞము వంటిది. భగవంతుని పూజించుటకు మునుపు ఆ పూజకు చిహ్నముగా మొదట శరీరమును శుభ్రపరచు కొనవలెను. శారీరక అపరిశుభ్రత సాధకుని అంతరంగ దృష్టిని ఆటంకపరచి అతనికి భౌతిక స్పృహ కల్పించవచ్చును.
శారీరక పరిశుభ్రతతో ఉండి, మానసికముగా అదుపులేని కోరికలను నిగ్రహించి చంచలత్వపు ఆలోచనలను అరికట్టిన వ్యక్తి పరిశుభ్రమైన దేవాలయము అనబడు తన జీవితము నందు భగవంతుడిని ఆహ్వానించి అతనిని ప్రతిష్టింపచేయును. మనసు పరిశుభ్రముగా ఉన్నప్పుడు అది భగవంతుడు అధిష్టించు పీఠమై ఉండును.
25.ద్వేషింపకుండుట:-
ద్రోహ చింతన లేకుండుటను ప్రతి ఒక్కరూ పాటింప వలెను. ఇతరులను ద్వేషించుటవలన అన్ని జీవుల యందు గల పరమాత్మను చూడలేరు. ఆత్మసాక్షాత్కారము పొందగోరు యోగి ఇతరులపై వారు పాపులైనను సరే, వారిపై ద్వేషమును చూపడు. మరియు తనను శత్రువుగా భావించు వాడిని కూడా ద్వేషించడు. అట్లు ద్వేషించి నచో అతని ఆధ్యాత్మిక దృష్టి కుంటుబడును. అట్టి వారి యందు యోగి సర్వమును పరిహరింప గల భగవంతుని ప్రేమను చూచును. భగవంతునికి (ద్వేషతనం) ఉండదు.(అందుకే భగవంతుని అంతులేని దయ సర్వవ్యాపకత్వము నుండి వేరు చేయరు. సర్వ జీవుల యందు పరమాత్మను వ్యక్తి ఎవ్వరిని తిరస్కరింపడు.) మరియు తానుగా గర్వంతో కూడిన ఉన్నత భావమును (సుపీరియారిటీ) పొందడు.
26.అహంభావము లేకుండుట:-
"నా అతి మానిత" అనగా మితిమీరిన గర్వము లేకుండుట. భగవంతుడు అపారమైన విశ్వశక్తులను కలిగి ఉన్నప్పటికీ అతను ఏ విధమైన గర్వమును కలిగి ఉండడు. భగవంతుడు ఎంతో సౌమ్యమైన అదృశ్య రూపమున మానవుని ముక్తి కొరకు ప్రయత్నించును. అతను ధర్మబద్ధమైన కార్యక్రమముల యందలి ఒక శక్తిగా మరియు ప్రతి ఆత్మ యందు సహజమైన తన ప్రేమను నిలిపి, ఆ విధముగా నిశ్శబ్దమైన రీతిన భక్తులను ఆకర్షించును. ఆయన వారి ముక్తికై ప్రయత్నించును.
పరిపక్వము కానీ తెలివి మిక్కిలి ప్రమాదకరమైనది. అట్టి తెలివిచే వ్యక్తి గర్వమును అహంకారమును పొంది తాను సాధించిన దానితో తృప్తిపడి, తన సామర్ధ్యము తనకు తెలియను అనేడి తప్పైనా అభిప్రాయముతో ఉండును. "మనిషి పతనమునకు గర్వము ఒక సూచన" అను సామెత ఉన్నది. అహంకారంతో ఉన్న వ్యక్తి జీవితమున ప్రగతి కొరకు ప్రయత్నింపడు. అతను జడత్వము అను గోతి యందు పడిపోవును. (సోమరి తనము వచ్చును). దాని కారణంగా అతను ప్రగతిని సాధింపక పోవుటయే కాక, తాను అంతవరకు పొందిన ప్రయోజనములను శారీరక, మానసిక ,ఆధ్యాత్మిక ప్రయోజనములను నష్టపోవును.
స్వాతిశయము(నేనే గొప్ప అనే ఎక్కువ అహంకారం) లేని వ్యక్తి ఆధ్యాత్మికముగా ఉన్నతశ్రేణికి స్థితికి చేరును. చివరికి అతను భగవంతుని స్థితికి చేరును. అహంకారము అనెడి పర్వతపు వాలు పైన భగవంతుని కృప అను నీరు నిలువ జాలదు. కానీ వినయము అను లోయలో ఉన్నవారు ఆ నీటిని పొందగలరు.
పైన తెలిపిన సద్గుణములను ఎంత ఎక్కువగా వ్యక్తి వ్యక్తపరచునో , భగవంతుని ప్రతిరూపుగా మలచబడిన అతను అంత ఎక్కువగా భగవంతుడిని వ్యక్తపరచును. :-
పైన తెలిపిన 26 లక్షణములు భగవంతుని దివ్య గుణములు. ఈ దివ్య గుణములు కల వ్యక్తి ఆధ్యాత్మికముగా సంపన్నుడు అగును. భగవత్ సాక్షాత్కారమును పొందగోరు వ్యక్తి ఈ గుణములన్నింటినీ అలవరచుకొనవలెను. మానవుడు భగవంతుని ప్రతిరూపుగా ఏర్పడిన వాడు. కనుక అతను ఈ లక్షణములను తన వ్యక్తిత్వము నందు ఎంత ఎక్కువగా ప్రస్ఫుట పరచునో, అతను తన అంతరంగము నందు భగవత్ స్వరూపమును అంత ఎక్కువగా వ్యక్తపరచును. అతను దివ్య పరమాత్మ యొక్క అట్టి లక్షణములకు తన యందు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చును.
బైబిల్ వాక్యము:-
క్రీస్తు ఈ విధముగా చెప్పెను."నీవు స్వర్గమునందు ఉన్న నీ తండ్రి వలె పరిపూర్ణుడవై ఉండుము."
భగవంతుడు నిర్భయుడు. ఏల అనగా అతను మార్పు చెందని శాశ్వత తత్వము నందు స్థిరమై ఉండును. అతను పరిశుద్ధమైన హృదయము కలవాడు. అతని స్వచ్ఛమైన భావములు చంచలపు భావోద్వేగములతోను, ఇష్టాయిష్టములతో ఊగిసలాడవు. (భగవంతుడిని సాకార రూపముతో తీసుకొని ఈ గుణములన్నీ చెప్పుచున్నారు.) సర్వచైతన్య స్పృహ అతనే: యోగము అతనే: జ్ఞానము అతనే: జ్ఞానమే అతని ఆధారము - అతనే జ్ఞానము.
సర్వమునకు ఆధారము అతనే. సర్వ జీవులకు దయతో వరములు ఇచ్చినది అతనే. జీవుల హృదయముల ద్వారా అతను ద్వంద్వములను గ్రహించును. కానీ భావనలకు అతీతంగా అటువంటి భావనలకు అతీత ముగా అతను తన సర్వజ్ఞతా అనే స్వచ్ఛమైన దివ్యానందమునందు మునిగి ఉండును. భగవంతుని చర్యలైన సృష్టి స్థితి లయ ము అనునవి అతను నిర్వహించు పవిత్ర యజ్ఞము. అట్టి యజ్ఞము వలన జగత్తులు, జీవులు సృష్టింపబడి తిరిగి లయము ద్వారా ఆహుతిగా పరబ్రహ్మ యందు సమర్పించబడుతున్నది. తెలుసుకొని వాడు భగవంతుడే. తెలుసుకొను విధానము అతనే. తెలుసుకోబడునది అతనే. మునులు ఋషులు ప్రస్తుతించిన స్తుతించిన, విశ్వ పవిత్ర గ్రంథము అతనే. అతనిని దివ్య గ్రంథముల యందు మానవుడు ఆత్మసాక్షాత్కారము సిద్ధింప చేసుకొను విద్యగా వారు లిఖించిరి.ఆత్మ నిగ్రహ సారాంశము అతనే.(అనగా యోగులకు ప్రభువైన శివుడు- విస్మయము గెలుపు తపస్సు చేత, ధ్యానము చేత అతను మిక్కిలి శక్తివంతుడు.) అతను విశ్వసంబంధిత కార్యకలాపములను చేయుచున్నను తన యందే ,తానే వాటి కల్మషము అంటక ఉండును. అతని నిష్కపటమైన, సూటి అయిన తత్వము అతని యొక్క నిర్మలమైన, నిశ్చల మైన శాశ్విత ధర్మమై ఉన్నది.
పరమాత్మ అహింస స్వరూపము. తను సర్వ ఆపదల నుండి రక్షణ కల్పించువాడు. జీవులకు బాధను కలిగించు లేక వారిని గాయపరచు తలపు లేని వాడు. మనిషి తనకు లభించిన బుద్ధి స్వేచ్ఛను దుర్వినియోగ పరచి భ్రాంతి కరమైన ద్వందములతో తనను పోల్చుకొనుట వలన అతను తనకు తానుగా హానిని కల్పించుకొనుచున్నాడు. విశ్వమునందలి దృశ్య రూపమునకు కారణమైన సచ్చిదానంద స్వరూప ఏకైక సత్యము అతనే. అతని యందు క్రోధము లేదు. కోరికలే లేని అతని యందు మానవుడు కోరినవన్నీ లేదనక ఇచ్చినటువంటి తత్వము ఉన్నది. ఆయన ఏర్పరిచిన సృష్టి సూత్రములు మానవులను శిక్షించుటకు కాదు. - అవి అతని ప్రేమను వెలిబుచ్చుచున్నది. పరిత్యాగమునకు పరిపూర్ణ చిహ్నము అతను. అతను తన లీలగా సృష్టించిన ప్రకృతి విశేషములతో తాను కూడి ఉన్నను, లేక వీడి ఉన్నను, అతడు పూర్ణ తృప్తుడై నిర్యామోహము తో ఉండి తన యందలి దివ్యానందము నందు మునిగి ఉండువాడు. తనయందలి సృష్టి నందు కలుగు సాపేక్షతల అలజడి వెనక అతను సదా ప్రశాంతతతో నిండి, మార్పు చెందక, నిశ్చలమైన శాంతముతో ఉండువాడు. నిష్కపటమైన ఆ ప్రభువు ఎవరి తప్పులను బాహ్యపరచడు. మానవుని గత కాల దుష్ట ప్రవర్తన అతనిని శిక్షింపక మునుపే భగవంతుడు అతనికి ఏకాంతమైన అతని హృదయము నందే అతను చేసిన తప్పులకు క్షమను అర్థించును అవకాశమును కల్పించును. తద్వారా అతను (వ్యక్తి) ఆత్మ విమర్శ చేసుకొని తన మార్గమును సరిదిద్దుకొను అవకాశం కలదు.(మనిషి ఒంటరిగా తన తప్పును తాను తెలుసుకొని భగవంతునికి చెప్పుకొని సరిదిద్దుకొన వచ్చును). అన్ని జీవుల యందు బాధను అనుభవించినది భగవంతుడే. అతను జీవుల కష్టములను తనవిగా భావించు దయాస్వరూపుడు. అతను అనంతమైన కరుణా స్వరూపుడు. అతని కరుణను సకల జీవులు పొందగలవు. ఈ జగత్తులన్నింటినీ సృష్టించినది అతనే అయినను, సృష్టి నుండి అతను ఏమి కోరడు. తన అద్భుత శక్తులను అతను పరిణామ క్రమమును (సృష్టి స్థితి లయ ను) నడిపించు సూత్రములకు ఇచ్చెను. మరియు తన పిల్లలు ఉపయోగించ గలుగు బుద్ధి స్వేచ్ఛకు తన అద్భుత శక్తులను కల్పించి వాటి ద్వారా వారు నూతన విధానం ఏర్పరచుకొను శక్తిని ఇచ్చెను. (బుద్ధి స్వేచ్ఛ తన అద్భుత శక్తులను కల్పించి వాటి ద్వారా వారు నూతన విధానములను ఏర్పరచుకొను శక్తిని ఇచ్చాను). ప్రతిఫలముగా ఆయన జ్ఞానుల నుండి, ప్రేమ పూర్వక హృదయము కలవారి నుండి నామమాత్రముగా వారు అర్పణ గావించు దానిని, అది లభించినప్పుడు స్వీకరించును. (భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే స్వీకరించును). అతను సౌమ్యంగా ,ప్రేమ పూర్వకముగా, సృష్టిని వెనుకకు(లయ) లాగుకొనుట వలన సృష్టి యందు ఏకత్వము కల్పించబడి, సృష్టి వెనుకకు మరలి అతని యందు చేరును. లేనిచో సృష్టి యందలి తరంగ శక్తి యొక్క వికర్షణ శక్తి ప్రచండమైన అస్థిరతను కల్పించి, సృష్టిని శాశ్వతముగా అస్తావ్యస్థ స్థితియందు నిలుపును. భగవంతుడు సుగుణ శ్రేష్టుడు. అతను నిరహంకార మహోన్నత స్వరూపము. భగవంతుని చర్యలు ఏవియు అనౌచిత్యము కావు. పరమాత్మ తన దివ్యానందము మరియు జ్ఞానము నందు క్రీడించుచు చంచలత్వపు కలత లేకుండును. దివ్య పరమాత్మ నిష్క్రియా తత్వముతో కూడిన క్రియాశీలతను కలిగి (ఇన్ యాక్టీవ్లీ ఆక్టివ్) జగత్తులను, జీవులను కలత చెందిన చంచల స్వభావపు కోరికతో సృష్టించలేదు. అతని సృష్టి రహస్యము వెనుక దాగివున్న దివ్య లక్ష్యమును , మాయను చేదించిన జీవులు మాత్రము గ్రహింపగలరు.
భగవంతుడు మరియు సర్వవ్యాప్తి, ఏ శక్తి తేజస్సు, జగత్తుల యందు చైతన్యమును ప్రాణ శక్తిని నింపును. అతని పిల్లలపై అతనిది కల స్వార్ధమెరుగని ప్రేమతో అతను వారిపై గొప్ప క్షమా గుణమును ప్రదర్శించును. జీవుల కర్మానుసారము వారికి అనుగ్రహమును ప్రసాదించుటయే కాక సర్వమునకు అతీతమైన అతని దయాగుణముచే కూడా అతను వారిని కటాక్షించును. దివ్య పరమాత్మ యొక్క అనంతమైన ఓరిని పురాణ గ్రంథములు ఈ విధముగా ప్రస్తుతించుచున్నవి. "అతను శాశ్వతుడు, నిశ్చళుడు, సర్వ జీవులను సదా పోషించువాడు. "అతను మార్పు చెందని మచ్చలేని తత్వము కలవాడు. సహజమైన స్వచ్ఛత కలిగిన వాడు. నిష్కల్మషమైన అతని కాంతి యందు సృష్టి ఏర్పడి, ఆ సృష్టి యందు మంచి చెడులు నీడలుగా నాట్యమాడును. (సృష్టి నడిపించబడుతుంది. సృష్టిలో మంచి చెడులు ఉంటాయి) అయినను వాటి వలన అతను ఏమాత్రమును కల్మషము పొందడు. అతను అందరి యందు సమాన రూపమున ఉన్నవాడు: కనుక అతని దృష్టి యందు నిందింప దగిన వారు లేరు.
బైబిల్ వాక్యము:-"ఆయన దుర్మార్గుల పైనను, సన్మార్గుల పైనను తన సూర్యుడిని ఉదయింప చేసి అదేవిధంగా నీతిమంతుల పైనను, అవినీతి పరులల పైనను వర్షమును కురిపించుచున్నాడు."
సర్వ జగత్తులకు చక్రవర్తి అయినా దివ్య పరమాత్మ తన శక్తిని ఉపయోగించినప్పుడు తన శక్తిని ఉపయోగించినప్పుడు ప్రేమనే కనపరుచును. మరియు తన సామ్రాజ్యమునకు తానే వినయముతో కూడిన సేవకుల వలే పని చేయుచు, సామ్రాజ్యమును కొరకు అందలి జీవుల కొరకు, సత్యము కొరకు, సౌందర్యము కొరకు, ప్రేమ కొరకు పరిపాలించును.
16వ అధ్యాయం 1,2,3, శ్లోకాలు సమాప్తం.
16:4 నుండి 20 వరకు ఒక విభాగము:-
భగవంతుడిని నిరాకరించిన జీవుల స్వభావము వారి గతి
16:4 వ శ్లోకము అర్థము:-
ఓ అర్జున వ్యర్థపూరిత అహంకారము (గర్వము) దురహంకారము, దురభిమానము, క్రోధము, పరుషత్వము, అజ్ఞానము అనునవితో పుట్టిన వాని లక్షణములు.
16:5 లో శ్లోకం అర్థము:-
దైవీ గుణములు మోక్షమును ప్రసాదించును. రాక్షస గుణములు కలిగించును బంధమును కలిగించును.
ఓ అర్జున నీవు కలత చందన అవసరం లేదు. నీవు దైవగుణ సంపన్నుడివి.
16:4,5 వ శ్లోకాల వ్యాఖ్యానము:-
జన్మల చెడు కర్మల ఫలితముగా కొందరు మానవులు జన్మించినది మొదలు దుర్మార్గమునే అవలంబింతురు. సన్మార్గులకు విరుద్ధమైన రీతిలో దుర్మార్గమును అవలంబించు వారు తమ అధీనమునందున్న శక్తిని (అది ఎటువంటి దుష్టశక్తి అయినను సరే), ధనమును, సాంఘిక హోదా లేక గ్రంథ పఠనము వలన కలిగిన తెలివిని దుర్వినియోగ పరిచెదరు. అటువంటి దుర్వినియోగమును తాము సాధించిన గొప్పతనముగా భావించెదరు. వారు వారి అహంకార స్వభావమును ఆడంబరముల చేత, ఆత్మస్తుతి చేత, వంచనతో కూడిన మాటల చేత, మరింత అధికముగా చేసి చిత్రీకరింతురు. వారు తమను తాము ఉన్నతులుగా చిత్రీకరించు కొనుట కొరకు అహంకారపూరితముగా ఇతరులన వారు స్వార్ధ ప్రయోజనముతో తమ ప్రాముఖ్యతను పెంచుకొనుటలో పూర్తి అహంకారముతో నిండి ఉందురు. వారి అదృష్టమే నెరవేర వలెనని తలపు కలిగి దానికి ప్రతికూలత ఎదురైనచో వారు మిక్కిలి కోపోద్రిక్తులగుదురు. మరియు ఏ కారణమూ లేకపోయిననూ వారు కోపోద్రిక్తులు అగుదురు. వారి ప్రవర్తన మిక్కిలి కాఠిన్యముతో కూడి ఉండును. ఆలోచన రహితముగా నైనను లేక బుద్ధి పూర్వకముగానైనను వారు క్రూరమైన రీతిలో ప్రవర్తింతురు. భ్రాంతితో కూడిన అజ్ఞానముచే వారి బుద్ధి మసకబారి, తప్పు ఒప్పులను నిర్ణయింపలేని లోకజ్ఞానమును కూడా వారు కోల్పోవుదురు. ఆ విధముగా వారు వక్రీకరింపబడిన వారి నమ్మకముల విలువల నుండి , మానసిక స్థితి నుండి పనులను చేయుచు వారి దురభిప్రాయములచే , దారి తప్పిన ప్రవర్తనచే ఇతరులను భాదించెదరు.అసుర లక్షణములను శ్రీకృష్ణుడు తెలుపగా విని, అర్జునుడు మిక్కిలి వినయముతో తన యందు అట్టి గుణములు కలవా అని చింతింప సాగెను. అతని ఆలోచనలను గ్రహించిన శ్రీకృష్ణుడు అతనికి అట్టి దుర్గుణములు ఏవియు లేవని తెలిపెను.
ఆధ్యాత్మిక మార్గమున పట్టుదలతో సాధన చేయు భక్తుడు తన దోషములను తెలుసుకొను ప్రయత్నమున అర్జునుడికి కలిగిన సందేహమునే పొందుదురు. సాధకుడు తమ ఆత్మ యొక్క అతీంద్రియ జ్ఞానముచే తాను తన దివ్యమైన లక్ష్యమును చేరుటకు సరి అయిన మార్గముననే ఉండుటను తెలుసుకొని అతను మిక్కిలి సంతృష్టుడు అగును.
16:6 వ శ్లోకం అర్థము:-
ఓ అర్జున ఈ లోకమున ద్వివిధములైన మానవులు కలరు:
1. ఒకటి దైవ గుణము కలవారు.
2. అసుర గుణములు కలవారు.
దైవ గుణములను నేను నీకు పూర్తిగా వివరించితిని. ఇప్పుడు అసుర గుణములను వినుము.
16:6 వ శ్లోకం వ్యాఖ్యానము:-
*దౌవ్ భూత స్వర్గ*
ఒక యోగి ఆత్మకథ యందు నేను ఈ విధముగా రాసితిని."ఒక మనిషి విలువను నిర్ధారించుటకు యోగి ఒక స్థిరమైన ప్రమాణమును అనుసరించును. సాధారణ ప్రపంచంలో అనుసరించు అస్థిరమైన ప్రమాణముల కన్నను అది ఎంతో వేరైనది . మానవులు అందరూ తమలో తాము భిన్న రకములైన వారిని వారు తలచినను, సద్గురువు వారిని ద్వివిధమైన తరగతులకు చెందినవారీగా పరిగణించును.
భగవంతుని కొరకు అన్వేషించని అజ్ఞానులు మరియు భగవంతుడిని అన్వేషించు వివేకవంతులు".
16:7 నుండి 18 ఒక విభాగము
16:7 వ శ్లోకము అర్థము:-
అసురీ గుణములు కలవారికి సన్మార్గమును అనుసరించటం తెలియదు. అదేవిధంగా వారికి తెలియదు దుర్మార్గమును అనుసరింపరాదని కూడా తెలియదు. వారి యందు నిర్మలతము, సత్యము కానరావు. వారు సత్ప్రవర్తనను కలిగి ఉండరు.
16:8 వ శ్లోకము అర్థము:-
అసురీ లక్షణములు కలవారు ఈ విధముగా పలికేదరు." ఈ ప్రపంచమునకు ఒక నైతిక ఆధారము లేదు.(నైతికము అనైతికము ఏమి లేదు) .ఈ జగత్తున పరమ సత్యము అనునది ఏదియు లేదు. ఈ జగత్తున భగవంతుడు, దీనిని పరిపాలించు వారు ఎవ్వరును లేరు . ఈ జగత్తు ఒక క్రమ పద్ధతిన కారణభూతమై ఉండలేదు. జగత్ నందలి ముఖ్య ఉద్దేశ్యము కామ పీడిత కోరికలు కాక మరి ఏమున్నది? ".
16:9 వ శ్లోకము అర్థము:-
అల్ప బుద్ధి కలిగిన అటువంటి భ్రష్టచారులు తప్పైనా తమ అభిప్రాయములకే కట్టుబడి ఉండి , అనేక అకృత్యములను చేయుదురు. ప్రపంచ వినాశనమును కోరు అటువంటి మనుషులు ఈ ప్రపంచమునకే శత్రువులు.
16:10వ శ్లోకము అర్థము:-
తృప్తి తీరని కోరికలతో మునిగి తేలుతూ, కపటముతో నిండి, అమర్యాద అహంకారముతో కూడి, బ్రాంతిచే దుర్మార్గపు ఆలోచనలను కలిగి, వారు చేయు పనులు అన్నియు అపవిత్రతచే సంకల్పించబడి ఉండును.
16:11 వ శ్లోకము అర్థము:-
శారీరక కోరికలను తృప్తి పరచుటయే మానవుని అత్యున్నత లక్ష్యము అని ఈ జగత్తే సర్వస్వము అని భావించి, అట్టి మనుషులు జీవితాంతం వరకు ప్రాపంచిక చింతల తోనే గడుపుదురు.
16:12 వ శ్లోకము అర్థము:-
స్వార్థపూరితమైన కోరికలు, ఆశలు అను వందల కొలది బంధముల యందు చిక్కుకొని అట్టివారు క్రోధమునకు బలమైన కోరికలకు బానిసలై శారీరక ఆనందము కొరకు అనైతిక విధానముల యందు ధనమును సంపాదించుటకు తీవ్రముగా శ్రమించెదరు.
16:13 వ శ్లోకము అర్థము:-
అసురి లక్షణములు కలవారు క్రింద తెలిపిన విధమైన ఆలోచనలతో ఉండదరు.
" నేను ఈరోజు దీనిని సంపాదించితిని. ఇప్పుడు నేను మరి ఒక కోరికను సంతృప్తి పరిచయెదను. ఇది నా ప్రస్తుత సంపద. కానీ నేను ఇంతకన్నను సంపాదించెదను."
16:14 వ శ్లోకము అర్థము:-
"నేను నా శత్రువును సంహరించితిని. ఇతర శత్రువులను కూడా సంహరించెదను. మనుషులను పరిపాలించు ప్రభువును నేను. సకల సంపదలను నేను అనుభవించెదను. నేను సఫలతను పొంది మిక్కిలి బలమును కలవాడినై సంతోషముతో ఉన్నాను."
16:15 వ శ్లోకము అర్థము:-
"నేను ధనవంతుడను. గొప్ప వంశము నందు జన్మించిన వాడను, నాతో సాటి ఎవరు రాగలరు? గొప్ప ఆడంబరంలతో నేను దానమును చేసి లాంచన ప్రాయముగా క్రతువులను నిర్వర్తించెదను. నేను ఈ విధముగానే ఆనందించెదను." -
ఆ విధముగా అసురీ గుణములు కలవారు పలికి అజ్ఞానం చే బ్రష్టులగుదురు.
16:16 వ శ్లోకము అర్థము:-
బ్రహ్మతో కూడిన ఆలోచనలతో మునిగి, బ్రాంతి అను వల యందు చిక్కి, ఇంద్రియ ఆనందముల కొరకు ప్రాకులాడుతూ వారు చివరకు ఘోర నరకమున పడదరు.
16:17 వ శ్లోకము అర్థము:-
అహంకారముతో నిండి మూర్ఖత్వముతో వారు ధన మధముచే మత్తెక్కి వారు నిత్య క్రతువులను కుటిల స్వభావముతో శాస్త్ర విధానములను పాటింపక నిర్వర్తింతురు.
16:18 వ శ్లోకము అర్థము:-
అహంకారపూరితమై, ధన గర్వితులై, గర్వముతో నిండి కామ ఆత్రురత కలవారు, స్వభావము కలవారు - ఈ విధమైన ద్వేష స్వభావము కల మానవులు వారి శరీరముల యందు మరియు ఇతరుల శరీరముల యందు ఉన్న నన్ను తృణీకరించెదరు.
"16 :7 నుండి 18 శ్లోకముల వ్యాఖ్యానము:-"
బ్రాంతి యందు పూర్తిగా మునిగిన అహంబావ పూరిత వ్యక్తి తన తప్పైనా అభిప్రాయమునకు అలవాటు పడి , స్వార్థపూరిత కోరికలతో నిండి తన అలవి కాని అహమును కామా ఆతృత అను పీఠమును ఎక్కించి (కామానికి అధికమైన పీఠమును ఇచ్చి) దానిని అధికారముతోనూ, సంపదలతోనూ, ఇంద్రియ సుఖములతోనూ నింపును. ఆ విధముగా అతను తన వ్యక్తిత్వమునే ఆరాధించుకొనుట యందు నిమగ్నమగును. తనని నే దైవ శక్తిగా భావించిన అతని హస్వదృష్టిని ,(దృష్టిలోపము) అతనికి భగవంతుడిని, సత్యమును తెలుసుకొని అవకాశమును కల్పించదు. అతని అహం పూరిత స్వభావమును అతను కపటమైన ధర్మ వర్తనము తోనూ, దానధర్మముల ఆడంబరములతోనూ కప్పిపుచ్చినను , అతని దుష్ట చర్యలు, అత్యాశ కోరిక తీరనప్పుడు కలుగు దుష్ట చర్యలు క్రోధము అతని యందు దాగివున్న అతని తత్వమును తెలియజేయును.
16:19,20 ఒక విభాగము:-
16:19 శ్లోకం అర్థము:-
ద్వేషముతో కూడిన దుర్మార్గమును అనుసరించు క్రూరులైన వారు మానవులలో అత్యంత అధములైన వారు . వారి పునర్జన్మల యందు వారిని నేను మరలా మరలా అసూయ గర్భమున పడవేసెదను.
16:20:-శ్లోకం అర్థం:-
అసురీ తత్వముతో జన్మించిన వారు ప్రతి జన్మ యందు, మాయ యందు మునిగి నన్ను చేరుకొనలేరు. ఆ విధముగా వారు అత్యంత అధమమైన స్థితిని పొందెదరు.
16:19,20 శ్లోకాల వ్యాఖ్యానము:-
భగవంతుని ఆజ్ఞను అతిక్రమించిన వారిని శాశ్వతముగా నరకమున ఉండినట్లు భగవంతుడు ప్రతీకారముతో శాసింపడు. కానీ భగవంతుడు కర్మ సిద్ధాంతమును ఏర్పాటు చేసెను. కర్మ సిద్ధాంతము పనికి మానవుడు చేయు ప్రతి పనికి ఒక ఫలితమును కల్పించును. కర్మ సిద్ధాంతము అనునది జన్మలెత్తు ఆత్మలను శాశ్వతంగా మాయ ప్రభావమునకు లొంగి ఉండక ఉండునట్లు చేయు ఒక విధమైన బోధన ప్రక్రియ. (టీచింగ్ మెకానిజం). మానవుడు పరిణామ క్రమమున ఉన్నత స్థితిని చేరుటకు కర్మ సిద్ధాంతము తో పాటు బుద్ధి స్వేచ్ఛ అను భగవత్ పరమైన శక్తి "కేవలము మానవులకు మాత్రమే ఇవ్వబడినది". బుద్ధి స్వేచ్ఛ అనునది మానవునికి భగవంతుడు ఉదారముగా ఇచ్చిన ఒక వరము లేక కానుక. అది మానవుని అంతరంగము నందు అతనికి దిశా నిర్దేశ సూచనలను ఇచ్చును. మానవుడు అటువంటి శక్తిని దుర్వినియోగ పరచిన యెడల అతని అంతరంగమున అతని బుద్ధి స్వేచ్ఛ యొక్క ప్రభావము బలహీన పడును. దివ్యమైన విచక్షణాశక్తి నశించిన ఎడల మానవుడు పశుప్రాయుడై అతను తన చెడు అలవాట్ల ప్ప్రవృత్తి చే నడిపింపబడును. అటువంటి వ్యక్తుల యందు వారి దుష్ట తామసిక గుణ
స్వభావము దివ్యమైన తత్వ గుణమును మరుగు పరుచును - మరియు రాజసిక గుణమునకు చెందిన భౌతిక కార్యకలాపాల ఆసక్తిని అణచివేయును. కనుక కర్మ సిద్ధాంతమును అనుసరించి మనుషుల యందు అధములైన ఇట్టి మానవులు తమ తదుపరి జన్మలయందు నీచమైన స్థితిని పొందెదరు. మరియు తమ దుర్మార్గపు అలవాట్ల ప్రవర్తనకు సరితూగు పరిసరముల యందు జన్మింతురు.
భగవంతుడు ఇచ్చిన బుద్ధి స్వేచ్ఛను సక్రమముగా వినియోగించిన మానవుడు పునర్జన్మల యందు దివ్య గుణములతో కూడి ఉన్న శరీరముల యందు, దివ్యమైన పరిసరముల యందు జన్మించును. బుద్ధి స్వేచ్ఛను దుర్వినియోగ పరచిన మానవుడు అసలు గర్భము నందు జన్మించును. అనగా భూమిపైన లేక ఇతర లోకముల యందు దుర్భరమైన స్థితుల యందు జన్మించును. అట్టిస్థితి తీవ్రమైన హింస బాధలతో కూడి ఉండును. లేక భీతిని గొలుపు జీవులకు చెందిన, అంధకారముతో కూడిన సూక్ష్మ లోకముల యందు అతను జన్మించును. మానవుడు అజ్ఞానం నుండి బయటపడుటకు సరి అయిన నిర్ణయం తోను, సరి అయిన కార్యాచరణతోను ప్రయత్నింపని ఎడల అతని అసరీ తత్వమునకు చెందిన కర్మ ప్రభావము అతనిని అనేక జన్మలు అంధకారముతో కూడిన అజ్ఞానము నందు చిక్కి ఉండునట్లు చేయును. ఆ విధముగా వారు అత్యంత అధమమైన స్థాయికి చేరుకొని మృగముల వలె లేక ఇతర మాధ్యమముల యందు సూక్ష్మ లోకమునకు చెందిన మృగముల వలే జన్మింతురు. (బుద్ధి నశించి, పిచ్చిగా ప్రవర్తించువారు ఆ విధముగా జన్మింతురు.) అటువంటి జీవులకు (జంతువులకు) బుద్ధి స్వేచ్ఛ ఉండదు. అందుచే వాటికి కర్మ ఫలములు ఉండవు. అధమ స్థాయికి చెందిన జీవులకు ఆ విధమైన జీవనము లభించును. మృగ జీవితము నందు పాత కర్మను అనుభవించి, కొత్త కర్మ ఏర్పడక ఆ విధముగా గడచిన పిదప అట్టి జీవులకు భగవంతుడు తమను తాము ఉద్ధరించు కొనుటకు మరొక నూతన అవకాశమును ఇచ్చును.
16:21,22 శ్లోకాలు ఒక విభాగము:-
"నరకమునకు మూడు ద్వారములు" :-
16:21:- శ్లోకమునకు అర్థము :-
ఆత్మ సంక్షేమమును భంగపరచు ప్రవేశ ద్వారములు మూడు కలవు. అవి కామము, క్రోధము ,లోభము. కనుక మానవుడు వీటిని త్యజించ వలెను.
16: 22 :- శ్లోకము అర్థము:-
ఓ కుంతీపుత్ర అర్జున అంధకార లోకములకు చెందిన ఈ ప్రవేశ మార్గములను విడచిన వారు తమ సత్ప్రవర్తను అనుసరించి దివ్య పరమాత్మను చేరెదరు.
16: 21 & 22 శ్లోకాల వ్యాఖ్యానం:-
ఆత్మకు చెందిన అహం స్వరూపమును కామ క్రోధ లోభ అనేడి గుణములు భాదించునని తన యోగ సూత్రముల యందు పతంజలి పేర్కొనెను. హానికరములకు, ఈ దుష్ట లక్షణములను వాటి వినాశకర ప్రభావములను భగవద్గీత ఒకటవ అధ్యాయము నందలి 9 వ శ్లోకం యొక్క వ్యాఖ్యానము నందు వివరించబడినది. తామసమునకు చెందిన ఈ గుణమునకు తావిచ్చిన, అవి మనిషి చేయు ప్రతి కార్యక్రమం నందు, అతని ప్రతి ఆలోచన యందు, ఏదో ఒక రూపమున చొచ్చుక పోయి, ఆ వ్యక్తిని నరకము వంటి బ్రాంతి కరమైన అజ్ఞానపు అగాధమైన లోతులకు లాగి వేయును.
కానీ ఆత్మ భగవంతుని నుండి ఏర్పడినది. భగవంతుని వలె శాశ్వత తత్వము కలది. అందుచే ఆత్మ భగవంతుని నుండి వేరుగా శాశ్వతముగా ఉండజాలదు. ఆత్మ యందు సహజముగా ఉన్న స్వేచ్ఛ గుణము కర్మ వలన, అలవాట్ల వలన తాత్కాలికముగా నిర్బంధించబడినను అది (స్వేచ్ఛ గుణము)శాశ్వతముగా అణిచి వేయబడదు. మనిషి యందలి బుద్ధి స్వేచ్ఛ తన శ్రేయోభిలాషి ,తన ఆప్తుడు దివ్యమైన విచక్షణాశక్తియే అని గ్రహించి తామస గుణమునకు చెందిన ప్రలోభములు తన శ్రేయోభిలాషులు ,ఆప్తులు కారని గుర్తించినప్పుడు, (మనిషి లో పరివర్తన కలిగినప్పుడు) కరుడుగట్టిన దుర్మార్గుల సైతము పశ్చాత్తాపము చెంది తమ విధానములను మార్చుకొనుటకు ప్రయత్నింతురు. బాధ్యతలను నిర్వహించడం వలన సజీవ శక్తి కలుగును. సత్వగుణ కర్మలను చేయుట వలన భగవంతుని స్మరణ కలుగును. కనుక పతనమైన మనస్తత్వము కలిగిన జీవులు పైన తెలిపిన రాజసిక బాధ్యతలను నిర్వర్తించుటవలన,సత్వగుణ కర్మలను చేయుట వలన, బలమైన భగవంతుని కృప వారికి సహకరించి ఉన్నత పదమునకు లాగును. దీనికి తోడు వారి సత్కర్మల బలము వారి అంతరంగ ఆత్మ పునరుద్ధరణ ఆధ్యాత్మిక శక్తి వారికి సహకరించును. ఆ విధముగా దివ్య పరమాత్మ కరుణతో కూడిన ప్రేమతో పతనమైన ప్రతి ఆత్మను
పునరుద్దరించుట యందు తన బాధ్యతను మరువడు.
సూక్ష్మ శరీరమందలి దిగువన ఉన్న మూడు వెన్ను చక్రములు భౌతిక కార్యకలాపములకు చెందినవి. వీటి ద్వారా ప్రవహించు ప్రతికూల (నెగటివ్ ఎనర్జీ)శక్తులను మూడు అర్థముతో గూడ అర్థముతో చెప్పబడినది. ఈ చక్రము నుండి బాహ్యమునకు వెలువడు శక్తి ,చైతన్యము అంధకార తామస గుణ ప్రభావము చే సంకల్పింపబడినప్పుడు, మనిషి యొక్క పతనము నరక స్థితి దిశగా ప్రారంభమగును. 1వ అధ్యాయము 11వ శ్లోకమున చెప్పబడిన విధముగా కామము అనునది అనా మూలాధార చక్రమునందలి ఒక ప్రతికూల శక్తి. అది ఆధ్యాత్మిక మార్గమునకు అవరోధమును కల్పించినది. తీరని కామము ప్రతికూలమైన క్రోధమును కలిగించును. అది స్వాధిష్ఠాన చక్రము నందు ఉత్పన్నమగు ఒక అవరోధ శక్తి. లోభములను ఇష్టములను కలిగించును. కటి ప్రాంతమున (లంబ )నందున్న అవరోధ శక్తి ఇట్టి గుణమును కల్పించును. ఈ మూడు ప్రతికూల శక్తులు శరీరం మందలి చైతన్యమును భౌతిక విషయముల వైపున లాగి మనిషిని ఇంద్రియములకు బానిసను చేయును. అందుచేతనే భగవద్గీత యందు వాటిని నరక ద్వారములు అని చెప్పబడినది. అవియే మనిషిని ఆధ్యాత్మిక మార్గమును మరచినట్లు చేయును.
యోగి శారీరకముగాను, మానసికముకను అంధకారమునకు చెందిన ఈ మూడు స్థావరంల కామ,,క్రోధ ,లోభములు)నుండి దూరముగా తొలగిపోవును. యోగి క్రియా యోగ ధ్యానము నందు తన చైతన్యమును వెన్ను స్థావరముల యందలి ఆత్మకు చెందిన దివ్య గుణముల అవగాహన స్థితికి చేర్చును. భౌతిక శరీరమునకు ,ఇంద్రియములకు దిగజారిన శక్తిని ,చైతన్యమును యోగి తిరోగమనము గావించి అతను క్రమముగా ఆత్మసాక్షాత్కారము - భగవత్ ఐక్యతకు చెందిన దివ్యస్థితికి తన చైతన్యమను ఊర్ద్వ దిశగా పయనింపచేయును.
16:23,24 ఒక విభాగము
"సక్రమమైన జీవన విధానం కొరకు దివ్య గ్రంథముల యందు సూచింపబడిన ఉపదేశములను సరి అయిన విధమున అవగాహన చేసుకొనుట." :-
16:23 వ శ్లోకం అర్థము:-
దివ్య గ్రంథముల యందు సూచింపబడిన ఉపదేశములను తమ కోరికలకు అనుగుణంగా నడుచుకొనువారు పరిపూర్ణ శక్తిని లేక ఆనందమును పొందజాలరు. మరియు వారు జీవిత పరమ లక్ష్యమును చేరలేరు. కావున ఆచరింపవలసిన ధర్మములను, త్యజింప వలసిన కర్మలను నిర్ణయించుట యందు శాస్త్రములనే ప్రమాణముగా స్వీకరించుము. దివ్య గ్రంథముల యందు తెలుపబడిన ఉపదేశములను సహజావ బోధ శక్తిచే (ఇన్స్టేటివ్ అండర్స్టాండ్ ,
Instative understand)జయించి , ఈ ధర్మములను ఈ జగత్తు నందు సంతోషముగా నిర్వర్తించుము.
16:23,24 వ్యాఖ్యానము:-
బాహ్యమైన ప్రకృతి కార్యకలాపములను మరియు అంతర్గతమైన సర్వ వ్యాపిత ప్రజ్ఞ - చైతన్యమును సమగ్రముగా సంక్షిప్తంగా మానవ శరీరము వ్యక్తపరచున్నదై ఉన్నది. చాలా విశ్వమును సృష్టించిన విశ్వ శక్తులు ,విధి నిర్ణయములే విశాల విశ్వం యొక్క సంక్షిప్త రూపముగా మానవ శరీరమును నిర్మించినవి. ఆ విధముగా మానవుని శరీరమే నిజమైన జ్ఞానమును వ్యక్తపరచునట్టిది. మానవుని శరీరమే శాస్త్రములు లేక వేదములు. (ఈ శరీరానికి వేదాలు, శాస్త్రాలు తెలుసుకునే శక్తి ఉన్నది). వేద గంధములను బాహ్య విషయములకు చెందిన మరియు అంతర్గత విషయములకు చెందిన రెండు విభాగములుగా విభజించవచ్చును. సత్కర్మలను (యజ్ఞ యాగాదులు),నియమాచారములను (మనిషి ఏ విధంగా చేయాలి, చేయకూడదు అనేవి తెలుపుతుంది )వేదములు బాహ్య విషయములుగా తెలుపుచున్నవి. వేదముల యందలి అంతర్గత విషయము జ్ఞానము. దీనికి సమాంతరంగా మానవుడు తన చైతన్యవంతమైన శరీరంతో చేయు కార్యక్రమములు వేదముల యందలి బాహ్య విషయములు. మానవుని సూక్ష్మ శరీరమునకు చెందిన, సూక్ష్మ చక్రస్థానముల, చైతన్యపు ఉన్నత స్థితికి చెందిన విషయములు వేదముల యందలి అంతర్గత నిగూఢమైన విషయముల వంటివి. (వేదాలలో జ్ఞానము అంతర్గతమై ఉన్నది).
"మనసు - ఇంద్రియములకు చెందిన పరిమిత శక్తులను అధిగమించి యోగి శుద్ధమైన ఆత్మావ బోధ శక్తిచే (ప్యూర్ ఇన్స్టిట్యూషన్ గ్రహించును.) " :-
భగవద్గీత వ్యాఖ్యానము నందు మానవుని జీవిత లక్ష్యము అతని నిజ స్థితి అగు ఆత్మ యందు అతను సుస్థితడు అగుటయే అని వివరించబడినది. యోగాభ్యాసము ద్వారా ఆత్మసాక్షాత్కారమును సాధించగలరు. ఆత్మసాక్షాత్కారము వలన కలిగిన దివ్య అనుభవము చే సాధకుడు స్వయంగా సృష్టికి చెందిన అన్ని సత్యములను, మరియు సృష్టికి కారణమైన పరమాత్మను తెలుసుకొనగలుగును. తన శరీరము నందు ఉన్న మెదడు ,వెన్నెముక ప్రాణశక్తి, చైతన్యముతో కూడి అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నదను విషయమును సాధారణ మానవుడు ఎరుగక ఉండును. అది అది సాధన చేసిన ఒక య యోగి తన మనసు,ఇంద్రియముల పరిమితమైన శక్తులను అధిగమించి తన ఆత్మ యొక్క శుద్ధమైన అతీంద్రియ అవగాహన శక్తిచే తన శరీరమైన నిజమైన తత్వమును, అది పనిచేయు విధానమును గ్రహించి ఉండును. శరీరమునందలి జీవము,తెలివి దివ్యమైన మెదడు,వెన్నుముకకు చెందిన శక్తిని నిలువ చేయు స్థావరంల నుండి వెలువడు ప్రాణశక్తి మరియు చైతన్యముచే శక్తివంతము గావించబడునని అతనికి తెలిసి ఉండును.
శరీరమే నేను అని భావించు వ్యక్తికి చైతన్యమునకు, మరియు దాని క్రియాశీలతకు చెందిన ఈ దివ్యమైన శరీర అవయవము గురించి ఏమియు తెలియదు. అతను లక్ష్యము లేని శారీరక కార్యక్రమముల యందు మునిగి కోరికల చేతను, ప్రలోభముల చేతను పీడింప బడుచుండును. శరీరమునకు చెందిన చెపలత్వముతో కూడిన కోరికలను సంతృప్తి పరచుట యందు అతను నిమగ్నుడై , అతను తాత్కాలికమైన ఆనందమును - తీవ్రమైన దుఃఖములను కలబోసి అనుభవించుచుండును. అతను తామసమునకు చెందిన అంధకార భ్రాంతియందు ఎంత లోతునకు మునిగిపోవునో, అతను తన అంతరంగమునకు చెందిన దివ్యానందమునకు,తన నిజతత్వము యొక్క సంపూర్ణతత్వమునకు, భగవంతుని తోడి దివ్యమైన సంపర్కమునకు, అంత దూరముగా జరిగిపోవును. అతను ధృడమైన నిశ్చయముతో తన చర్యలను (శారీరకమైనవి ,మానసికమైనవి అంటే ధ్యానము చేయడం) శాస్త్రముల యందు తెలిపిన ఉపదేశానుసారము సరిదిద్దుకొనినప్పుడు, అతని పునరుద్దానము ప్రారంభమై చివరకు అంతర్గత సూక్ష్మ చక్ర స్థావరముల జాగురూకతతో మరియు దివ్య అవగాహనతో అతను ఉన్నత స్థితిని చేరును.
కొందరు మూడవిశ్వాసము కలవారు మానవుడు జీవించు విధానమును సూచించు తమదైన సిద్ధాంతపరమైన నమ్మకములను సమర్ధించు కొందురు. లేక వారు వాటిని ఇతరులపై విధింప చేసెదరు. అట్టి ప్రయత్నములను వారు ధర్మబద్ధమైనదిగా పరిగణించి ఆ నెపమున అనేక నేరములను చేసి, అనేక యుద్ధములను కూడా జరిపి ఉన్నారు. ఒక శాస్త్ర గ్రంథమున వివరించబడిన అనేక నిబంధనలు మరియు వాటి నిర్దిష్టత, లేక "అట్టి దానిని అనుసరించు జనుల పరిమాణల సంఖ్య ఒక సత్యమునకు ప్రమాణ సూచికలుగా నిలువ జాలవు."
"శాస్త్ర గంధముల యందు తెలుపబడిన ఆదేశముల దివ్యత్వ ప్రామాణ్యమును పరీక్షించు ఒక విశ్వసనీయమైన విధానము ఎట్టిదనగా" :-
అటువంటి ఆదేశములు మానవుడు అనుభవ పూర్వకముగా గ్రహింప గలిగినదై ఉండవలెను. ఉదాహరణకు ఆత్మసాక్షాత్కారము అనుభవపూర్వకముగా తెలుసుకోవడం.
24 శ్లోకాల 16 అధ్యాయము, దైవాసుర సంపద్విభాగ యోగం సంపూర్ణం