17:1to6 ఒక విభాగము
భగవద్ ఆరాధన మూడు విధముల భగవత్ ఆరాధన:-
మూడు విధమైన విశ్వాస మార్గ యోగములు.
17:1 అర్థము:-
ఓ కృష్ణ ముల యందు తెలుపబడిన నిబంధన లను పాటింపక భక్తితో యజ్ఞ యాగాదులను చేయువారి స్థితి ఎట్టిది? వారి గుణము సాత్వికమా, రాజసికమా లేక తామసికమా ?
17:1 వ్యాఖ్యానము:-
మానవుని అత్యున్నతమైన అనుభవసారము మరియు ఆత్మ జ్ఞాన అనుభవము భద్రపరచబడినవి శాస్త్ర గ్రంథముల యందు భద్రపరచబడినవి. అందువలన శాస్త్ర గ్రంథములు ఆధ్యాత్మిక సాధకునికి సహాయపడునటు వంటి లేని ఉపకరణములు. సాధకుడు గొప్ప నమ్మకముతో శాస్త్ర గ్రంథము లపై గొప్ప నమ్మకంతో వాటిని గౌరవించును. కానీ అతను వాటిని సరి అయిన విధానమున అర్థము చేసుకొనలేక వాటిని తన జీవితము నందు అన్వయించు కొనలేక పోవచ్చును. పవిత్ర గ్రంథముల యందు తెలుపబడిన విషయముల అర్థములతో గొప్ప పండితుల సైతము కొన్ని సమయముల యందు ఏకీభవింపరు. అనేక మంది శాస్త్రముల యందలి ఉపదేశములను, నిషేధములను, ఆచార పద్ధతులను ఎరుగకపోయిననూ, శ్రద్ధ భక్తులను వారు గొప్ప శ్రద్ధ భక్తులను, విశ్వాసమును కలిగి ఉందురు. వారి హృదయములు సహజమైన రీతిన ధర్మ మార్గమును అనుసరించును. ఆ విధముగా వారు జీవితమును గొప్ప భక్తితో కూడిన జీవితమును గడిపెదరు.
క్రిందటి అధ్యాయము నందలి చివరి రెండు శ్లోకముల యందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రమాణముగా గ్రహించి శాస్త్ర గ్రంథములను ప్రమాణముగా గ్రహించి వాటిని అనుసరించమని ఉపదేశించెను. ఇట్టి ఉపదేశము అన్ని రకములైన శాస్త్రా నిబంధనలకు, యజ్ఞ విధులకు మరియు ఆచార వ్యవహారములకు వర్తించునా అని, మరియు దాని వలన ఆధ్యాత్మిక అనుభవము కలుగునా అని భక్తుడు ప్రశ్నించుచున్నాడు. ఆచార సంబంధమైన పూజా క్రమమున నియమబద్ధమైన శాస్త్ర విధులు అన్నింటిని అనుసరించక పోయిన యెడల అది ధర్మమేనా లేక ఆధర్మమా అను విషయమును సాధకుడు తెలుసుకొన కోరుతూన్నాడు. మరియు భక్తుడు తన ధ్యేయమైన భగవంతునితో అనుసంధానము పొందుటకు భక్తి చే మనసును కేంద్రీకరించుట ఉత్తమమా అనునది అతను తెలుసుకొన కోరుచున్నాడు.
అర్జునుడు ఎంతో అభివృద్ధి సాధించిన యోగి వంటి వాడు. అతను అనేక విధములైన అంతరంగా అనుభవములను పొంది ఉన్నవాడు. (అది పూర్వమే తెలుపబడి ఉన్నది.) అతను ఇప్పుడు బాహ్యమైన ఆధ్యాత్మిక విధుల నిర్వహణ అనుభవము నిర్వహణ అనుభవము గురించి మరింత జ్ఞానమును పొందగోరుచున్నాడు. బాహ్యమైన పూజ యజ్ఞ క్రతువులు చేయు విధానమును శాస్త్రంలో యందు వివరించబడి ఉన్నవి. అర్జునుడు ఇప్పుడు అటువంటి పూజ యజ్ఞ క్రతువుల ఫలితములను వాటి విలువలను తెలుసుకొన కోరుతున్నాడు. ఆధ్యాత్మిక కార్యక్రమములను నిర్వర్తించునప్పుడు శాస్త్రముల యందు నిర్దేశింపబడిన శాస్త్రముల యందు నిర్దేశింపబడిన పూజా విధి సూత్రములను తప్పక పాటించి వాటి ఫలితములను పొందవలెనా? ఒక వ్యక్తి సాకార యజ్ఞ పూజవిధి కార్యక్రమములను
శాస్త్రముల యందు నిర్దేశించబడిన ఆదేశంలన్నింటినీ విధిగా నిర్వర్తింపక పోయినను అతను శ్రద్ధ భక్తులతో తన మనసును భగవంతునిపై నిలిపి తగు మాత్రము పూజ చేసిన యెడల, అట్టి విధానము సాత్విక మా, రాజసికమా లేక తామసికమా ?
అర్జునుడిని ప్రశ్న మరియు శ్రీకృష్ణుని సమాధానము శ్రద్ధ,భక్తి, విశ్వాసము ప్రాథమిక మూలమునకు చెందినవి. శ్రద్ధ అనునది ప్రతి వ్యక్తి యందు గల సహజమైన, భగవంతుని వైపు నకు ఆకర్షించు ఒక అభిలాష.
ప్రతి మానవుని యందు సహజముగా జన్మతః సంప్రాప్తమగు ఇట్టి ఆకర్షణ శక్తి తామసిక గుణములు గల జడ త్వముతో కూడి నిస్తేజమై ఉండునని తర్వాతి శ్లోకం. రాజసిక గుణములు కల వ్యక్తి యందు ఇట్టి ఆకర్షణ శక్తి క్రియాశీలకమై స్వార్థముతో కూడి ఉందును. పట్టుదల కలిగిన యోగి యందు ఈ శక్తి ,భక్తి విశ్వాసము రూపమున వ్యక్తమగు చుండును. సంపూర్ణమైన శ్రద్ధ కలిగిన వ్యక్తి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన చేయుట యందు స్థిరముగా నిలకడకతో ఉండును. ఏల అనగా అతను తీవ్రమైన ఆధ్యాత్మిక అభిలాషచే ప్రేరేపితుడై ఉండును. భగవంతునిపై అతనికి గల అతీంద్రియమైన విశ్వాసము అట్టి ప్రేరణకు మూలము.
17:2 అర్థము:-
దివ్య పరమాత్మ ఈ విధంగా పలికెను. మానవుని యందు సహజమైన శ్రద్ధ విశ్వాసము మూడు విధములుగా ఉండును. సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ అనబడును. వాటిని గురించి వినుము.
17:3 అర్థము:-
ప్రతి మానవుని యందలి శ్రద్ధ అతనికి పుట్టుకతో సహజ స్వభావ గుణమును అనుసరించి ఉండును. అభిలాషను అనుసరించి అతని వ్యక్తిత్వము ఉండును. వ్యక్తి యొక్క శ్రద్ధ విశ్వాసము ఎటువంటిదో అతను అటువంటి వాడే అవును.(ఎ టువంటి శ్రద్ధతో ఉంటే అటువంటి స్వరూపుడై ఉండును) శ్రద్ధ యే సంస్కారము. సంస్కారమే అతని గుణము. గుణమును అనుసరించి మనిషి అతని సంస్కారమే అతని స్వరూపము. అతని గుణమే అతని స్వరూపం. పూర్వ జన్మ సంస్కారము ను అనుసరించి అంతఃకరణము అంతఃకరణమును అనుసరించి అతని శ్రద్ధ విశ్వాసము ఉండును.
17: 2,3 వ్యాఖ్యానము:-
ఒక వ్యక్తి ధర్మసూత్రములను అనుసరించి జీవించుట లేక జీవించలేకపోవుట అతని యందలి సహజమైన స్వభావమును అనుసరించి ఉండును. సహజ స్వభావమే అతని అంతరంగ వ్యక్తిత్వము.
అది పూర్వజన్మల కర్మల ఫలితముగా ఏర్పడునది.
17:4
సత్వ గుణము కలవారు దేవతలను ఆరాదించెదరు. రాజసిక గుణము కలవారు యక్షులు రాక్షసులను ఆరాధించెదరు. తామసిక గుణము కలవారు ప్రేతములను భూతములను ఆరాధించెదరు. సత్వగుణము కలవారు అనగా సజ్జనులు దైవ గుణములకు రూపమైన దేవతలను ఆరాధించెదరు.
రాజసిక గుణము కలవారు అనగా ప్రాపంచిక ఆవేశపూరితమైన వ్యక్తులు యక్షులు మరియు రాక్షసులను ఆరాధింతురు. యక్షులు సంపదలకు రక్షకులైన ప్రేతముల వంటి వారు. రాక్షసులు సూక్ష్మ లోకములకు చెందిన. మరియు గొప్ప శక్తితో దాడి చేయగల దానవులు తామసిక గుణమునకు చెందిన మందబుద్ధి కల అజ్ఞానులు ప్రేతములను భూతములను ఆరాధించెదరు.(ప్రేతములు మరణించిన వ్యక్తుల ఆత్మలు భూతములు దయ్యములు క్షుద్రమైన శక్తులు) తాను జీవన విధానమును అనుసరించి తప్పనిసరైన విధముగా తన యందలి గుణమును వ్యక్తపరచును.తనకు తెలిసి బుద్ధిపూర్వకముగా లేక తనకు తెలియకనే తాను ఆకర్షించును అను దానిని వ్యక్తపరచును.
ఒక వ్యక్తి అనుసరించు ధర్మమును అతను నిర్వహించు పూజా విధానములు కాక అతని గుణమును వ్యక్తపరచును. మనుషుల యందు అనేకులు స్వచ్ఛమైన మనసుతో ఉండరు. కానీ వారు జీవిత సమయమున వారు సత్వ రాజశసిక తామసిక గుణములను ప్రదర్శింతురు. కానీ వారి జీవిత సమయమున జీవిత సంగ్రహమును పరీక్షించిన ఏదేని ఒక గుణము వారి జీవితమున ప్రధానంగా వ్యక్తపరచబడి ఉండును. అట్టి గుణము వారి ఆధ్యాత్మిక పరిణితిని తెలియజేయును, కావున శ్రీకృష్ణుడు ఈ విధముగా తెలిపెను.. ప్రతి మనిషి యొక్క శ్రద్ధ విశ్వాసమే అతని వ్యక్తిత్వము. ప్రతి వ్యక్తి అతని గుణమునసరించి అతను జీవించును. ఆ విధముగా వ్యక్తి పైన తెలిపిన మూడు విధములలో ఏదైనా ఒక్క మార్గమునకు చెందిన వాడగును. జ్ఞానవంతుడైన సాత్వికుడు తన జీవితమును దైవ మార్గమును అనుసరించి జీవించును. భౌతిక ప్రపంచమునకు చెందిన ఉన్నతమైన కార్యక్రమముల యందు భగవంతుని ఆదేశానుసారము పర్యవేక్షించు దేవతల నుండి సాత్వికులైన సత్పురుషులు తమకు తెలిసి అయినను తెలియకైనను దైవసహాయమును పొందుతారు.
రాజసిక గుణములు కలిగిన ప్రాపంచికమైన ఆవేశపూరిత వ్యక్తులు సంపదలను పదవులను ఆశించి తమకు తెలిసి లేక తెలియక అత్యాశ క్రూరమైన శక్తికి అహంపూరిత వాంఛలకు రూపమైన సూక్ష్మలోకపు యక్షులను రాక్షసులను ఆరాధించెదరు. తామస గుణము కలిగిన అజ్ఞానులు తమకు తెలిసి గాని తెలియక గాని ప్రేతములను భూతశక్తులను ఆరాధించెదరు.
అట్టివారు మూర్ఖత్వం చేత సోమరితనం చేత ఇంద్రియలోలత్వము చేత కష్టించి పనిచేయుటను తప్పించుకొనుటకై బాహ్య శక్తులపై గుడ్డి నమ్మకముతో ఆధారపడి ఒక సాధారణ మానవుని వలె సంపూర్ణ జీవితమును గడప లేరు ఆ విధముగా తమ అవగాహన శక్తికి మించిన తమ అదుపు తప్పిన విచ్ఛిన్నకర శక్తులకు బానిసలు అవుతురు.
అథమమైన మార్గము అనగా ప్రేతములను ఆరాధించుట అని ఈ శ్లోకము తెలుపుతున్నది. ఈ శ్లోకము నందులి పదములు నిరర్థకమైన తామస గుణమును వివరించుచున్నవి. అట్టి గుణము వలన మనిషి మరణ సమానమైన జీవితమును గడుపును. తుచమైన అలవాట్లను కలిగి ఉన్నవారు మందబుద్ధి నిరాశ కలవారు ఆత్మ యొక్క అంతులేని శక్తిని విస్మరించిన వారు అంధకారమునకు చెందిన ప్రేతాత్మలను ఆరాధించుదురు .
భగవద్గీత యందలి ఈ శ్లోకము ప్రత్యేకించి వివిధ రకములైన అతీంద్ర శక్తుల ప్రదర్శన మరియు ఇతర ఉపాసన వ్యవహారములను గురించి తెలుపుచున్నది. ఇటువంటి ప్రక్రియల ముఖ్య ఉద్దేశము ఏమనగా కొన్ని శక్తివంతమైన దుష్టశక్తులను లేక మరణించిన వారి ప్రేతాత్మలను ఆవాహన చేయుటయే. అటువంటి విధానములు గొప్ప అపాయముతో కూడినది మరియు అశుభకరమైనవి. ఈ అధ్యాయము 13వ శ్లోకమున ఉపాసన గురించి ఇచ్చట కొంత వ్యాఖ్యానము అవసరం ఉన్నది.
"ప్రేతాత్మలు మరియు సూక్ష్మలో ఒక జీవులు నమ్మదగిన మార్గదర్శకులు కారు"- తమ మరణము తర్వాత సూక్ష్మ లోకములకేగిన మానవులు గొప్ప గురువులను చేరి ఉందురని లేక అటువంటివారు మరణము పిదప గొప్ప జ్ఞానంతో కూడి ఉందురని అనేకమంది ఒక పొరపాటైన అభిప్రాయమును కలిగి ఉందురు. వాస్తవం ఏమనగా అటువంటి అనేక సూక్ష్మలోక జీవులు నమ్మదగిన దూతలు కారు వారు వారి అంత ర దృష్టి యందు పరమాత్మను తెలిసి ఉండరు.
ఆత్మ దైవికమైనది కానీ మనిషి తాను జీవించి ఉన్నప్పుడు ఆత్మసాక్షాత్కారము పొంది ఉండనిచో మరణము పిదప అట్టి ఆత్మ ఏ విధమైన దివ్యత్వ మును పొందజాలదు. అట్టి వ్యక్తి జీవించి ఉన్నప్పటికీ స్థితిని ఆత్మ కొనసాగించును వ్యక్తులు శరీరంతో జీవించి ఉన్నప్పుడు ఆత్మసాక్షాత్కారం పొంది ఉండిన యెడల వారు వారి మరణము పిదప భగవంతునిలో ఐక్యమై ఇతరులకు జ్ఞానమును బోధింపగలరు. భగవద్గీత తెలుపునది ఏమనగా ప్రేతాత్మల సంప్రదించుట మీద నమ్మకం కలవారు అజ్ఞానులు.
అటువంటి వ్యక్తులు దివ్య పరమాత్మను సకలజీవులకు సఖుడైన భగవంతుని కోరుకొనక సూక్ష్మలోక జీవుల మార్గదర్శకత్వంపై ఆధారపడె దరు. భగవంతుని సహాయము లభించునప్పుడు సూక్ష్మలో క జీవుల సహాయముతో పని ఏమున్నది.
ముక్తి ని పొందిన ఆత్మలు సాధారణంగా సూక్ష్మ లోకముల యందు శాశ్వతముగా నివసింపవు. సూక్ష్మ లోకములు భూమిని వదిలి అప్పుడే చేరిన ఆత్మల కొరకై నిర్దేశింపబడినవి. అచ్చట అవి నేర్చుకొనవలసిన పాఠములు ఎన్నియో ఉన్నవి.గొప్ప సద్గురువులు తమ స్వస్థానమైన సర్వవ్యాపక పరమాత్మ యందు యదేక్షగా ఉందురు. వారి నుండి కొందరు సూక్ష్మ కారణ లోకముల యందు ముక్తిని ప్రసాదించు దైవదూతలుగా వ్యవహరింతురు.
సంపూర్ణ విముక్తిని పొందిన వారియందు గొప్ప సద్గురువులు లేక ఆధ్యాత్మిక ఉపదేశికులు ఉందురు. భగవంతుడు అటువంటి వారిని ఒక నిశ్శబ్దమైన మౌనరీతిన మరియు రహస్య విధానమున మానవునికి సహాయము మొనరించుటకై వినియోగించును.అటువంటి సద్గురువులు భగవంతుని పొందగోరు సాధకులకు మరియు సహాయము అవసరమై దానిని అర్థించువారిని చేరుటకు మరి ఏ విధమైన మధ్యవర్తుల అవసరము లేక సాధకులకు స్వయంగా తామే సహాయమును అందించెదరు.
సాధకుడు అటువంటి సహాయము గుర్తించెనా లేదా అనునది సద్గురువు గమనింపడు. సద్గురువు ను సాధకుడు దైవసహాయమును పొందగోరు విధమును గుర్తించి దానికనుగుణముగా తానే బాహ్యముగాను అంతర్గతముగాను మార్పులు చెందును. సాధారణ సూక్ష్మలో ఒక జీవి తాను ఒక పారవద్య మార్గము (మీడియేటర్) ద్వారా పనిచేయుచు మానవజాతికి తాను ఒక గొప్ప ప్రవక్తను అని చెప్పుకొనుచు చక్కని వాగ్దాటితో గొప్ప పదము లను ఉపయోగించి పలక వచ్చును. అటువంటి సూక్ష్మలో ఒక జీవులు మానవుని ఆధ్యాత్మిక జీవనమునందు మార్పులు కల్పింపలేరు.సాధారణ వృత్తిపరమైన నిపుణులు (ఉపవాస కార్యక్రమము వృత్తిగా చేసేవారు) లేక సమర్థుడు కాని ఒక మధ్యవర్తి, దైవసాక్షాత్కారమును పొంది ఉండక సాధారణ సూక్ష్మలోకములను మించి ఉన్నతమైన లోకములతో సంబంధం కలిగి ఉండలేరు. అటువంటివారు దైవమునె రిగిన సత్పురుషుల సాన్నిద్యమును పొందలేరు. మరియు తమ ప్రశ్నలకు సమాధానములను వారి నుండి పొందలేరు.
భగవంతునితో ఐక్యత నొందిన దివ్య పురుషులను భూమి పైనున్న ఒక సాధారణ మధ్యవర్తి వ్యక్తి తన ద్వారా ప్రతివారము (ప్రతిసారి ) అటు దివ్య పురుషులను ఒక ఉపన్యాసమును ఇచ్చుట కొరకై వారిని ఆహ్వానించి ఆజ్ఞాపింపలేరు. మనిషి యొక్క విముక్తి కొరకు భగవంతుని విధానములపై అజ్ఞానంతో కూడిన మానవుల మనసు యందు అనేక విధములైన అసహ్యకరములైన తప్పుతో కూడిన అభిప్రాయములు ఉన్నవని భగవద్గీత సూచించుచున్నది.
ఒక సద్గురువు భూమిపై నిర్వర్తించు కార్యక్రమముల కన్నా సూక్ష్మ కారణ లోకములు యందు అతని కార్యక్రమములు విభిన్నముగా ఉండును. మానవుడు విముక్తిని పొందుటకు కేవలం భౌతిక ప్రపంచ కార్యకలాపములు మరియు వాటి ప్రభావములు మాత్రమే అవసరమైనచో భగవంతుడు మూడు విధములైన లోకములను సృష్టించి ఉండడు. నిజమైన సద్గురువు సాధు సత్పురుషుడు మధ్యవర్తుల ద్వారా సంభాషింపడు.
సద్గురువు శరీరంతో ఉన్నప్పుడు తన వద్దనున్న కొద్ది మంది సులభముగా గ్రహించి అర్థము చేసుకొనుటకై తన స్థూలమైన అవయవముల ద్వారా అతను వ్యక్తపరచును. (అతను ప్రపంచమునకు చేసు సేవ మనకు కనపడదు తెలియదు) కానీ ప్రపంచము కొరకు వ్యక్తిగత సాధకుల కొరకు ఉద్దేశించిన ఉన్నత స్థితికి చెందిన అతని ఆధ్యాత్మిక సేవలు సాధారణంగా అదృశ్య రూపమున ఉండి దానిని గ్రహింపగలుగు శక్తి ఉన్న వారికే అవి లభ్యమగును. అవి సద్గురువు యొక్క అసలైన దీవెనలు.మరియు అతని మార్గ నిర్దేశక సత్యము. అటువంటి దీవెనలు మరియు మార్గ నిర్దేశము సాధకుని సూక్ష్మ కారణ శరీరముల యందు ఆధ్యాత్మికమైన మార్పులను కల్పించి ఆపై ఆ వ్యక్తి భౌతిక స్థితి యందు ప్రభావమును చూపును.
సద్గురువు సశరీరుడై ఉండనప్పుడు ప్రభావశీలమైన అతని సహాయము మునుపటి వలనే కొనసాగును. అంతేకానీ అతను ఒక మధ్యవర్తి ద్వారా వ్యక్తపరిచి తనను తన ఆధ్యాత్మిక ప్రభావమును కించపరచుకొనడు. అతను స శరీరుడై భూమి పై ఉన్నప్పుడు తన దివ్య సందేశములను మరియు దైవ ప్రకటనలను తానుగా వ్యక్తపరిచి ఆపై ఏ విధమైన పునర్ ఆలోచనలు లేక ఏ విధమైన ఆధ్యాత్మిక మధ్యవర్తుల ఆధ్యాత్మిక పరమైన సందేశముల అవసరము లేకుండును.
ఒక సాధకుడు ధ్యానమునందు తన స్వయం కృషిచే తన చైతన్యమును ఉన్నత స్థితికి చేర్చి సత్పురుషుల దేవతల శుద్ధమైన పరిధిని చేరినప్పుడు అతను తన దివ్యదృష్టి చే లేక అతీంద్రియ జ్ఞానము చే సద్గురువుల మార్గ నిర్దేశమును వారి సాన్నిద్యమును గ్రహింపగలుగును. అటువంటి సద్గురువు సాధకుని ఆధ్యాత్మిక శ్రేయోభిలాషులై ఉండి ప్రేమమయమైన భగవంతుని అనుజ్ఞ చే భగవంతుని కృపను సాధకుని పై కురిపించును.
"సంచార ఆత్మలచే ఆవహింపబడుటయందలి ప్రమాదములు"
ఉన్నతమైన తరంగ శక్తితో కూడిన సూక్ష్మ లోకములు మరియు తక్కువ స్థితికి చెందిన తరంగ శక్తితో కూడిన సూక్ష్మ లోకములు కలవు.వీటి యందు అనేకమైన మంచి జీవులు సాధారణ జీవులు మరియు అనేకమైన చెడు జీవులు నివసించుచుండును. భూమిపై మంచితనమునకు చెడుకు చెందిన వివిధ స్థాయిల మనుషులు జీవించు నట్లు సూక్ష్మ లోకముల యందు కూడా వివిధ స్థాయిలకు చెందిన మంచి చెడు జీవులు ఉందురు. ప్రేతముల ద్వారా సందేశములను విచక్షణారహితంగా అందుకొనుటకు తన మనస్సును మెదడును ఉపయోగించు వ్యక్తి తాను ఎటువంటి సూక్ష్మలోక శక్తితో సంభాషించుచున్నాడో తెలియని స్థితియందు ఉండును.అన్ని విధములైన సూక్ష్మలోక తరంగములను అందుకొను వ్యక్తి చెడు శక్తులతో సంప్రదించు ప్రమాదము కూడా కలదు. అతను అధమ స్థాయికి చెందిన సూక్ష్మలోక దృశ్యములలో మునిగి ఏ విధమైన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేకపోవచ్చును. మరియు అంతరంగ జ్ఞాన సమపార్జన ద్వారా ముక్తిని పొందు లక్ష్యమును అతను సాధింపలేడు.
ఒక వ్యక్తి తనకు చెందిన వాహనమును తాను ఉపయోగించక దానికి తాళం వేయక వాహనమును నడుపుకొనుటకు అవసరమగు తాళమును అచటనే ఉంచిన ఎవరైనా ఆ వాహనం నడిపించుకుని దాని నాశనము గావింతురు. అదేవిధంగా మనసును మెదడును శూన్యస్థితి యందు ఉంచిన యెడల సంచారాత్మలు ఆ మనసును మెదడును ఆక్రమించి నిస్సహాయుడైన ఆ వ్యక్తిని ఆవహింప గలవు. అనేక లక్షల సంచారాత్మలు శూన్యమునందు విహరించుచుఉండును.అట్టి ఆత్మలు పునర్జన్మను కోరుచుoడును . కానీ వాటి చెడు కర్మల ఫలితముగా అవి ఆశించిన వెంటనే ఆ జన్మలు పొంద జాలవు. అందుచే అవి నిరంతరము తెలివి తక్కువ తనంతో నిస్తేజముగా ఉంచిన మనసు మెదడు కొరకు వెతుకుచూ అట్టిది లభించగానే అవి మానవుని మనసును మెదడును శరీరమును ఉపయోగించుకొని తాను శరీరమును పొందవలెను కోరికను తీర్చుకొనును. శూన్య స్థితి అందున్న మనస్సు మెదడును అవి అత్యంత వేగంతో ఆక్రమింపగలవు. ఒక వ్యక్తి మానసికంగా బలహీనుడై లేక ప్రతికూల స్వభావం ఉన్న కలిగి ఉండిన యెడల అట్టి వ్యక్తి ఆత్మలతో సంభాషించుటకు ప్రయత్నించిన యెడల ప్రత్యేకించి ఆత్మలతో సంభాషించు వర్గమునందుండిన అతనిని సంచార ఆత్మ సులభముగా వశపరచుకొనును. ఆ విధముగా ఆత్మ ఆవహించుటవలన అతని అవచేతన మనసు లయము తప్పవచ్చును.ఆ విధముగా కాక భగవంతునితో అనుసంధానము అవుటకు భారతదేశము నందు అభివృద్ధి చేయబడిన శాస్త్రీయ విధానమును ధ్యానమును క్రియా యోగము వంటివి అవలంబించిన యడల వ్యక్తి మనసు మెదడు శూన్యస్థితికి చేరదు.కావున ఏ విధమైన సంచార ఆత్మ అతనిని ఆవహింపజాలదు. ఈ సాధన యందు సూక్ష్మస్థితికి చెందిన అవచేతనా మనస్థితిని అధిగమించి మనిషి అధి చేతనా స్థితిని అభివృద్ధి పరచి మనసును నుదుటి భాగమునందున్న క్రీస్తు చైతన్యమును చేర్చును. సంచార ఆత్మలు అచటికి ప్రవేశింపలేవు. అధిచేతనాస్థితి యందు మాత్రమే సాధకుడు నిజమైన సాధు సత్పురుషులను సద్గురువు లను సంప్రదించగలడు. అటువంటి సత్పురుషులను దివ్య కాంతి వారి చుట్టూ ఆవహించి ఉండును. సాధకుడు వారిని చూచినంతనే తన అతీంద్రియ అవగాహన ద్వారా వారు ఉన్నత స్వరూపులని గ్రహించును.
ఎట్టి సాధకుడైనను భౌతిక శరీరము లేని ప్రేతాత్మ లోకములను దర్శించుటకు ప్రయత్నించరాదు. సాధకుడు మొదట ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చుకొని అట్టి లోకములపై అదుపును పొందవలెను.
భగవంతునితో అనుసంధానమైనప్పుడు సాధకునికి అటువంటి శక్తులు సమకూరును.భగవంతుడే అన్ని ఆత్మలను నిర్మించు వాడు.సాధకుడు భగవంతునితో అనుసంధానమైన పిదప అతను గతించిన వ్యక్తిని చూడవలెనని అభిలషించిన యెడల లేక వారితో మాట్లాడవలెనని కాంక్షించిన యెడల భగవంతుడే ఆ వ్యక్తిని సాధకుని వద్దకు పంపగలడు. యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను.నీవు మొదట భగవంతుని సామ్రాజ్యమును అతని దర్శనమును కోరుకొనుము.
ధ్యాన సమయమున మనసు నందు ఇతర ఆలోచనలు రానివ్వక భగవంతునికి చెందిన ఒక స్పష్టమైన ఆలోచనపై మనసును కేంద్రీకరించు విధము యొక్క ప్రాముఖ్యతను యోగులు నొక్కి చెప్పెదరు. ఆ విధముగా ప్రయత్నించిన యెడల సాధకుడు భగవంతుని అత్యంత ఉన్నతమైన తరంగమునకు చేరుకొని అధమ స్థాయికి చెందిన సూక్ష్మ లోకములను విసర్జించును. ఉన్నతస్థాయికి చెందిన తరంగముల ద్వారా సాధకుడు భగవంతుని అంశములను అనగా అతని ప్రశాంతత లేక విశ్వఓoనాదము లేక దివ్యకాంతిని దర్శింపగలుగును. గొప్ప పురోగతిని సాధించిన సాధకుడు భగవంతుడిని గొప్ప సాధు సత్పురుషుల రూపమున దర్శింపగలుగును . బాగుగా లోతైన గాడమైన ధ్యానము చేయు సాధకుడు దివ్యపురుషులు నివసించు లోకములను దర్శింపగలుగును. భారతదేశము నందు పురాతన కాలము నుండి శాస్త్రీయమైన పద్ధతిన ఆత్మ సాక్షాత్కార విద్యను నేర్పించుట యందలి ముఖ్య ఉద్దేశము ఇదియే.ఈ యోగ సాధనలో యోగి చైతన్యమును ఉన్నత స్థాయికి చేర్చి అచట అతను జాగరుక స్థితిలో భగవంతుని ముక్తి సాధించిన గొప్ప సద్గురువుల సహాయమును సూక్ష్మమైన తరంగముల రూపమున పొందుటకు సహాయపడును. యోగ సాధనములలో సాధకుడిని ఒక సురక్షితమైన మార్గము న భగవంతుని ఉనికిని సృష్టియoదు అంతటా దర్శింప జేయగలుగును.
క్రియాయోగము సురక్షిత మార్గము. సాధకులను ఉన్నత స్థితికి చేర్చును. శ్రీ లాహిరి మహాశయులు
శ్రీ యుక్తేశ్వరులు మరియు అటువంటి అనేకమంది పరిణితి చెందిన యోగ సాధకుల జీవితములు దీనిని విస్తృత రీతి న రుజువు పరుచుచున్నది. క్రియాయోగ సాధన యందు పరిణితి చెందిన సాధకుడు తన చైతన్యమును సంకల్పశక్తిని తన అదుపు నందు ఉంచుకొనును. సూక్ష్మలోక జీవులను ఆహ్వానించువారు అదేవిధంగా తమ మనసును ఇతరులు అదుపు చేయు విధముగా సమ్మోహనమును అనుమతించుచు వారు భగవంతుడు తమకు ముక్తిని సంపాదించుటకై ప్రసాదించిన మహా చైతన్యమును సంకల్ప శక్తి ని బానిసత్వమునకు గురి చేయు ప్రమాదమును తమ అజాగ్రత్తతో కల్పించుకొందురు.
కొన్ని సమయముల యందు ఉపకార గుణము కలిగిన సూక్ష్మలోక జీవులు కొందరికి తారసపడవచ్చును. సమ్మోహన పరచు వ్యక్తులు సదుద్దేశం చేతనే ఆ విధముగా చేయవచ్చును. అయినను వాస్తవం ఏమనగా భూమిపైనున్న అటువంటి ఇతర వ్యక్తి లేక సూక్ష్మలోక జీవులు తమయందు ప్రవేశించి తాత్కాలికంగా తమ మనసును అదుపు చేయు అవకాశం వారికి కల్పించినదగును. ఇది ప్రమాదంతో కూడిన పద్ధతి. ఆధ్యాత్మిక సాధన పురోగతిని ఇది త్వరితపరచదు మరియు భగవంతుని నిజమైన అనుభవములను ఇది కల్పింపదు.మనిషి యొక్క ధ్యేయము ఆధ్యాత్మిక సాధన యందు త్వరితమైన పురోగతిని సాధించి భగవంతుని అనుభవ పూర్వకముగా గ్రహించుటయే.
17: 5,6శ్లోకాల అర్థము:-
శాస్త్ర గ్రంథములు సమ్మతించని తీవ్రమైన జపతపములు చేయువారు అసుర గుణములు కలవారని తెలుసుకొనుము. వంచకులు అహంకారంతో కూడిన వారు కామము మమకారము బలముతో కూడిన ఉన్మాదముచే ప్రేరేపితులైన వారు బుద్ధిహీనులై ఉన్మతులై తమ శరీర అవయవనములను తీవ్రమైన వేదనకు గురి చేయుదురు.ఆ విధంగా వారు శరీరం లయందు అంతర్భాగమై ఉన్న నన్ను సైతము హింసకు గురిచేయుదురు.
17: 5,6 వ్యాఖ్యానము:-
అంగవిచ్ఛేదము లేక శరీర అవయవములను తీవ్రమైన బాధలకు దండనకు గురిచేయుటను భగవద్గీత ఖండించుచున్నది.మనిషి యొక్క నిజమైన శత్రువు అతని శరీరము కాదు అతని మనసే.అతని నిజమైన శత్రువు క్రోధము దురాశ కామము అను అంధకారంతో కూడిన మానసిక శక్తులు మానవుని యందు శారీరకపరమైన కోరికలను కల్పించును.ఆధ్యాత్మిక మార్గమున ప్రయాణించు సాధకులు ఇటువంటి దుష్ట మానసిక శక్తులను అణగ దొక్కి వాటిని జయింపవలెను.
పరమాత్మ యే వ్యక్తిగత ఆత్మ రూపమున ప్రాణశక్తి చైతన్యముతో కూడిన శరీరమును రూపొందించెను. పరమాత్మ యొక్క గుణములు స్వచ్ఛత మరియు సామరస్యత సౌందర్యముతో కూడిన చక్కదనము జీవశక్తి మరియు తేజస్సు. శరీరం యొక్క ఇట్టి గుణములను వికృత పరిచి శరీరమును దుర్వినియోగ పరచిన యెడల అది సృష్టి కర్త నిర్మించిన ఒక కళాకృతిని విహీనపరచి సృష్టికర్త అయిన పరమాత్మకు అపరాధము
కల్పి0చినదగును.
17:7 అర్థము:-
మానవుల స్వీకరించు మూడు విధములైన ఆహారముల నుండి వారిని మూడు విధములుగా విభజించవచ్చును. అదే విధముగా వారు చేయు యజ్ఞములను తపస్సులను మరియు దానములను కలిపి వారి మూడు విధములుగా వర్గీకరింపవచ్చును. ఆ మూడు విధములగు విభజన ను ఇప్పుడు వినుము.
17:7 వ్యాఖ్యానము:-
మానవులు చేయు పనులు అతని ఆధ్యాత్మిక పరిణితిని తెలియజేయును.( స్పిరిచువల్ ఎవల్యూషన్) పరిణితి లేదా పరిణామము అతను సాధారణంగా ఇష్టపడు ఆహారము, జీవితమున అతని విధులను అతను నిర్వర్తించు నప్పుడు అతను సహజంగా ప్రవర్తించు అతని స్వభావము ఇవన్నీయు అతను ప్రధానంగా సాత్వికుడా లేక రాజసికుడా లేక తామసికుడా అనునది తెలుపును.
17:8,9,10 ఒక విభాగము
17:8 అర్థము:- ఆయుష్షును జీవశక్తిని సహన శక్తిని (అంటే రోగాలు రాకుండా కాపాడేది) ఆరోగ్యమును సంతృప్తిని కలిగించు ఆహార పదార్ధములు మరియు రుచికరమైనవి సాత్వికమైనవి, బలవర్ధకమైనవి, మానవ శరీరమునకు అనువైన ఆహార పదార్ధములు. పరిశుద్ధమైన మనసు కల సాత్వికులు ఇష్టపడెదరు.
17:9 అర్థము:- చేదు,పులుపు, ఉప్పు, అధికమైన కారము ఘాటైనవి కటువైనవి మరియు మంటను పుట్టించే ఆహార పదార్ధములను రాజసిక వ్యక్తులు కోరుకుందురు. ఆ విధమైన ఆహార పదార్ధములు బాధను దుఃఖములను కల్పించును.
17:10 అర్థము:-
పోషక విలువలు లేని నిరుపయోగమైన ఆహార పదార్ధములను రుచి లేని కుళ్ళిపోయిన పాసిపోయిన వ్యర్ధపదార్థములను మరియు అపరిశుభ్రమైన ఆహార పదార్ధములను తామసిక గుణము కల వ్యక్తులు ఆనందంతో స్వీకరింతురు.
17:8,9,10 వ్యాఖ్యానము:-
మనము భుజించు ఆహారము ముఖ్యమైనది. ఏల అనగా మనం భుజించు ఆహారము మన శరీరముపై మనసు పై దాని ప్రభావమును చూపును. శరీరము నందలి కణములు ఆహారం చే ఏర్పడును. ఆహార పదార్ధముల యందలి గుణము వలన మన మనస్సు కూడా ప్రభావమును చూపును. ఆహార పదార్ధముల భౌతిక గుణమును బట్టి అవి శరీరముపై చూపు ప్రభావమును అనుసరించి ఆధునిక శాస్త్రజ్ఞులు ఆహార పదార్ధముల విలువలను విశ్లేషింతురు. కానీ యోగులు ఆహార పదార్ధముల ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞతను పూర్వకాలమే పరిశోధించిరి. ఆహార పదార్థములను స్వీకరించినప్పుడు అది ప్రయోజనకరమైనదా లేక ఉత్తేజ కరమైనదా లేక హానికరమైనదా అను వర్గీకరణను దాని తరంగ గుణములను అనుసరించి
దాని తరంగ గుణములను అనుసరించి యోగులు నిర్ధారింతురు. (సాత్వికము, రాజసికము, తామసికము) యోగులు అటువంటి వర్గీకరణలు చేయుటకు ముందు భూమిపై ఉన్న సమస్తము భగవంతుని నుండి ఉత్పన్నమైనదేనని మరియు అతని ప్రజ్ఞతో కూడిన తరంగముల సృష్టికారక చైతన్యముచే రూపుదిద్దుకొనెనను వాస్తవము ను గుర్తెరిగి ఉందురు. భూమిపై సృష్టి విషయములు రూపుదిద్దుకొని అవి ప్రకృతి యందలి సత్వ రాజసిక,తామస గుణముల పరస్పర చర్య యొక్క ప్రభావం చే రూప పరివర్తన చెందును.పరిశుద్ధమైన విశ్వతరంగములు ఈ మూడు గుణములను వక్రీకరించి అనేక విధములైన వస్తు విషయములుగా మార్చి వాటిని వివిధ స్థాయిలకు చెందిన ఉన్నతమైన గుణముతోను క్రియాశీలక గుణముతోను నిరర్థక గుణములతోనూ చిత్రీకరించును.
తరంగములు ఒకదానితో మరి ఒకటి కలిసినప్పుడు అవి వాటి పునరావృత్తిన అనుసరించి (ఫ్రీక్వెన్సీ) ఒకదానిని మరొకటి మార్పు చేయును. యోగి యొక్క లక్షణము సత్వగుణము నుండి తన యందలి వ్యర్థములను శుభ్రపరచుకొనుటయే.దీని కొరకై అతను బాహ్యముగను అంతర్గతముగను పరిశుభ్రమైన ఆధ్యాత్మికము ఉన్నత స్థితికి చేర్చు విషయముల పరస్పర చర్యను ఆశ్రయించును. యోగితాను స్వీకరించు ఆహారము దానిని స్వీకరించి విధానము తన శరీరము పైనే కాక తన మనస్సుపై కూడా ఆహార పదార్ధముల తరంగ శ్రేష్టతను అనుసరించి (వైబ్రేటరీ క్వాలిటీ) అవి ఆరోగ్యకరమైన లేక హానియైన ప్రభావమును చూపునని గ్రహించియుండును.
సరియైన ఆహారము అను విషయము మిక్కిలి విస్తృతమైనది.ఆహార విషయములయందు ఆసక్తి కల వ్యక్తి దాని విషయమై మిక్కిలి ఆసక్తి కనపరిచి చివరకు అనారోగ్యమును కల్పించుకొనును. భగవద్గీత సరళమైన ఈ శ్లోకముల యందు ఆధ్యాత్మిక గుణములు కల ఆహారమును ఆధ్యాత్మిక గుణములు లేని ఆహారమును నిర్ణయించు విషయమై సంక్షిప్తమైన సులభమైన సూచనలను ఇచ్చుచున్నది. ఆహారము దాని తరంగస్థాయి యందు అది ప్రయోజన కారి లేక హానికరము అనునది వ్యక్తపరచును. అట్టి ఆహారము ఆరోగ్య విషయంలో అటువంటి పోషణ ప్రభావమునే చూపును.
ఆ విధమైన ఆహారమును దానిని స్వీకరించి విధానమును దాని స్వీకరించు వ్యక్తిని సర్వమును భగవంతుని స్వరూపముగా భావించి సాత్వికుడై న సాధకుడు తన భోజన సమయమును ఒక విధమైన యజ్ఞముగా భావించును. వీలైనచో అతను ఆహారమును మౌనంగా ఆలోచనను అంతర్గతము కావించి నిశ్శబ్దముగా ప్రశాంతమైన వాతావరణమున భుజించును.అతను భోజనము చేయుటకు ముందు క్రింద తెలిపిన విధమైన ప్రార్థనను చేయును.
"దివ్య లోకపు తండ్రి ఈ ఆహారమును స్వీకరింపుము. ఈ ఆహారమును పవిత్రపరచుము. దురాశకు చెందిన కల్మషము ఈ ఆహారమును అపవిత్రము చేయకుండుగాక.ఆహారము నీ నుండి యే వచ్చును అది నీ ఆలయము కొరకే.(ఈ ఆహారము ఈ శరీరం అనే నీ ఆలయము కొరకే) దీనిని పరిశుద్ధపరచుము. బ్రహ్మము బ్రహ్మమునందే కలియును. నీ దివ్య స్వరూపపు రేకులము మేము. నీవే పుష్పము. దాని జీవము. దాని సౌందర్యము. దాని లావణ్యము నీవే. నీ ప్రత్యక్ష ఉనికి సుగంధమును మా ఆత్మల యందు వ్యాపింప చేయము."
శరీరము నందలి ప్రాణశక్తులకు మనసునకు ఇంద్రియములకు అవసరమునకు మించిన ఉత్తేజమును కల్పించునది రాజసిక ఆహారము. శరీరమునకు ఉత్తేజము పూర్తిగా హానికరమైనది కాదు. అందువలన మూఢ ఆవేశముతో ఉత్తేజకరమైన ఆహారమును విసర్జింపన అవసరము లేదు. ఒక సాధారణమైన ప్రాపంచికంగా చురుకైన వ్యక్తి ఉత్తేజ కరమైన ఆహారమును మితముగా స్వీకరించుట నిర్దేశింప బడినది. రాజసిక ఆహారము నందలి అధిక భాగము రుచికి కారము మసాలా ఉప్పు ఇతర ఘాటైన వాసనలు కలిగి ఆ విధముగా అవి ఉత్తేజమును కలిగించు గుణమును కలిగి ఉన్నవని తెలుపును. గ్రుడ్లు రాజసిక ఆహారము. అదేవిధంగా మాంసాహార సంబంధమైన
చేపలు కోడి మేక కూడా రాజసిక ఆహారమే. ఇటువంటి మాంసాహారము శరీరమునకు తక్కువగా హానికరమైనవి. ఏదైనా ఒక ఆహారము లేక అధికముగా అట్టి ఆహారమును స్వీకరించుటవలన అది ప్రాణ శక్తిని అధికముగా ఉత్తేజపరిచిన ఎడల అట్టి ఉత్తేజము ఇంద్రియములకు నరముల వ్యవస్థకు కల్పింపబడును. అందుచే అటువంటి ఆహారమును త్యజింపవలెను .అటువంటి ఆహారము శరీరమునకు అసౌకర్యమును కల్పించి శరీరమును రోగగ్రస్తము చేయును. మరియు మానసికముగా అలజడిని బాధలకు కలిగించును.
తామసిక ఆహారమును భగవద్గీత స్పష్టముగా వివరించుచున్నది. సాత్విక ఆహారమును మరియు ఆరోగ్యకరమైన ఉత్తేజమును కల్పించు రాజసిక ఆహారమును సరియైన విధమున వండక వాటి సహజత్వమును పోగొట్టిన యెడల లేక అట్టి ఆహారమును ఎక్కువ కాలము భద్రపరిచిన యెడల అవి తామసిక ఆహారముగా మారిపోవును. పరిశుభ్రత సూత్రములను లక్షపెట్టని విధముగా ఉన్న ఆహార పదార్ధములు శరీరంపై దుష్ప్రభావమును చూపును. అటువంటిది తామసిక వర్గమునకు చెందినవి అవును. తామసిక ఆహారము శరీరముపై మనసుపై దుష్ప్రభావమును చూపును. మరియు అటువంటి ఆహారము ఆధ్యాత్మిక అభివృద్ధిని అభిలాషణను నిస్టేజపరచును.
ప్రస్తుత కాలమున సమాజము నందు సాధారణంగా జనులు పెద్ద జంతువుల మాంసమును అనగా ఎద్దు పంది వంటి జంతువుల మాంసమును వాటి నుండి తయారగు ఇతర పదార్థములను భుజించుచున్నారు. ఇది తామసిక ఆహారము. రసాయనకముగా తరంగముల ప్రకారము ఇటువంటి ఆహారము శరీరమునకు మానవుని ఆధ్యాత్మిక గుణమునకు మిక్కిలి హానికరము. శరీరమునకు హాని కల్పించు ఆహారము మనసుకు ఆధ్యాత్మిక ప్రగతికి కూడా హానికరము.దీనినే మరొక విధముగా చెప్పిన యెడల మానసికముగా ఆధ్యాత్మికముగా హాని కలిగించు ఆహారము శరీర తత్వమునకు కూడా హాని కలిగించును.
17:8,9,10 సమాప్తం.
17:11-19: మూడు దశల ఆధ్యాత్మిక విధానము
17:11,12,13శ్లోకాలు
17:11వ శ్లోకము
మానవులు ఫలాపేక్ష లేక చేసిన యజ్ఞము లేక
ఫలాపేక్ష లేక నిర్వర్తించిన ధర్మము మరియు ధర్మనిరతి కొరకు శాస్త్ర నియమానుసారము చేసిన కార్యక్రమము అది సాత్వికమైన కార్యక్రమము అనబడును.
17:12వ శ్లోకం : భరత వంశ శ్రేష్టుడా అర్జున! ప్రతిఫలమును ఆశించి ఆడంబరము కొరకు చేసిన యజ్ఞము రాజసిక గుణము కలది అని తెలుసుకొనుము.
17:13వ శ్లోకం
శాస్త్ర నిబంధనలను పాటించక ప్రసాద వితరణ చేయక దక్షిణా కానుకలను సమర్పింపక వేద మంత్రములను పఠింపక భగవంతునిపై భక్తి శ్రద్ధ లేక చేయుయజ్ఞము తామసిక యజ్ఞము అని తిరస్కరింపబడినది.
సాత్విక మనుష్యుల హృదయములు తమ లక్ష్యమైన భగవంతునిపైనే కేంద్రీకృతమై ఉండును.రాజసిక వ్యక్తులు భగవంతుని నుండి వరములను ఆశించి పదవులను భౌతికమైన అనుభవములను తమ అభిమానుల పొగడ్తలను ఆశించి భగవంతుని పూజింతురు. సాత్విక భక్తుడు ఆ విధమైన కోరికలను భగవంతుని నుండి కోరడు. అతని యందలి భగవంతుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండును మరియు అతనిని ప్రేమించుట యందలి పరిపూర్ణమైన ఆనందమును పొందు సహజమైన సద్గుణము అతని జీవితమున ఒక అసమానమైన ప్రేరణగా ఉండును.
రాజసిక భక్తులు వారు పూజించు విధానమును అనుసరించి వారు అశాశ్వతమైన ఫలితములనే పొందెదరు. సత్వగుణము కలవారు ఆనందంతో కూడిన సర్వమును సిద్ధింపజేయు భగవదైక్యత అను తన్మయత్వ స్థితిని పొందెదరు.
13వ శ్లోకము క్షుద్ర విద్యకు ఇంద్రజాల విద్యకు
ప్రేతో పాసనకు ఇతర చేతబడి విద్యలకు చెందినది.అటువంటి విద్యలు మనసును కలవరపరచి వ్యక్తిని దిగ్భ్రమకు గురిచేయును.వాటి వలన ఆధ్యాత్మికముగా ఏ విధములైన సత్ఫలితములు ఉండవు.అటువంటి పూజావిధులు మంచి తరంగములను సృష్టింపవు. మరియు ఇతరులకు మేలును చేయవు. వాటిని అజ్ఞానముతో కూడిన వ్యక్తులు తమ దుష్ట భావోద్వేగమును సంతృప్తి పరుచుకొనుటకై నిర్వర్తింతురు. దుష్టశక్తులను ప్రేరేపించి వాటిని ఉపయోగించు అపవిత్రమైన యజ్ఞ కర్మలను మరియు అటువంటి నమ్మకములను విజ్ఞులు తిరస్కరింతురు. మరియు పవిత్ర శాస్త్ర గ్రంథముల యందు వాటిని ఒక శాపముగాను క్షుద్ర మైనవి గాను మానవులను నాశనము కొని తెచ్చు దుశ్చర్యలు అని పేర్కొనిరి.
17:14-17
17 : 14 శ్లోకం
దేవతలను ద్విజులను గురువులను జ్ఞానులను ఆరాధించుట శుచి నిష్కపటము బ్రహ్మచర్యము మరియు అహింస వీటిని ఆచరించుట శారీరక తపస్సు అని చెప్పుదురు.
17: 15 శ్లోకము
తన ఆత్మతో ధ్యానం ద్వారా సంభాషించుట (ధ్యానంలో ఒక అవగాహన శక్తి మనకు లభిస్తుంది) ఉద్వేగమును కల్పింపని పలుకులను పలుకుట మరియు సత్యమును పలుకుట ఇంపుగా ప్రయోజనకర వాక్యములను పలుకుట అనునది వాక్ సంబంధ తపస్సు అని చెప్పబడును.
17: 16 శ్లోకము
ప్రశాంతత సంతృప్తి తో కూడిన మానసిక విస్పష్టము మృదు హృదయము మౌనము ఆత్మ నిగ్రహము సశ్చీలత అనునవి మానసిక తపస్సు అని చెప్పబడును.
17: 17వ శ్లోకము
పైన తెలుపబడిన మూడు విధములైన తపస్సులు సత్వగుణముతో కూడిన తపస్సులు. వీటిని ఫలాపేక్ష లేని సాధకులు భక్తి శ్రద్ధలతో ఆచరింతురు.
తపస్సు యొక్క మూలస్థానము: "ప్రవర్తించుట నేర్చుకొనుట" తన నిజ తత్వమైన ఆత్మతో తనకు సామరస్యమును కల్పించు సాధనను హృదయపూర్వకంగా ఆచరించు నియమ నిష్టలను తపస్సు అందురు. అటువంటి సాధన ఆధ్యాత్మిక మార్గములను అనుసరించు జీవిత విధానమునకు మూలమైనది. మా పూజ్య గురుదేవులు స్వామి
శ్రీయుక్తేశ్వర్ గారు తపస్సు అను దానిని సంక్షిప్తముగా "ప్రవర్తించుట నేర్చుకొనుట" అని చెప్పవచ్చునని తరచుగా చెప్పెడి వారు. శరీరమును కష్టమునకు గురి చేయుట తీవ్రమైన తపస్సు చేయుట అనునవి శరీరమును మనసును లొంగదీసుకొనుటకు కల్పింపబడిన తీవ్రమైన చర్యలు.యోగి బాహ్యమైన కర్మలను సక్రమముగా నెరవేర్చి ధ్యానము ద్వారా తన అంతరంగము నందు ప్రవర్తనకు చెందిన మూలమును చక్కదిద్దును.
ఆ విధముగా యోగి సహజముగా త్వరితముగా శరీరమునకు వాక్కునకు మనస్సునకు చెందిన సద్గుణములను అలవర్చుకొని సత్వగుణ సంపన్నునిగా తనను మార్పు చేసుకొనును.
సృష్టి యందు వివిధ రూపములుగా ఉన్న దైవమును అటువంటి సాత్విక యోగి మిక్కిలి పూజ్య నీయమైన భావంతో ఆరాధించును. అతను ధ్యానం ద్వారా పూజ ఆరాధన ద్వారా దివ్య పరమాత్మను మరియు అతని సృష్టి అంశములను సేవించును.అతను పరమాత్మ నెరిగిన ద్విజులను గురువులను జ్ఞానులను గొప్ప గౌరవభావంతో పూజించును. మరియు వారిని సేవించి తీవ్రమైన ప్రయత్నముల ద్వారా వారి జ్ఞాన బోధనలను గ్రహించి ఆ విధముగా తాను జీవించుటకు ప్రయత్నించును.
శారీరకమైన తపస్సు:
యోగి చర్యలు స్వచ్ఛతను ప్రతిబింబించును. అనగా శరీరము శరీరపు అలవాట్ల యందు శుభ్రత పరిసరముల పరిశుభ్రత ఇంద్రియములను ఉపయోగించునప్పుడు నీచత్వం లేకుండుట మరియు అతని చర్యలు నిజాయితీని చిత్తశుద్ధిని( అధ్యయనము) కోరికలకు ప్రలోభములకు లొంగని ఆత్మ నిగ్రహము (అనగా బ్రహ్మచర్యము) బుద్ధిపూర్వకముగా ఎవరికినీ హాని తలపకుండునట్లు జాగ్రత్త వహించుట, ( అనగా అహింస) ప్రతిబింబించును. ఇవన్నీ ఈ శరీరమునకు చెందిన తపస్సు.
వాక్ తపస్సు: మనిషి యొక్క వాక్ శక్తి మిక్కిలి శక్తివంతమైనది.వాక్కు మనిషి తెలుపదలచిన భావమును వ్యక్తపరచుటయే కాక అది ఓం తరంగపు క్రియాశీలక శక్తిని కలిగి ఉండును. సృష్టికి మూల కారణం ఓం.అదేవిధంగా ఓం సృష్టి యందలి ఇతర శబ్దములకు మానవుని కంఠ ధ్వనికి మూలము. మాట్లాడగలుగుట అనునది ఒక అసమానమైన శక్తి.అది మానవులకు భగవంతుడిచ్చిన దివ్యమైన వరం ధ్యానము ద్వారా ఆత్మను గ్రహించిన వ్యక్తి సత్యమును అవగాహన చేసుకును శక్తిని కలిగి ఉండును. మనకు కనపడు దృశ్యము వలనే కాక లోపల అంతర్గతముగా సత్యమేదో (అంటే భగవంతుని గురించి) తెలుస్తుంది. వాక్కును ఒక క్రమబద్ధమైన నిష్టతో ఉపయోగించుటకు సత్య అవగాహనా శక్తి తోడ్పడును. దీనినే స్వాధ్యాయ అభ్యాసము అందురు. ఈ సంస్కృత పదములకు అర్థము శాస్త్రములను తన యందు పునర్వచన (అపరమేషన్ lపురశ్చరణ ) గావించుట అని తెలుపుదురు. ఈ విధమైన పునశ్చరణ పునర్వచన సూత్రమును (అపర్మేషన్) ధ్యాన ప్రక్రియ యందు ఒక సత్య వాక్యమును ఉపయోగించి చెప్పుదురు. ఒక్క సత్య వాక్యముపై మనసును కేంద్రీకరించి ఆ వాక్యమును వాచకముగా మానసికముగా మరలా మరలా చెప్పుటవలన అది మనసున నిండి అవచేతనా మనసును చేరును. అది మరింత లోతునకు వెళ్ళినప్పుడు అధిచేతనా మనసుకు చేరి ఆపై ఆత్మను చేరును.అట్టి స్థితి యందు ఆ సత్య వాక్కు ఒక తెలుసుకోబడిన అనుభూతిగా మారును.అనుభూతి ఆ లోతుల నుండి మరల మనసును చేరినప్పుడు అది ఒక అనుభవ రూపమును దాల్చును. (అది నిజమగును) తన నిజస్థితి అను ఆత్మయందు క్రమము తప్పక ధ్యానము చేసిన యెడల యోగి సత్యముతో ఏకమగును. అతని అంతరంగ దివ్య అవగాహనను వెలిబుచ్చుటకు అతని వాక్కు ఒక సరియైన ఉపకరణము అగును. అతని మాటలు సత్యమును జ్ఞానమును వ్యక్తము చేయుచు వినుటకు ఆహ్లాద కరముగను మరియు వ్యక్తికి ప్రయోజన కరణము గను ఉండును. (సత్యమును ప్రియ హితమును ) ఆ వాక్కులు ప్రశాంతతను కలిగించును. సంతోషమును జ్ఞానమును శ్రేయస్సును కలిగించునవై ఉండును. మరియు అట్టి వాక్కుల యందు అనవసరమైన కరకు దనము లేకుండును.మరియు అట్టి వాక్కుల యందు ఉద్వేగములను కలిగించు భావార్థము (ఇరిటేషన్) లేకుండును. (అనుద్వేగము ) అతని కంఠ ధ్వని శక్తితో కూడినదైనను (ఫోర్సిబుల్) దయను కలిగి ఉండును. తీక్షణమైన స్వరమును అతను ఉపయోగించడు.
మానసిక తపస్సు: అంతరంగమునందు అంతటను నిశ్చలమైన ప్రశాంతతను సాధన చేయుట (ఇది మనస్సుకు శరీరానికి కూడా వర్తిస్తుంది.మనసుకు శరీరానికి సంబంధం ఉంటుంది శరీరానికి బాగా లేకపోతే (మనస్సుకు మనసుకు బాగా లేకపోతే శరీరానికి ఇబ్బంది ఉంటుంది)
అంతరంగము నందు సంపూర్ణమైన నిశ్చలమైన ప్రశాంతతను సాధన చేయుటయే 'మానసిక తపస్సు' మానసిక ప్రశాంతత యొక్క అత్యున్నత దశను యోగి తన్మయత్వ ధ్యానమున సాధించును. సాధారణంగా ఆలోచనలతో చంచలత్వము కలిగి ఉన్న మనస్సు అటువంటి తన్మయత్వ ధ్యానమున పూర్తి ప్రశాంతతతో నిర్మలత్వంతో ఉండి తన అవగాహన యందు స్వచ్ఛమైన స్పష్టతతో ఉండును.సాధారణంగా తమ ఆధిపత్యమును ప్రదర్శించు అహం యొక్క ఇంద్రియములు అటువంటి తన్మయత్వమున పూర్తిగా అణిచిపెట్టబడి ఉండును. మరియు ఇంద్రియములు అట్టి స్థితి యందు ఆత్మ యొక్క ఆధీనము నందు ఉండును. ఆ విధముగా చిత్తము తన హృదయమునందు ప్రశాంతత లేక శాంతమును ప్రతిఫలించును. అది యే భావోద్వేగముల వ్యాకులతను నిశ్చలపరచుట అని చెప్పబడును. యోగి ఆ విధముగా ఇంద్రియముల నిరంతర ప్రకటన నుండి తనను తాను ప్రకటించుకొనును. చంచలత్వపు ఆలోచనల పిచ్చి కూతల నుండి విముక్తుడై అంతరంగము నందలి సంపూర్ణ నిశ్చలత్వమును పరమానందం యొక్క ప్రశాంతత యందు ఆనందించుచు క్రమముగా అతను తన పూర్తి తత్వమును పరిశుభ్రపరచుకొనును. మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు అటువంటి ఆనందమును అనుభవించుచుండిరి. అట్టి ఆనందపు లోతును ఎవరికిని కొలవ సాధ్యము కాదు. అతని చైతన్యపు నిష్కల్మషమైన ప్రశాంతతను వర్ణించుతూ గొప్ప గ్రంథములు వ్రాయబడినవి. (అతను ఎంతో జ్ఞానము సంపాదించుకున్నది అందరికీ అర్థం అయ్యేటట్లుగా ఉంటుంది)
సాత్వికమైన మానసిక తపస్సును సాధన చేయు సాధకుడు అంతరంగ ప్రశాంతతను ధ్యానము చేయు సమయమునందును ఆపై ఇతర కార్యక్రమములు చేయునప్పుడు కూడా కొనసాగించుటకు ప్రయత్నించును .మానసిక ప్రశాంతతకు సంతోషకరమైన సానుకూల దృక్పథం కొనసాగించుచు సాధకుడు తన ఆలోచనయందు అవగాహన యందు స్పష్టతను అనుభవించును (మనః ప్రసాద) అంతరంగ హృదయము ప్రశాంతతతో ఉండగా సాధకుని భావనలు ఇష్టాఇష్టముల కోరికల దూకుడు లేక అతను అన్ని సందర్భముల యందు మృదుత్వంతో కూడి ఉండును. (సౌమ్యత్వము) అతని బాహ్య పరిసరముల యందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నను అతను తన అంతరంగము నందు ప్రశాంతమైన నిశ్చలతను కొనసాగించును (మౌనము) కపటములతో కూడిన ఇంద్రియ ప్రలోభముల కుతంత్రములు అతని ఆత్మ నిగ్రహ దృఢత్వమును కదలింప లేవు. (ఆత్మ నిగ్రహము) అతని తలుపుల యందు దివ్యమైన స్వచ్ఛత యుండును. ఏల అనగా అట్టి ఆలోచనలు అతని స్వభావమునకు చెందిన సద్గుణముల నుండి ఏర్పడినవై ఉండును. (భావ సంశుద్ధి) ఫలితముల కొరకు ఆతురతతో ఎదురుచూచు ధ్యానించు వ్యక్తికి సూచన.
దివ్య లక్ష్యమును చేరు సాధకునికి మరలా మరలా గుర్తు చేయునది ఏమనగా అతను ఏ విధమైన ఫలితములను ఆశింపక తన సాధనా ప్రయత్నం చేయవలెను. సాధనా ఫలితములను ఆశించుటవలన అది సద్విషమైనను కర్మ సూత్రములు ఆత్మను సృష్టి విషయములయందు బంధించును. ధ్యాన ఫలితమైన సర్వాతీత ఆత్మసాక్షాత్కారము పై ఏల మనసును కేంద్రీకరింపరాదని సాధకుడు అనుమానింప వచ్చును. ప్రాపంచిక కర్మలను చేయునప్పుడు వాటి ఫలితములను ఆశించుట వలన మనిషి ప్రాపంచిక జ్ఞానమునకు చెందిన విషయములయందు చిక్కుబడిపోవును. ధ్యానమును చేయు తొలి దశయందు భగవంతుని ఆశించి చేయుట వలన ప్రాపంచిక కర్మల ఫలితములపై ఆసక్తి తరిగిపోవును.
సాధకుడు ధ్యానము చేసిన ప్రతిసారి దాని ఫలితములు పరిశీలించుకునిన యెడల అతని దృష్టి ఫలితములపై కేంద్రీకృతం అగును. వాస్తవమునకు అతను పరిశీలించి పెంపొందించుకొనవలసినది ధ్యానమునందలి గాఢత. భగవంతునిపై గల దివ్యమైన ప్రేమ యందు మునిగి యోగి ధ్యానము చేయవలెను. అట్లు చేసిన యెడల అతని ఇష్టపూర్వకముగా సహజముగా తన ప్రయత్న ఫలితములను లెక్కింపక ధ్యానము చేయగలుగును.
భగవంతుని ప్రేమ యందు మునిగిన సాధకుడు మంచి ఫలితములను సాధించును. సాధకుడు భగవంతునితో వ్యాపారము చేయు రీతిని "నేనింత ఘనమైన ధ్యానము చేసి భగవంతుని సంపాదింపగలుగుదును" అను ఆలోచనలను చేయరాదు.
ధ్యాన ఫలితముల పై మనసును కేంద్రీకరించుచు సాధకుడు కొంత కాలము పిదప అతను భగవంతుని పొందుట లేదని తలచి తన ధ్యానమును త్యజింప వచ్చును. నిజమైన యోగి భగవంతుని స్వచ్ఛందముగా ఏ విధమైన నిబంధనలను ఏర్పరచక స్వచ్ఛముగా ప్రేమించును. సాధకుని అవచేతన యందలి దాగి ఉన్న చెడు కర్మ అడ్డు తగిలి దాని ఫలితం గా అతను తాత్కాలికముగా భగవంతుని పొందలేకపోయినను అతను నిరుత్సాహపడడు. అతను అనేక ప్రయత్నములు చేసిన పిదపకూడా భగవంతుని పొందలేకపోయినచో భగవంతుడిని ప్రేమించు సాధకుడు అతని ప్రయత్నమును మానడు. తుఫాను ఉధృత శక్తి తగ్గినప్పుడు అలలు క్రమముగా సముద్రమును చేరును. కనుక నిజమైన సాధకునికి తాను పట్టు విడవక ప్రయత్నం సాగించిన యెడల అంతరంగము నందలి అన్ని విధములైన అడ్డంకులు తొలగిపోవలెనను నమ్మకము ఉండవలెను. ఎప్పటికైనను ఆత్మతరంగము విశ్వతరంగముతో ఏకం కావలసినదదే. తరంగం ఎచట నుండి వచ్చినదో ఆ చోటునకే అది చేరవలెను.
17:18వ శ్లోకం
తపో యజ్ఞములను ఆడంబరము కొరకు మనుషుల గుర్తింపు పొందుట కొరకు గౌరవ మర్యాదల కొరకు చేసిన ఎడల అవి రాజసికములని చెప్పబడును. వాటి ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి అశాశ్వతమైనవి.
17:19వ శ్లోకము
అజ్ఞానముతోను తెలివి తక్కువతోను చేయు తపో యజ్ఞములు మరియు తనను హింసించుకొనుచు ఇతరులకు హాని కలిగించుట కొరకు చేయు తపోయజ్ఞములు తామసికమైనవి. రాజసిక తపోయజ్ఞములు ఆధ్యాత్మిక ఫలితములను కల్పింపవు. అయినను ఏ విధమైన తపోయజ్ఞములు చేయని దానికన్నను దుష్ట యజ్ఞ కర్మలు చేయుదానికన్నను అవి ఉత్తమమైనవి. ఆడంబరము కొరకు లేక కపటముతో కృత్తిమమైన బుద్ధితో తపోయజ్ఞములను చేయు వ్యక్తి కొంతకాలము పిదప తపోయజ్ఞములను అణుకువ వినమ్రతతో సరియైన దృక్పథంతో చేయవచ్చును. తామసిక యజ్ఞములైన మంత్ర తంత్రములు క్షుద్రోపాసన సాధకుని ఆధ్యాత్మిక శ్రేయస్సును నాశనము గావించును. మానవులు ప్రతీకారము తీర్చుకొనుట కొరకు లేక ఇతరులకు హాని కలిగించుట కొరకు నిర్వర్తించుచుండిరి. తన శత్రువుల యందు గల భగవంతునికి ఆని కలిగించు విధముగా ప్రయత్నించిన యెడల అది ప్రయత్నం చేయు వ్యక్తికే హానికరముగా పరిణ మించును. ఇతరులకు హాని తలపెట్టిన యెడల అది తలపెట్టిన వ్యక్తి యందు హానికరమైన గుణములను కలిగించును. ఇతరులకు అశుభము ఇవ్వదలచిన వ్యక్తి అటువంటి అశుభమును ముందు తానే పొందవలెను. మరొక వ్యక్తికి ప్రాణహాని కలిగించు వ్యక్తి తన ప్రాణమునకు హింసాత్మకమైన ముగింపు కలుగు విధముగా విశ్వసూత్రములను ఆహ్వానించును. ఒక మనిషి రక్తమును మరొకరు చిందించిన యెడల అతని రక్తము కూడా మరొక మనిషిచే చిందింపబడును( బైబిల్ వాక్యము)
20నుండి 23వరకు
17:20 వ శ్లోకము
మూడు విధములైన దానములు :
ప్రతిఫలమును ఆశింపక నీతి ధర్మమును అనుసరించి చేయు దానమును మరియు సరియైన సమయమున సరియైన ప్రాంతమున యోగ్యత కల వ్యక్తికి ఇచ్చు దానము సాత్విక దానము అని చెప్పబడును. ఒక యోగ్యమైన వ్యక్తికి ప్రతిఫలమును పొందు ఆలోచన లేక ఇచ్చిన దానము సాత్వికమైనది లేక సౌశీల్యంతో కూడినది. యోగ్యునకు దానమిచ్చు వ్యక్తి యొక్క హృదయము మిక్కిలి స్వచ్ఛమైనది. ప్రత్యుపకారము ఆశింపక స్వచ్ఛందంగా ఇచ్చిన దానము ఒక వింతైన వైరుధ్యమును కల్పించును. దానమిచ్చు వ్యక్తి ఏమియు ప్రతిఫలమును ఆశింపడు. కనుక అతనికి గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరును. అదే వైరుధ్యము. దానమిచ్చు గుణము క్రమముగా సాధకునికి భగవంతునికి మధ్యన కల అంతరమును రూపుమాపి సాధకుడిని భగవంతుని కి తన ఆత్మను సమర్పించు దారిన నడిపించును. సాధకుడు భగవంతుడి నుండి ఏమియు ఆశింపక ప్రేమతో తన ఆత్మను సమర్పించినప్పుడు అతను జీవితమందలి గొప్ప పరీక్షను నెగ్గిన వాడవును.భగవంతుడు సర్వమును కలిగి ఉన్నవాడు. అతను కేవలం దారి తప్పిన తన పిల్లల ప్రేమను మాత్రమే ఆశించును. దివ్యలోకపు తండ్రి ఆశించినదేదయినను ఉన్నదనిన యెడల అది బ్రాంతి యందు దారి తప్పి తిరుగుచున్న తన పిల్లల ప్రేమ ఒక్కటే.దారితప్పిన తన పిల్లలు తన వద్దకు రావలెనని వారు వారి సంతోషము కొరకు తన సంతోషము కొరకు తన వద్దకు తిరిగి రావలెనని భగవంతుడు ఆశించును. తన పిల్లల బాధ్యత భగవంతుడు తానే స్వీకరించును. అగమ్యగోచరమైన మాయను మరియు అందలి మాయను సృష్టించినది అతను కాదా.తన పిల్ల ల నుండి స్వచ్ఛమైన ప్రేమను అతను పొందిన అతను ఎంతటి సంతోషమును పొందునో కదా?
17:19 సమాప్తం.
17:20,21,22 శ్లోకాలు ఒక విభాగము:-
"మూడు విధమైన దానములు":-
17:20వ శ్లోకము అర్థము:-
ప్రతిఫలమును ఆశింపక, నీతి ధర్మమును అనుసరించి చేయు దానము, మరియు సరియైన సమయమున, సరియైన ప్రాంతమున, యోగ్యత గల వ్యక్తికి ఇచ్చే దానము సాత్విక దానము అని చెప్పబడును.
20వ శ్లో వ్యాఖ్యానము:-
సాత్విక దానములు మూడు విధములు అవి:-
1. ప్రాపంచికమైనవి .
2
3 ఆధ్యాత్మికమైనవి
ఒక నిరుపేద వ్యక్తికి ఆహారము ధనము ఇచ్చుట ఉత్తమము. కానీ అతనికి అర్హతను కల్పించినట్లు సహాయపడిన అది అన్నిటికన్నా ఉత్తమము. ధన వస్తు రూప సహాయమును ఒక వ్యక్తికి ఎల్లప్పుడూ ఇచ్చుచుంటడి న, అతను దానికి బానిస అయ్యి అట్టి సహాయము పైనే ఆధారపడి ఉండును. కావున ఆధ్యాత్మిక సహాయ విషయమున, అదివరకు ప్రాపంచిక విషయముల యందు మునిగి ఉండి, ఆధ్యాత్మిక విషయమున అతను ఆసక్తి కనపరచిన యెడల అట్టి వ్యక్తికి ఉన్నత మార్గ సూచన ఇచ్చుట ఉత్తమము. తీవ్రమైన ఆసక్తితో ఉన్న సాధకునికి దివ్యజ్ఞానమును బోధించుట మరింత ఉత్తమము. బాగుగా పురోభివృద్ధి సాధించిన సాధకునికి అతను మరింత ఉత్సాహంతో,తన వివేకముతో ఆత్మ-సాక్షాత్కారము పొందు విధముగా సహాయపడిన అది అత్యంత ఉత్తమము. యోగ్యత గల సాధకుడికి సమాధి స్థితిని కల్పించి ఆ విధముగా భగవత్ చైతన్యమును ప్రసాదించుట అన్నిటికన్నా ఉత్తమము. జ్ఞాన ప్రకాశము కలిగిన సద్గురువులు మాత్రము దివ్యజ్ఞానమును అర్హత కలిగిన సాధకులకు ఇవ్వగలరు.
భగవత్ ప్రేరేపిత ప్రవక్త తానున్న సమాజమునకు, తన ప్రాంత ప్రజలకు, వారు కొద్దిపాటి పట్టుదల, కొద్దిపాటి ఆంతరంగిక పరిణితిని ప్రదర్శించినను వారందరికీ (quandidaditive ఎక్కువమందికి) తన సహాయము అందజేయును. అట్టి ప్రవర్త తానున్న సమాజము నందలి కొద్ది మందిపై మాత్రము విశేషమైన శ్రద్ధ చూపి వారి ఆధ్యాత్మిక స్థితిని గొప్పగా మెరుగుపరుచుకొందురు. క్రీస్తు,లహరి మహాశయులు మరియు ఇతర గొప్ప గురువులు ఈ విధమునే అనుసరించెదరు. ఆకాశము నందు లెక్కలేనన్ని తారలు ఉన్నను, ఒక్క చంద్రుడు మాత్రము జగత్తునకు అంతటికి వెన్నెలను ప్రసాదించును. అదేవిధంగా, క్రీస్తు వంటి భగవత్ సేవకులు తన స్వశక్తిచే లేక తన గురువు ప్రసాదించిన దివ్య తన్వయత్వము చే భగవత్ సాక్షాత్కారమును పొంది, అనేక మందికి స్ఫూర్తిని కలిగించి, తన ఆధ్యాత్మిక ప్రకాశముచే ముక్తి ని ప్రసాదించును.
అర్హుడైన, కోయోగ్యత కలిగిన వ్యక్తి సహాయము అవసరం ఉన్న మరొక వ్యక్తికి భౌతిక/ప్రాపంచిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని అందజేయగలడు. కానీ మరొక వ్యక్తికి ధన సహాయము, జ్ఞానము, దివ్య చైతన్యమును అందజేయవలెనన్న దాత అటువంటి సంపదను కలిగి ఉండవలెను. అప్పుడే అతను మరి ఒకరికి ఇవ్వగలడు.
ఒక సద్గురువు కనికరము చేతను, లోతైన దృష్టి చేతను ప్రపంచకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా దీంట్లో దీనులైన వారి యందలి పరమాత్మ భాతను అనుభవించుటను గ్రహింప గలడు. అందుచేతనే అతను అట్టి దీనులకు సహాయం చేయుటను తన సంతోషకరమైన బాధ్యతగా భావించును. సద్గురువు దిక్కులేని వారిఅందలి యండలి భగవంతుని ఆకలినీ తీర్చి ప్రయత్నం చేయుదురు - అజ్ఞాని యందు నిద్రించుచున్న భగవంతుడిని మేల్కొల్పును - శత్రువు నందు స్పృహ లేక స్మృతి లేని భగవంతునిని ప్రేమించును. వేదనతో అర్జించు సాధకుని యందు పాక్షికముగా నిద్రించుచున్న భగవంతుడిని మేల్కొల్పును. మిక్కిలి అభివృద్ధి చెందిన సాధకుడినీ యందలి పూర్తి జగురుకుడై ఉన్న భగవంతుడిని ఒక మృదువైన ప్రేమ పూరిత స్పర్శచే తక్షణమే ఉత్తేజితము చేయను. మనుషులలో కెల్లా ఒక్క సద్గురువు మాత్రమే అత్యంత ఉత్తమమైన దానశీలి. అతని దాతృత్వము భగవంతుని దాతృత్వము వలె అవధులు లేనిది.