14) Gunatraya Vibhaga Yoga (గుణత్రయ విభాగ యోగం) 27

14వ అధ్యాయం
గుణత్రయ విభాగ యోగం (27 శ్లోకాలు)

14వ అధ్యాయం 1 నుండి 9 వరకు ఒక విభాగం.
"భిన్న ప్రకృతి యందు సహజంగా ఉన్న త్రిగుణాలు"

14:1
అర్థం: 
దివ్య పరమాత్మ ఈ విధంగా పలికెను. అన్ని విధములైన జ్ఞానం కన్నను ఉన్నతమైన జ్ఞానం నేను మరలా బోధించెదను. ఇటువంటి జ్ఞానమును పొందిన మునులు అందరూ జీవితాంతమున దివ్య పరమాత్మను చేరిరి. 
14:2 
అర్థం:
ఈ జ్ఞానమును గ్రహించి నా యందు స్థితులైన మునులందరూ కొత్త యుగ ఆరంభము నందైను మరల జన్మింపరు మరియు వారు నా సృష్టిలయమగు సమయమున ఎట్టి బాధను పొందరు.

14:1 & 2 
వ్యాఖ్యానం:
విశ్వ చైతన్యాగ్ని బంధాలను కల్పించు సంచిత కర్మలన్నింటిని దహించి వేయను. కావున తన మనసు నుండి భ్రాంతికి చెందిన చంచల స్వభావపు ఆందోళన అన్నింటిని నిర్మూలించి ఆత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞాని.. సామాన్యుల వలే మరల జన్మించాల్సిన అవసరం లేదు. అతను కోరికలను వాటి ఫలితంగా కలుగు మంచి చెడు కర్మ బంధాలను నశింపజేయును.

ముక్తిని సాధించిన సంపూర్ణ యోగులు సృష్టికి అతీతమైన తరంగ రహిత పరమాత్మతో ఏకం అయ్యదరు. ముక్తిని పొందిన యోగులు తమ జనన మరణ చక్రం నుండి విముక్తం అగుటయే కాకుండా జగత్తు ప్రళయ కాలం లయించినప్పుడు కూడా ప్రభావితులు కారు.

14:3 
అర్థం: 
మహా ప్రకృతియే (మహాద్బ్రహ్మ) నా గర్భం. అట్టి ప్రకృతి యందు నా ప్రజ్ఞ అనే బీజాలను ప్రవేశపెట్టదను. ఆ విధంగా సర్వ జీవరాసులు ఉద్భవించును.

వ్యాఖ్యానం: 
మహాద్బ్రహ్మ అనగా మహా ప్రకృతి రూపమున ఉన్న పరమాత్మ యొక్క చైతన్యం‌. అదే దివ్య పరమాత్మ యొక్క సృష్టికారక చైతన్యం లేక జీవులు ఉద్భవించు గర్భం. అట్టి మహా ప్రకృతి అనే గర్భం నందు పరమాత్మ తన కూటస్థ చైతన్యమును నిలుపును. అదే సర్వ సృష్టికి మూల బీజం. నిశ్చల పరమాత్మ యందలి సృష్టింప గల శక్తిని భగవంతుడు ఉత్తేజపరచగా ఒక్కడైన పరమాత్మ చైతన్యం నుండి సృష్టి పరిణామం ఏర్పడును.

సృష్టిలో జీవరాశులకి దివ్య పరమాత్మే తల్లి తండ్రి అని ఈ శ్లోకంలో ప్రకటించబడింది. సృష్టికి ఆదిమూలం మహత్బ్రహ్మ అదే మూల ప్రకృతిగా ఉన్న పరమాత్మ మరియు నిర్గుణ పరమాత్మ ‌ యందలి అవ్యక్త రూపము. మహాద్బ్రహ్మ భౌతిక పదార్థంగా తొలి ఉనికికి స్థానమైన గర్భం. అట్టి మహా ప్రకృతిలో దివ్య పరమాత్మ యొక్క ప్రజ్ఞ ప్రతిమ రూపంగా జీవరాశుల సృష్టికి బీజంగా నిలిచెను. ప్రజ్ఞ రూపంలో ఉన్న దివ్య పరమాత్మ తొలుత ఏకత్వంతో ఉండి విభిన్న రూపాలుగా ఏర్పడక ఉన్నాడు. ప్రజ్ఞ రూపాంలో ఉన్న దివ్య పరమాత్మ కూటస్థ చైతన్యంగా రూపు దాల్చి విశ్వ ప్రకృతి యొక్క తరంగ సృష్టిలో ప్రతిబింబించి ఆపై సృష్టిని కొనసాగించును.

నిశ్చలమైన ఏకత్వంతో కూడిన ‌ విశ్వ చైతన్యం నందు అనేక రూపాల సృష్టి సాధ్యపడదు. (తనలో ఇంకో అంశ పక్కకు తీసి అది సృష్టికారక చైతన్యం + ప్రజ్ఞ + మహా ప్రకృతి + ఓం అని అనబడును, అందులో నుంచి సృష్టిని సృష్టించును) అందుచే తనే తన ప్రకృతి లేక మాయ అను భ్రాంతిచే విశ్వ తుఫాను వంటి కార్యకలాపాలను కల్పించి (భౌతిక సృష్టి) భగవంతుడు తన నిరాకార అనంత సాగరంలో అంతులేని సృష్టి తరంగాలను కల్పించును.

14:4
అర్థం: 
ఓ అర్జున ఏ విధమైన గర్భం నుండి జన్మించిన జీవి అయిన అసలైన తల్లి మహా ప్రకృతే. ఆ జీవికి బీజాన్ని కల్పించే తండ్రిని నేనే.
            
వ్యాఖ్యానం:
ఆడమ్ మరియు ఈవ్ సర్వ మానవాళికి తల్లిదండ్రులని మానవ దృక్పదము నుండి భావించెదరు అని బైబిల్లో చెప్ప బడెను. (వివిధ గ్రంథములలో మొదటి జంట అని ఇతర నామములతో పిలుతురు) హిందువుల ప్రకారము స్వయంభు, శతరూప అన్ని జీవులకు తల్లిదండ్రులు, కానీ చివరకు తండ్రి అయిన భగవంతుడు అతని ప్రజ్ఞతో కూడిన అతని సహచరి ప్రకృతి అసలైన తల్లిగా సర్వ జీవరాశికి, సర్వ రూపములకు- అవి సజీవమైనను లేక నిర్జీవము అయినవి అయినను, దేవతలైనను, రాక్షసులైనను, మానవులైనను జంతువులైనను, వృక్ష రాశి ,లోహ, ఖనిజమైనను, సర్వమునకు మొట్టమొదటి తల్లిదండ్రులై ఉన్నారు.

                  14:5
                అర్థము
   ఓ మహా బాహు (అర్జున) ప్రకృతి యందు సహజంగా ఉన్న సత్వ రజో తమో గుణములు నాశరహితమైన ఆత్మను శరీరమున బంధించును.

              14:5 
        వ్యాఖ్యానము

ప్రకృతి యందలి మూడు గుణములు- (స్వచ్ఛత కలిగిన సత్వ గుణము, మోహంతో కూడిన రజోగుణము, జడత్వంతో కూడిన తమోగుణము-) ప్రకృతి యందు ఒక రూపమును కలిగిన పరిమితమైన ప్రతి జీవిని, వస్తువును కలవరపరుచును. విశ్వ ప్రకృతికి చెందిన సత్వ, రజ, తమో గుణములచే ప్రభావితమై కల్లోల పరచబడిన మానవ జీవిత తటాకమునందలి నీటి యందు స్వచ్ఛమైన ఆత్మ ప్రతిబింబము అహం అను వక్రీకరింపబడిన రూపముతో అగుపించును.

14:6
అర్థము:- 
పాప రహితుడైన ఓ అర్జున ఈ మూడు గుణముల యందు నిర్మలమైన సత్వగుణము ప్రకాశమును, క్షేమమును కలిగించును. కానీ మానవుడు ఆనందమునందు, జ్ఞానము నందు ఆసక్తి కలిగి ఉండుటవలన, సత్వగుణము అట్టి లక్షణములచే మానవుడిని బంధించి వేయును.
వ్యాఖ్యానము:-
 విశ్వ ప్రకృతి తన యందు మూడు గుణములను కలిగి ఉండును. కావున వాటియందు ఉత్తమమైన సత్వగుణము సైతం ప్రకృతి యందు సహజముగా ఉన్న మాయకు చెందిన బ్రాంతి యందు భాగమై ఉండును.
సత్వగుణము ఒక ప్రకాశవంతమైన బంధము ప్రకాశవంతమైనను బంధము బంధమే. ఒక బంగారు తీగ ఒక మనిషిని, వెండి లేక స్టీలు తీగతో బంధించిన విధముగానే, ఒక స్తంభమునకు కట్టి ఉంచగలదు.

(గమనిక:- గుణము అంటే గుణమునకు అర్థము ఒక త్రాడు యందలి పోగు. ప్రకృతికి చెందిన మూడు గుణములు ఒకటిగా అల్లబడిన ఒక త్రాడు) తామస గుణము రాజస గుణము వలె సత్వ గుణము కూడా ఆత్మను శరీరమునకు భూమికి బంధించి ఉంచును. 
(ముఖ్యం:- సత్వగుణము తన లక్షణములను ఆత్మ నుండి కాక ప్రకృతి నుండియే వారసత్వముగా పొందును. అందుచే అది పునర్జన్మకు కారణమైన అహం నుండి మనిషిని విడిపించుటకు అశక్తురాలై ఉండును)
సత్కర్మలు సైతం మనిషిని ఏ విధంగా పునర్జన్మ చక్రమున బంధించి ఉంచును:-
సత్కర్మలు సుగుణములు సైతము ఏ విధముగా మనిషిని పునర్జన్మల చక్రము నందు బంధించి ఉంచునో భగవద్గీత ఎందలి ఈ శ్లోకము వివరించు చున్నది. సత్వ గుణములు స్వచ్ఛమైనవి మరియు భ్రాంతి వలన కళంక పడనివి. కానీ ఒక వ్యక్తి సంతోషమును జ్ఞానమును తన భౌతిక శరీరమునకు చెందినదిగా, తన మనసుకు చెందినదిగా భావించినప్పుడు, అతని ఆత్మ తనను అహముగా గుర్తించుచున్నది అని తెలియ వలయును. ఒక ఉన్నతుడైన వ్యక్తి తన ఆనందమును తాను జ్ఞానమును పొందిన విషయమును వ్యక్తపరచినప్పుడు, అతను నేను అనుభావంను కలిగి ఉండి"నేను సంతోషంగా ఉన్నాను", 
"నేను తెలివైన వాడిని, అని భావించినప్పుడు అతను నిస్వార్థ భావమును కాక స్వార్థభావమునే కలిగి ఉన్నాడని తెలియును.
         
దివ్యానందము, జ్ఞానము ఆత్మకు చెందినవి. కానీ బ్రాంతి వలన అహం ఈ గుణములు శారీరక అనుభవములకు చెందినవి అని, తెలివికి చెందిన పరిజ్ఞానం అని భావించును. ఆనందము పరిజ్ఞానము తనకు చెందిన గుణములని అహం భావించి అట్టి అజ్ఞానముతో ఆత్మను శరీరము నకు పునర్జన్మకు బంధించును. దీని పర్యావసానముగా ఆత్మకు చెందిన స్వచ్ఛమైన అనంతమైన దివ్యానందమును జ్ఞానమును గ్రహింపక, అహం కలుషితమైన స్వల్ప ఆనందమును స్వల్ప పరిజ్ఞానమునే అనుభవించును . 
      
సత్పురుషుడు తాను ఇతరుల కొరకు చేయు మంచి కార్యక్రమములను తన కు పేరు ప్రఖ్యాతలను గడించుట కొరకు, అహమను సంతృప్తి పరచుటకు చేయరాదు. వారు అన్ని సత్కార్యములను భగవంతుడిని సంతృప్తి పరచు ఆలోచనలతో చేయవలెను. ఒక నిజమైన యోగి తాను చేయు అన్ని కర్మల వలన ఆనందమును జ్ఞానమును పొందును. సత్కర్మలు సద్గుణములు అన్నియు అహం నుండి కాక ఆత్మ నుండి జనించునని అతనికి తెలియును. అహంభావముతో చేయు సత్కర్మలు పునర్జన్మలను కలిగించు బంధములను ఏర్పరచునని అతనికి తెలియును. అదేవిధంగా సత్కర్మలను చేయునప్పుడు వాటిని చేయువాడు భగవంతుడే అని భావించినప్పుడు అట్టి కర్మలు ముక్తిని ప్రసాదించునని అతనికి తెలియును.
         
ఉదాహరణకు ఒక వ్యక్తి ఆహారమును స్వీకరించినప్పుడు అది భగవంతుని దేవాలయము అగు శరీరమును పోషించుటకే అను భావము అతనికి ఉన్న ఎడల అతను ఎట్టి కర్మలను చేయని వాడు -సత్కర్మలు కూడా చేయని వాడగును-. అటువంటి భావముతో ఆహారమును స్వీకరించిన యెడల అది భగవంతునికి సేవ చేసినదే అగును. అంతేకానీ అహం యొక్క అత్యాశను సంతృప్తి పరచినది కాదు. ఒక వ్యక్తి రుచి కరమైన ఆహారమును భుజింపవలెను కోరికను జయంపక మరణించిన ఎడల, విశ్వమునకు చెందిన ధర్మమును అనుసరించి అతను ఆ కోరికను తీర్చుకొనుటకు భూమిపై జన్మించప వలసినదే అతని అవచేతన స్థితియందు అతను స్వర్గమునందు ఉండుటకు ఇష్టపడడు. ఏల అనగా స్వర్గమునందు అతను కోరిన వంటశాల, వంటలు చేయువారు, అతను కోరిన కూరలు భక్ష్యములు లభింపవు కనుక అతను భూమిపై మరలా జనించును. ఆ కోరికలు తీర్చుకొనుటకు మరల మరల జన్మించును.
14:7 
అర్థము:- 
ఓ అర్జున కార్యశీలతతో కూడిన రజోగుణము మొ మోహంఓతో నిండినది అది కోరికలను బంధములను కలిగించును.కర్మల యందు తీవ్రమైన ఆసక్తి కలిగి అది శరీరమునందలి ఆత్మను బంధించి ఉంచును.
వ్యాఖ్యానం:-
జ్ఞానము లేక ప్రాపంచిక కర్మలను చేయుట వలన అది భౌతిక విషయములపై అహమును సంతృప్తి పరచుటయందు సంతృప్తి చెందని కోరికలను బంధములను కలిగించును. స్వార్థం కొరకు కర్మలను చేయువాడు శారీరక కర్మలతోనూ, కోరికలతోనూ తీవ్రముగా బంధింపబడి ఉండును.
       
అటువంటి ప్రాపంచిక కార్యకలాపములు అంతులేని కోరికలను పుట్టించును. కోరికలన్నీయు తీరక మునుపే మరణము సంభవించుట వలన మనిషికి పునర్జన్మ కలుగును. ప్రపంచమున అనేకులు ఈ విధముగా పునర్జన్మలను పొందుతున్నారు. కేవలము భగవంతుని సంతృప్తి పరచుటకేకర్మలను చేయుట బంధమును కలిగింపదు.
     
సత్వగుణము కొందరికే ఉండును. కొంతమంది తీవ్రమైన తామసిక గుణమును కలిగి ఉండుటచే ఎంతటి దుర్మార్గపు పని అయినను సునాయాసముగా చేయుదురు.కాని జనుల యందు ఎక్కువ భాగము రాజసిక గుణమును కలిగి ఉందురు . మోహపూరిత రజోగుణ ప్రభావము చే వారు ప్రాపంచిక విషయములు యందు, స్వార్థపూరిత విషయములందు మునిగి ఉందురు.

14:8
అర్థం:-
ఓ అర్జున తమస్సు అజ్ఞానము వలన జనించును. అది జీవులను బ్రాంతి యందు ఉంచును. మరియు జీవులను బ్రాంతి, సోమరితనము, నిద్రకు బందీలను చేయును.
వ్యాఖ్యానం:-
ప్రకృతి యందలి తమోగుణము అన్ని రకాల కష్టములను కలిగించును. అది మాయకు చెందిన బ్రాంతి నుండి వెలువడిన ఒక అంధకార గుణము అది అహమునకు, సృష్టి విషయమునకు తాము పరమాత్మ కన్నను భిన్నమైనవని అది ఏ నిజమను భావనను కల్పించి ఆత్మజ్ఞానమునకు అడ్డుపడును. తమోగుణ సంపన్నుడు చెడు ఆలోచనలనే కలిగి ఉండును. అతను నిర్లక్ష్యము తోను, సోమరితనముతోను ఉండును. తనను ఉద్ధరించు సత్వగుణ కర్మలను విసర్జించి, తనను కొంత బాగుపరచు రాజసిక కర్మలను విసర్జించి, అతను నిద్ర లోలుడై ఉండును. మృగము వలె అతను శరీర కాంక్షను మాత్రమే కలిగి ఉండును.
      
కర్మను చేయు రాజసిక వ్యక్తి ఒక ఆలోచన విధానమును అనుసరించును. కనుక అతని జీవితము కొంతవరకు ప్రయోజనకరము. సత్వ గుణము కల వ్యక్తి జీవితము అంతకన్నా ఉత్తమమైనది ఎల అనగా గుణము కల వ్యక్తి ఆత్మ అవగాహనను కలిగి ఉండును.

14:9
అర్థము:-
సత్వ గుణము వ్యక్తిని ఆనందముతో బంధించును. రజోగుణము కర్మలతో బంధించును. తమో గుణము వివేకమును మరుగుపరిచి వ్యక్తిని భ్రమకు గురిచేయును.
వ్యాఖ్యానము:-
త్రిగుణముల ప్రభావముతో అహం ప్రేరేపితముగా చేయు కర్మలు పునర్జన్మలను కలిగించు బంధములను ఏర్పరచును. ఒక వ్యక్తి స్వభావపరముగా మంచివాడై సత్కర్మలనే చేయుచుండిన అతను సాధారణముగా సద్గుణములకు దాని వలన కలుగు ఫలితములైన అంతరంగమునందలి సంతృప్తి, సంతోషములపై ఆసక్తి, అనుబంధము కలిగి ఉండును. ప్రాపంచిక కార్యకలాపముల యందు అలవాటు ప్రకారము నిమగ్నుడై ఉన్న వ్యక్తి, అటు వంటి పనుల యందు విరామము ఎరుగని చురుకైన అభిరుచి కలిగి ఉండి వాటితో అనుబంధం కలిగి ఉండును. తామస గుణముతో కూడిన అజ్ఞాని అవగాహన శక్తి లేక భ్రాంతి యందు, తప్పులు చేయుటయందు మునిగి ఉండును.
     
సాధారణ జనులు అనేకమంది ప్రాపంచిక కార్యక్రమంలో యందు నిమగ్నులై అట్టి కర్మలతో ఒక బంధమును కలిగి ఉందురు. ఇటువంటి కార్యకలాపముల యందు వ్యక్తి వివిధ రకములైన కర్మలను చేయుచు జీవితమున ఒక విధమైన పరీక్షకు గురి అగును. ప్రాపంచిక కర్మలను చేయు అటువంటి వ్యక్తులు మానసికముగా చురుకుగా ఉండి , తామసిక గుణముతో సోమరితనము ,చికాకు పొందు వ్యక్తులకన్నను ఉన్నత మైన స్థితియందు ఉందురు. రాజసిక గుణముతో ఉండు వారు సత్వగుణములను అలవర్చు కోను అవకాశము ఉన్నది.ఏల అనగా వీరు కార్యక్రమములను దైవము కొరకు చేయుటకు నేర్చుకొని, అహం యొక్క ప్రభావం నందు పడరు.
     
ప్రాపంచిక కార్యక్రమములను మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేయువారు, చికాకు, ఆందోళన వారిని చుట్టి ముట్టి ఉన్నను వారు సత్వగుణ ప్రధానంగా ఉందురు. అందుచే వారు అహంభావమును పూర్తిగా వీడకున్నను , కర్మలను చేయునప్పుడు సంతోష భావముతో కూడిన మనసును కలిగి ఉందురు. ఇటువంటి ఆధ్యాత్మిక స్థితిని మధ్య రకమునకు చెందినదిగా చెప్పుదురు. అనేకమంది మానవులు ఇటువంటి మధ్యరకపు స్థితియందు బహుకాలము గడుపుదురు. మరియు ఆధ్యాత్మిక విషయములను నేర్చుకొనుట యందు ఆసక్తి కనపరచుచు, అహంభావము కలిగిన సత్కర్మలను ఆచరించు చుందురు. దాని ఫలితముగా వారి మానసిక పరిణితి ఉన్నతమైన స్థితికి చేరుచుండును.
14:10 నుంచి 13 వరకు ఒక విభాగము.

14:10
అర్థము:
మానవుడుని గుణమునందు మంచి చెడుల మిశ్రమము:-
మానవుని యందు కొన్ని సమయములలో రాజస , తామస గుణములను అధిగమించి సత్వ గుణము ప్రధానముగా ఉండును. మరికొన్ని సమయములందు సత్వ తామస గుణములు కాక రాజస గుణము ప్రబలముగా ఉండును. మరి కొన్ని సమయములయందు సత్వ రాజస గుణములను తామస గుణము కప్పివేయును. (ఒక గుణము ఎక్కువుంటే ఆటోమేటిక్ గా మరో రెండు గుణములు తగ్గిపోతాయి)
వ్యాఖ్యానం:-
ఈ శ్లోకము నందు ఒక చమత్కారమైన రూపున ప్రతి  మనిషి తన ప్రతిరూపం చూడగలును .కొన్ని సమయములయందు అతను మంచివాడై ఉండును. మరి కొన్ని సమయములయందు అతను చెడ్డవాడై ఉండును. మరికొన్ని సమయములయందు అతని స్థితి మంచి కాక చెడు కాక మద్యస్థముగా ఉండును. ఇది మానవ సహజము. జ్ఞానులు కానటువంటి సామాన్య జనులు అందరూ ప్రకృతికి చెందిన మూడు గుణములచే ప్రభావితులై ఉందురు. కానీ జీవితము నందు అలవాటు ప్రకారము ఎప్పుడు ఏ గుణము ప్రధానమై ఉండునో అతనికి తెలియకనే అతని జీవితము గడచిపోవును.

14:11 
అర్థము :-
ఒక వ్యక్తి తన ఇంద్రియ మార్గము ద్వారా జ్ఞాన ప్రకాశమును వెలువరించుచుండిన అతను సత్వగుణ ప్రధానంగా ఉండును. 
వ్యాఖ్యానం:--
జ్ఞాని ఇంద్రియములను తన అదుపులో ఉంచుకొని వాటిని సత్కార్యముల కొరకు వినియోగించును. అతను మంచిని మాత్రమే చూచును. అతను చూచునవి, వినునవి, వాసన చూచునవి, రుచిని చూచునవి, స్పర్శను పొందునవి - (సర్వము అతనికి భగవంతుడిని గుర్తు చేయను) అతని యందలి జ్ఞాన ప్రకాశముచే అతని బుద్ధి, విచక్షణా శక్తి  భ్రాంతి కరమైన ఇంద్రియ అవగాహన విషయములను సరియైన రీతిన అర్థము చేసుకొనును. అంతరంగ అవగాహనచే అట్టి సత్వ గుణ సంపన్నుడు సర్వము బ్రహ్మమని ఎరిగి ఉండును. అతను తన ఆచరణ యందు ప్రకృతికి చెందిన దివ్య సూత్రములను గమనించును. సర్వవ్యాపక పరమాత్మను మరుగుపరచు ఏ విషయమునైనను అతను విసర్జించును. ప్రకృతి యందు అంతర్లీనముగా ఉన్న ఆ పరమాత్మను ప్రస్ఫుటము చేయు దానిని నెల్ల అతను స్వీకరించును.

14:12  
అర్థం:-
రజోగుణము అధిక ప్రాధాన్యతతో ఉన్నప్పుడు ఆది లోభమును, కార్యశీలతను, కర్మలను చేయుటయందు ఆసక్తిని, వ్యాకులతలను, కోరికలను కల్పించును.
వ్యాఖ్యానం:- 
సాధారణ వ్యక్తి యందలి కార్యశీలత పనులను చేయుటయందు ఆసక్తి అహం భావ పూరితమై ఉండును. అందుచేత అవి అనేక దుఃఖములను, భ్రమలను కలిగించును. అట్టి వ్యక్తి యొక్క మనసు తాను చేయు పనుల యందు తనకు నష్టం కలుగునో అను భయముతో ఉండును. మరియు అతను లాభములను ఆశించు చుండును. అతని కోరికలకు అనుగుణముగా అతని వ్యాకులత పెరుగుచుండును. కలతలు , ఆందోళన అతని చుట్టుముట్టి ఉండును. ప్రశాంతత, నిజమైన ఆనందము అతనికి లభింపకుండును.
       
తన కొరకు తన బంధుజనుల కొరకు కష్టపడే వ్యక్తి భగవంతుడికి చెందిన కుటుంబము నందలి కొంత భాగమును పోషించిన వాడు అగును. రాజస గుణము కలిగి స్వార్థముతో పనిచేయు ఒక వ్యాపారస్తుడు తామస గుణముతో ఉన్న సోమరి కన్నను ఉన్నతుడు. తామస గుణముతో ఉన్నవారు తమను తాము పోషించుకొనరు , వారు సమాజమునకు ఏ విధముగాను ఉపయోగపడరు.
14:13  
అర్థం: -
తామస గుణము ప్రధానంగా ఉన్నప్పుడు అది అంధకారమును, సోమరి తనమును, విధుల యందు బాధ్యతారహిత్యమును, భ్రమలను కల్పించును.
వ్యాఖ్యానం:-
తామస గుణము అధికముగా గల వ్యక్తి ఇంద్రియ భోగములను అధికముగా అనుభవించుటవలన అతని శరీరమునందలి శక్తి నశించి అతను సోమరి అగును. అతను నిర్వర్తింపవలసిన విధులను అతను నిర్వర్తింపక బుద్ధి మాంద్యమును పొంది జడత్వంతో నిండి చికాకుగా ఉండును.
      
ఇంద్రియ లోలత్వము గల వ్యక్తులు అట్టి గుణమును విడువవలెను. వారు కేవలము భుజించుట, శృంగారము , చెడు అలవాట్ల యందు నడుచుట అటువంటి తామస గుణ ప్రవృత్తులను మార్చుకొనవలెను. భగవంతుడి ప్రతిరూపుగా ఏర్పడిన మనిషి బుద్ధిహీనమైన జంతువు వలె ప్రవర్తింప రాదు. మరియు వ్యర్ధమైన కొరగాని తనమునందు మునిగిపోరాదు. జంతువుల యందు కొన్ని జంతువులు మాత్రము అధికముగా భుజించి, అధికముగా కామక్రీడ యందు పాల్గొనును. కావున ఇంద్రియములకు బానిస అయిన వ్యక్తి అనేక రకములైన జంతువుల కన్నను హీనమైన వాడు. అధికమైన కామ కేళి వలన తెలివి నశించును. మరియు అట్టివారు ఇతర ఇంద్రియ అనుభవములను గ్రహించి ఆనందింపలేరు. మత్తు మందులకు బానిస అయిన వారు తాగుడు అలవాటు కలవారు ఇంద్రియ లోలురులు పరిణామక్రమ ప్రక్రియ యందు అట్ట అడుగునకు పడిపోయెదరు.  
         
ఇంద్రియ భోగములను అధికముగా అనుభవించడం వలన వ్యక్తి యొక్క మనసు మసక బారి అతను మంచి చెడుల తారతమ్యమును తెలుసు కొనలేకుండును. అతని శారీరక, మానసిక, ఆత్మశక్తు లు అన్నియు నశించి, అతను నిజమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆనందమును పొందలేక ఉండును. ఒక దుర్మార్గపు వ్యక్తి దుఃఖములను కలిగించు పనుల యందు అతి త్వరగా దిగజారి పోవును. అయోమయము చెందిన అతని మనసు చీకట్ల యందు చిక్కు కొనగ అతను తన జీవితమున మంచి మార్పులను ఆరంభించుటకు అశక్తుడై ఉండును. 
      
రాజసిక గుణముతో వ్యాకులత చెందు వ్యక్తి తన యొక్క, ఇతరుల యొక్క చింతల కుంపటి యందు మాడిపోవును. కానీ తామసిక వ్యక్తి కలతల కుంపటి యందు వేగినను అతను గట్టిదనముతో ఉన్నట్లు అగుపించును. అనగా దాని అర్థము- అతను ప్రాణములేని జడత్వముతో కూడిన రాయి వలే ఉండును.

14: 14 నుండి 18 వరకు ఒక విభాగము.
సత్వ రాజసిక తామసిక గుణములతో కూడిన జీవితము యొక్క ఫలితములు:-

14 :14 
అర్థం:- 
సత్వ గుణము ప్రధానముగా ఉన్న వ్యక్తి మరణించిన పిదప , అతను పరమాత్మను ఎరిగిన జ్ఞానులు నివసించు నిష్కల్మషమైన లోకములను చేరును.

14:15 
అర్థం:-
వ్యక్తి మరణ సమయమున రాజస గుణము ప్రధానముగా ఉన్న ఎడల, అతను కర్మా శక్తి కలవారి 
మధ్యన పునర్జన్మను పొందును. తామస గుణముగా ప్రధానము గల వ్యక్తి మరణించిన పిదప అతను ఘాడమైన భ్రాంతి యందు మునిగిన జీవుల గర్భమున, లేక అటువంటి వాతావరణము కల ప్రదేశమున, లేక అటువంటి కుటుంబమున , లేక అటువంటి జీవనము గడుపు పరిసరముల మధ్యన జన్మించును.
14:14 & 15 వ్యాఖ్యానం:-
ఒక వ్యక్తి భూమిపై నివసించు విధానమును అనుసరించి అతని మరణాంతర జీవనము నిర్ణయింపబడును. మంచితనము, సత్వ గుణమును అలవాటు చేసుకుని నిష్కల్మషము నందు స్థిరపడిన వారు మరణానంతరము దేవతల లోకమును చేరెదరు.

రాజస గుణముతో నిండి ప్రాపంచిక బంధములను కలిగి ఉన్నవారు మరలా ఈ భూమిపై  సాధారణ స్త్రీ పురుషులై జన్మించుదురు. లేక వారి వాంఛ వారి భావోద్వేగా పూరిత గుణమునకు సరిపోవు, విస్తృతమైన కార్యక్రమములు నడుచు ఇతర గ్రహములు యందు జన్మించుదురు. 

తామస గుణము దుర్మార్గముతో నిండిన వారు జంతువుల శరీరం యందు జన్మించెదరు లేక, అనైతికమైన మృగప్రాయపు గుణములు ఉన్న కుటుంబములు యందు జన్మించెదరు. లేక దౌర్భాగ్యపు పరిస్థితులతో తమ గుణమును ప్రభావిత పరచి తమ జీవన పరిస్థితిని నిర్ణయించు పరిసరముల యందు జన్మించెదరు. లేక వారు బహుకాలము చీకటితో కూడిన సూక్ష్మ లోకముల యందు , లేక భూమిని పోలిన ఇతర గ్రహముల యందు జన్మింతురు. అట్టి గ్రహముల యందు జీవనము గొప్ప భాదలతోనూ హింసతోను కూడి ఉండును. పూర్తి భ్రాంతితో కూడిన జీవులు (పూర్తిగా మాయకు లొంగిపోయిన వారు) ఒక జన్మ నుండి మరొక జన్మను పొందినప్పుడు ఇటువంటి చీకటితో నిండిన గర్భమునందు లేక అటువంటి పరిసరముల యందు జన్మించెదరు.
      
ఆ విధముగా ప్రతి మనిషి తనకు తెలిసి తెలియక భవిష్యత్తు నందలి తన స్థితినే కాక, తాను నివసించు ప్రదేశమును -( అది స్వర్గము, భూమి లేక నరకము )- తానే నిర్ణయించుకొనును.
         
సత్వగుణము కలవారి యందు మంచి మనుషుల నుండి , మంచితనముతో పాటు సాదు సత్పురుషుల లక్షణములను  కలిగిన వారు ముక్తిని పొందిన యోగుల వరకు ఉండును. మంచితనము గలవారు తమను తాము పరిపూర్ణతముతో నిండిన వారుగా మలచుకొను ప్రక్రియ యందు సాదు సత్పురుషుల గాను, ఋషులుగాను, యోగులను ఉన్నత శ్రేణికి చెందిన ఋషులగను దేవతలగను, ముఖ్య దేవతలను మార్పు చెందెదరు. చివరకు త్రిగుణముల నుండి విముక్తులకు సమయమున వారు పరమాత్మ యందలి శాశ్వత తత్వమునందు కలసిపోయెదరు.
        
అదే విధంగా రాజసిక గుణములు కలవారి యందు వివిధ వర్గములు ఉండును. వారిలో ప్రాపంచిక గుణములు ఉన్నవారు కొందరు సాధు గుణములతో మరికొందరు దుర్మార్గము నాకు సమీపము నందు ఉందురు. అదేవిధంగా తామసిక దుర్గుణములు కలవారి యందు సామాన్య గుణము కలవారు సామాన్య గుణము (తినడం, నిద్రపోవడం)కలవారు మద్యస్థముగా ఉన్నవారు (సోమరితనము, కొంత దుర్మార్గము) తీవ్రమైన దుర్గములు కల వర్గములు ఉండును.

భగవంతుని సృష్టి యందలి మంచి చెడు మరియు రెండింటి కలయికతో కూడిన జగత్తులు:-
తన విస్తారమైన సృష్టి యందు పరమాత్మ పరిణామ క్రమమున జీవుల కొరకు వివిధ దశలు చేరిన జీవుల కొరకు మరియు వివిధ అభిరుచులు కలిగిన జీవుల కొరకు, వారికై ప్రత్యేకమైన ప్రదేశములను ఏర్పరచెను. మంచి జీవులు మాత్రమే జీవించు సత్వ గుణ జగత్తులు కలవు. 
 
రాజసిక జగత్తుల యందు జీవులు అందరూ పనులను చేయుటయందు కోరిక కలవారై ఉత్సాహపూరితులై ఉందురు. ప్రస్తుత పరిణామ క్రమము నందు మనము నివసించు భూమి రాజసిక గుణ ప్రధానమైనది. మరియు మనము నివసించు ఈ భూమి మంచి చెడులకు మధ్యస్థమై ఉన్నది. అదే గుణముగా విధముగా తామసిక తామసిక - చెడు జీవులు మాత్రమే అధికముగా ఉండు జగత్తు ఉన్నది. అచ్చట భూమిపై తొలు తొలుత నివసించిన డైనాసర్ వంటి జంతువులు, నేలపై, నీటి యందు గాలియందు విహరించు క్రూరమైన మృగములు, తాము నివసించు ప్రదేశమున ఇతర జంతువులతో భీకరము మైన యుద్ధం చేయుచు, తమ జాతి వారిని చంపి తినుచూ ఉండును. మరికొన్ని గ్రహముల యందు దుష్టులైన క్రూర జీవులు ప్రియతముల వలె ఉందురు.
        
లెక్కలేనంత మంది మంచి జీవులు ముక్తిని పొందిరి. ప్రాపంచిక దృక్పదము పదములు  గల అనేక జీవులు భూమిపై ,లేక వారి కోరికలకు అనువైన ఇతర గ్రహముల యందు మరలా మరలా జన్మించుచుందురు. ముక్తి కొరకు ప్రయత్నింపని దుర్మార్గ జీవులు అనేకమంది చెడు లక్షణములు కలిగిన మానవులుగా, లేక భూమిపై జంతువులుగా జన్మింతురు. లేక వారు ఇంకనూ అభివృద్ధి చెందని ప్రపంచంలకు, లేక క్షుద్రమైన తామసిక జగత్తులకు పంపబడుదురు.
      
సత్వ, రాజసిక, తామస గుణములతో కూడిన మానవులు, జంతువులు, అడవి జంతువులు, క్రూర మృగములు, క్షుద్రమైన పిశాచములు - విశ్వ చిత్ర ప్రపంచమును వివిధ రకములైన వినోదముతోను, ఉద్రేకముతోను, స్ఫూర్తితోను నింపును. పీడ కలల వంటి సంఘర్షణలతోనూ, దుఃఖము, మరణము తోను కూడిన అనేక జన్మల పిదప మానవుడు వివేకంతో బుద్ధి కలిగిన జీవియై జీవిత పాఠం నేర్చుకుని విశ్వ నాటకం నుండియ బయటపడవలెను. ఆత్మ స్వస్థానమైన పరమాత్మ దివ్య స్థానమును చేరవలెను.
14:16 
అర్థం:-
సత్వగుణ కర్మల ఫలితముగా జీవితమున సామరస్యము, నిర్మలత్వము లభించునని మునులు తెలిపెదరు. రాజసిక గుణ కర్మ ఫలము దుఃఖమును తామసిక గుణ కర్మ అజ్ఞానమును కలిగించును.
వ్యాఖ్యానం:-
సత్వగుణముతో కూడిన పనులను చేయటం వలన జీవితమున సంతోషము లభించును. అహంకారంతో కూడిన ప్రాపంచిక కార్యక్రమములు చేయుట వలన దుఃఖము , భ్రమ కలుగును . చెడు కార్యక్రమములు చేయుట వలన మనిషి యొక్క బుద్ధి, గ్రహించు శక్తి (విచక్షణ శక్తి) నశించును. సత్పురుషులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయుట వలన కలిగిన ఆనందం తో ప్రోత్సాహవంతులై మరింత ఔన్నత్యమును పొందుటకు ప్రయత్నించెదరు. సాధారణమైన వ్యక్తి యొక్క జీవితము మంచి పనులతోనూ, చెడు పనులతోనూ నిండి ఉండును.
సద్గుణములను అలవర్చు కొనుట యందు ఆసక్తిని ప్రదర్శింపక సత్కార్యములను విడిచి చెడు అలవాట్లు సోమరితనము అను మత్తు నందు మునిగి పోవు వారు అత్యంత అధములు. తామస గుణములు కలవారు తమ క్షేమం కొరకు ఎటువంటి బాధ్యతలు స్వీకరింపక తాము నివసించు సమాజం క్షేమము కొరకు కూడా ఎటువంటి బాధ్యతను స్వీకరింపక చికాకుతో మితిమీరిన అజ్ఞానముతో ఉందురు.
 
బైబిల్ వాక్యము :- "పాపము చేయుట వలన మరణము వేతనముగా లభించును".
అనగా పాపం చేయటం వలన మనిషి యొక్క ఆనందం నశించిపోవును. అజ్ఞానము పాపములో కెల్లా పాపము. ఎందువలనగా అజ్ఞానమే అన్నీ కష్టములకు మూలము.
అల్పమైన సంతోషము ను ఇచ్చి, అనేక కష్టములను తెచ్చు పనులను ప్రాపంచిక జనులు ఏలచేయుదురు? దుర్మార్గులు హానికరమైన ప్రవర్తనను అవలంబించి తమకు తాముగా ఏల నాశనమున కొని తెచ్చుకుందురు?.. దీనికి సమాధానము అలవాటు: అలవాటు అనునది మానవుని విధిని నిర్ణయించు యందు ఒక బలమైన అంశము.

అలవాటు యొక్క బలమైన ప్రభావం వలన అనేకమంది తాము కష్టముల పాలయ్యేదము అని తెలిసినను అటువంటి అలవాట్లనే కొనసాగింతురు. అటువంటి వ్యక్తులకు ఆధ్యాత్మిక జీవనం గడుపుట వలన కలుగు ఆనంద అనుభవము తెలియకుండును .
       
ఒంటె ముళ్ళ చెట్ల ఆకులను తినును. అట్టి ఆకులు తిన్నప్పుడు ఆ చెట్టు ముళ్ళు దాని నోటిని గుచ్చుకొని రక్తము కారుతుండును . అయినను ఒంటె ముళ్ళతో కూడిన ఆకునే తినును. అదేవిధంగా తన ఆరోగ్యం నశించినను ఇంద్రియ లోలుడు తన అలవాట్లను వీడడు. త్రాగుటకు బానిస అయిన వాడు అలవాటును విడువక తనకు మరణమును కొనితెచ్చు ఆ అలవాటును కొనసాగించును. వ్యక్తికి తనయందు ఉన్న, దేనితోను సరిపోల్చలేని ఆత్మకు చెందిన అమృతము గురించి తెలియనంత వరకు అతను అలవర్చు కొనిన చెడు గుణములను సులభముగా వదులుకొనలేడు. లోభ బుద్ధి గల వ్యక్తి ధనమును సంపాదించు నిరంతర మైన కోరికచే తన ఆనందమును నాశనం గావించు కొనును. శ్రద్ధతో ధ్యానము చేయుట యందు అతను కొంత సమయం వెచ్చించిన అది స్వర్ణము కూడా కొనలేని శాశ్వత ఆనందమును ఇచ్చునను విషయము అతనికి తెలియదు.

ప్రాపంచిక వ్యక్తి ప్రాపంచిక విషయములు, దుఃఖముతో కూడినవని తెలిసినను అతను ప్రాపంచిక విషయములందు కొనసాగును. మరియు దుర్మార్గులు వివేక శూన్యమైన జీవితం నందు మునిగి తమ నియమ విరుద్ధమైన జీవితమును కొనసాగింతురు. పైన తెలిపిన రాజసిక, తామసిక గుణములతో కూడిన అలవాట్లు అట్టి వ్యక్తులకు సాధారణ ప్రాపంచిక జీవితము నందలి మంచి ఆనందమును మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గము, ఆత్మ విచారము యందు గల గొప్ప ఆనందములు తెలియనివ్వవు. రాజసిక గుణములు గల వ్యక్తి మానసికంగా చురుకుదనంతో ప్రేరేపితులై ఉందురు. అట్టి వ్యక్తులు తాము చేయు పనుల యందు తమకు నిరాశ, నిస్పృహ కలిగినప్పుడు వారు తమకు తాము సంస్కరించు కొనుటకై, శాశ్వత ఆనందం కొరకై ప్రయత్నములు చేయ ఆరంభింతురు. కాని తామసిక గుణములు గల వ్యక్తులు తమకు తాముగా అజ్ఞానమునందు మునిగి.తమను బాగుచేసుకొను సంకల్ప బలము లేక, మరింత అజ్ఞానమునందు మునిగి తమను తాము బాధించుకొనుట యందు మరియు ఇతరులను బాధించుట యందు గల హింస యందు గల ఆనందమును పొందెదరు. మనుష్యులందరూ సత్సంగము వలన, తమయందు దాగివున్న ఆత్మ నిగ్రహ శక్తిని ఉపయోగించుట వలన తమ జీవితమునకు మూల కారణమైన భగవంతుడిని ధ్యానించడం వలన, తమ జీవితములను మార్పు చేసుకుని అభివృద్ధిని సాధించవచ్చును. మంచితనమును కొంతైనను అనుభవించి తెలుసుకున్నచో అది శాశ్వత ఆనందమును సమకూర్చు ఆధ్యాత్మిక జిజ్ఞాసకు ప్రేరణను ఇచ్చును.
14:17 
అర్థం:-
సత్వ గుణం వలన జ్ఞానము కలుగును. రజో గుణము వలన లోభము కలుగును. తామస గుణము వలన భ్రాంతి, నిర్లక్ష్యము, అజ్ఞానము కలుగును.
వ్యాఖ్యానం:-
ప్రకృతి యందలి త్రిగుణములు మానవుని జీవితమున ఏ విధముగా వ్యక్తమగునో ఈ శ్లోకమున తెలుపబడినది. సత్వ గుణము ప్రధానముగా ఉన్న వ్యక్తి జ్ఞాన సంపన్నుడై ఆనందమును పొందును. రాజసిక గుణములు ఉన్న వ్యక్తిని సులభముగా గుర్తించవచ్చును. అతను ప్రాపంచిక కోరికలతో ధనము, ఆస్తి, హోదా కొరకు అధికముగా శ్రమించుచుండును.
          
తమ జీవితము గురించి ఘాడమైన భ్రాంతి, భ్రమ కల వ్యక్తిని , లక్ష్యము లేని పనులను చేయు వ్యక్తిని, అనుచితమైన ప్రవర్తన కల వ్యక్తిని, ఆత్మ నిగ్రహము లేని వ్యక్తిని, గర్వము, క్రోధము కల వ్యక్తిని, ఇతరుల నుంచి మంచి సూచనలను తిరస్కరించు వ్యక్తిని తామస గుణ సంపన్నుడిగా గుర్తించవచ్చును.
14: 18 
అర్థం:-
సత్వగుణము ప్రధానంగా కలవారు ఊర్ధ స్థితికి పోయేదరు. రాజసిక గుణము కలవారు మధ్యస్థ స్థితి యందు ఉందురు. కలవారు నీచ గుణమైన తామస గుణము కలవారు అదో స్థితికి పోయారు.
వ్యాఖ్యానం:-
ఆధ్యాత్మిక పరిణితి క్రమము నందు ఒక వ్యక్తి తన యందు ప్రధానంగా ఉన్న త్రిగుణముల యందని ఏదైనా ఒక గుణమును అనుసరించి అతను అభివృద్ధి చెందవచ్చును, లేక మద్యస్థ స్థితి యందు ఊగిస లాడ వచ్చును, లేఖ అధోగతి పొందవచ్చును. శబ్దతః ఈ శ్లోకము ఇట్టి అర్థమనే ఇచ్చుచున్నది. కానీ ఈ శ్లోకము నందు లోతైన భావము ఉన్నది.
       
జ్ఞానము మరియు సత్వముచే ఆవహింపబడిన వ్యక్తి యొక్క చైతన్యము అతని శరీర మందలి ఉన్నత స్థానమైన ఆధ్యాత్మిక నేత్రమునందు కేంద్రీకృతమగును. ఆధ్యాత్మిక అవగాహన యందు అతను మరింత అభివృద్ధి చెందును.
      
రాజసిక గుణములు ఉన్న వ్యక్తి యొక్క మనసు హృదయ స్థానమందున్న అనాహతము నందు ఉండును. ఇది మధ్యస్థ స్థానము. పైనున్న ఉన్నత స్థాన చక్రములకు, దిగువనున్న అధోముఖ చక్రములకు ఇది మధ్యన ఉండు స్థానము.
           
తామసిక గుణములు ఉన్న వ్యక్తి యొక్క మనసు అధమ స్థానమునందున్న మూడు చక్రముల యందు స్థిరమై ఉండును. అవి: మణిపూర , స్వాధిష్ఠాన, మూలాధార చక్రములు. అతని చైతన్యము మెదడు నందలి దైవ అవగాహన స్థానము నుండి సుధూరముగా ఉండి రాజసిక వ్యక్తులకు చెందిన ఉండును మధ్యస్థ స్థానము కన్నను క్రింద ఉండును.
       
ఆత్మ మరియు ఇంద్రియముల యొక్క ప్రభావమున చక్రములు వ్యక్తము చేయు గుణములు:-
సూక్ష్మ శరీరమునకు చెందిన వెన్ను నందలి నాడి వ్యవస్థ కేంద్రములు సహజముగా దివ్యమైనవి. అవి దైవ జ్ఞానమును, ఆత్మకు చెందిన అతీంద్రియ వ్యవస్థ యొక్క యొక్క ప్రతిబింబించుచుండును. కానీ ఈ నాడీ కేంద్రముల యందలి శక్తిని ఇంద్రియములు తమ ప్రభావము చే బాహ్యమునకు లాగినప్పుడు ఆత్మ యొక్క స్వచ్ఛమైన విచక్షణ శక్తి లో తోటి వాటి బంధం తెగి, ఆశక్తి క్షీణించి, అవి వ్యక్తము చేయు గుణములు అవి క్షీణించిన మేరకు వక్రమగును. బాహ్యమునకు వెలువడిన కేంద్రముల శక్తిని బుద్దిని వక్రీకరింపబడిన అశాంతిని వెలుబుచ్చును. (అవి తమకు సహజమైన అతీంద్రియ జ్ఞానమును ఆత్మను ప్రతిబింబించు ప్రశాంతతను వెలిబుచ్చుటకు బదులు) బాహ్యమునకు వెలువడిన హృదయ స్థానములతో తనను పోల్చుకొనినప్పుడు భావోద్వేగములతో కూడిన ఇష్టములను, మమకారమును, ద్వేషమును వెలుగుచును ( స్వచ్ఛమైన పక్షపాతం లేని భావములను ప్రాణ శక్తిని అదుపు చేయుటకు బదులు) బాహ్యమునకు వెలువడిన స్థానమునందలి మూడు చక్రములు ఇంద్రియములకు చెందిన లోబ గుణములను పోషించును. (ఈ చక్రములైన దివ్య గుణములు అయినా ఆత్మ నిగ్రహము, ధర్మ మార్గమును అనుసరించుట, చెడు ప్రభావములను ఎదుర్కొను శక్తిని కలిగి ఉండుటకు బదులు )
         
ఇంద్రియములతో కూడిన మనసు యొక్క ప్రభావముచే ప్రాణశక్తి చైతన్యము అధమ భాగ మూడు చక్రంల యందు బలమైన రీతిలో కేంద్రీకరింపబడును. ఆచట నుండి మూలాధార చక్రము ద్వారా కుండలిని నుండి భౌతిక శరీరమునకు అందజేయబడును. బలమైన రీతిలో బాహ్యమునకు వెలువడు ఈ శక్తిని హృదయ స్థానము విశుద్ధ యొక్క స్వచ్ఛమైన శుద్ధి చేయు శక్తులచే అదుపు చేసి స్థిర పరచన యెడల అవి వ్యక్తి యందు కామ కోర్కెలను నీచమైన ప్రవృత్తులను, చెడు స్వభావములను రేకెత్తించును.
        
ఒక అలవాటుగా అదుపులేని ఇంద్రియ అలవాట్లనే ఆలోచించు వ్యక్తి మరియు అట్టి దుర్గుణముల నుండి బయటపడు ప్రయత్నం చేయని వ్యక్తి అధమ భాగ చక్రముల నుండి వెలువడు శక్తులను అధికమైన రీతిలో ఉత్తేజ పరచును. ఆ విధముగా వ్యక్తి ద్వంద్వములు జడత్వము దుఃఖముతో కూడిన ప్రపంచంలో బంధింపబడి ఉండును.

రాజసిక గుణములు కలిగిన వ్యక్తి మద్యస్థముగా ఉండును. అతను తన మనో చైతన్యమును ఊర్ధంగా మెదడు యందలి దివ్యమైన చక్రము లకు మళ్లించవచ్చు .లేక అధో ముఖముగా నరకమునకు చెందిన బ్రాంతికర స్థానములకు మళ్లించవచ్చును.

హృదయ స్థాన అందలి అనాహత స్థాన చక్ర స్థానమున ములతో నివసించు వ్యక్తి రాజసిక గుణములతో నివసించు వ్యక్తి తన భావములను లక్ష్యములను, చేయు కార్యక్రమములను, ధ్యానం చేయుట ద్వారా మరియు విచక్షణను ఉపయోగించుట ద్వారా స్వచ్ఛముగా ఉంచుకొనవచ్చును. అతను ఉన్నత స్థానములను చేరి తన దృష్టిని తరచుగా ఆధ్యాత్మిక నేత్ర స్థానమున నిలిపి స్థిర చిత్తమును , జ్ఞానమును పొందవచ్చును.
      
తామస గుణములు కలవారు తమ మనసును అధమమైన చక్రమున నిలిపి ముక్తిని కలిగించు సత్కార్యములకు ఆధ్యాత్మిక ప్రయత్నములకు దూరమై ఉందురు .మరియు వారు శరీర బంధమును కలిగి హింస యందు సంతోషమును పొందుతూ, అక్రమ సంబంధములను కలిగి ఉండి కపటము, మోసము అను దుర్మార్గముల యందు చిక్కి ఉందురు.

సత్వ గుణము కలవారు దీనికి విరుద్ధంగా ఉన్నత స్థితికి చెందిన తన్మయ అవస్థ అవగాహనను జ్ఞానమును కలిగి ఉండురు మరియు వారు సద్గుణములతో స్వచ్ఛమైన హృదయమును కలిగివుందురు‌.
14:19 నుండి 27 వరకు ఒక విభాగము
ప్రకృతికి చెందిన త్రిగుణములకు అతీతుడైన జీవన్ము వాళ్ళుక్తుని లక్షణములు:-

14:19 
అర్థం:-
ఈ ప్రకృతి యందు ఉన్నవి త్రిగుణములు మాత్రమే అని, మరి ఇతరములు ఏవియు లేవని గ్రహించిన వివేకవంతుడు, అట్టి త్రిగుణములకు అతీతమైన పరమాత్మను(అంతర్లీనంగా ఉన్న పరమాత్మను ) దర్శించినప్పుడు అతను నన్ను చేరును.
వ్యాఖ్యానం:-
ఒక చలనచిత్రము, ప్రొజెక్టర్ నుండి వెలువడు కాంతి కిరణం వలనను మరియు వివిధ రూపంలను కలిగిన ఫిలిం వలనను ఏర్పడిందని గ్రహించవలెను. అదేవిధంగా దృశ్య ప్రపంచము దాని కార్యకలాపాలు కేవలము కాంతి (విశ్వ కాంతి) నీడల ( త్రిగుణాలు) ప్రభావం అని - త్రిగుణములు వ్యక్తం చేయు రూపములని మరియు అది పరమాత్మ యొక్క దివ్యచైతన్యముచే కదలాడుచున్నవని, సంపూర్ణుడైన యోగి తెలుసుకొనును. ఈ సత్యమును గ్రహించిన యోగి ప్రకృతికి చెందిన కారణాత్మక దృశ్య ప్రపంచమును దాటి పరమాత్మ యొక్క దివ్యమైన విశ్వ కాంతిని చేర గలుగును.
       
మనిషి దృశ్య ప్రపంచము నందే మునిగి ఉన్నంత కాలము కార్యకారణ ప్రపంచపు అంతర్గత ప్రమాణత నిజము అని నమ్మి ఒక తప్పైన అభిప్రాయంతో అతని చైతన్యము బలపడును. కానీ వ్యక్తి యోగ సాధన ద్వారా తన హృదయమును తన్వయత్వపు స్థితికి చెందిన స్థిరమైన దివ్య ఆనందముతో నింపినప్పుడు అతను ఇష్ట అయిష్టముల నుండి విముక్తుడై, భగవంతుడిపై కేంద్రీకృతమైన దృష్టి ద్వారా స్వచ్ఛ మైన విధముగా చూడగలుగును. అట్టి దృష్టితో అతను పరమాత్మ యొక్క చలనచిత్ర కళ అను ఈ జగత్తు ప్రకృతి మూలమున కల్పింపబడినదని గ్రహించును.
14:20 
అర్థం:-
మానవ శరీరము ను కల్పించుటకు కారణమైన ప్రకృతికి చెందిన త్రిగుణములకు వ్యక్తి అతీతమైనప్పుడు అతను పుట్టుక ,వృద్ధాప్యము, మరణము ల యొక్క బాధల నుండి విముక్తుడై, అమరత్వంలో పొందును. 
వ్యాఖ్యానం:-
ధ్యానం చేయడం వలన యోగి శరీరచైతన్యమును అధిగమించును. శరీర చైతన్యమును అధిగమించడం వలన అతను ప్రకృతిని అధిగమించిన వాడగును. ఏల అనగా ఈ శరీరమును, మార్పు చెందు ప్రపంచమును కల్పించినది ప్రకృతి అందలి త్రిగుణములే. ఆపై వ్యక్తి తన నిజ తత్వము నందు సుస్థితుడగును. అట్టి స్థితి యందు ప్రపంచ శక్తులు అతనిని ఏ విధముగాను ప్రభావితం చేయజాలవు. అట్టి స్థితి శాశ్వత పరమాత్మ స్థితి.

14:21 
అర్థము:-
అర్జునుడు ఈ విధముగా పలికెను. ఓ ప్రభు! త్రిగుణములను అధిగమించిన వాని లక్షణములు ఎట్టివి?.. అతని ప్రవర్తన ఏ విధముగా ఉండును?.. అతను త్రిగుణములను ఎట్లు అధిగమించును?
వ్యాఖ్యానం:-
అర్జునుడు ఇచ్చట శ్రీకృష్ణుడిని ప్రభు అని సంబోధించుచున్నాడు... దివ్యమైన గురువు జ్ఞానమునకు నిధి వంటి వాడని గ్రహించిన భక్తుడు అతని నుండి జీవన్ముక్తుడు అను వాని లక్షణములను గురించి మరింత తెలుసుకొన కోరును. జీవన్ముక్తుడు అనగా శరీరమును ధరించి జీవించి ఉండగానే ముక్తిని పొందిన వాడు అని అర్థం. 
      
భగవద్గీత ఇరువురి మధ్యన జరుగు సంభాషణ అను క్రమమున రాయబడినది. దృష్టాంతముగా ఆ ఇరువురు భక్తుడు, భగవంతుడు అని భావించిన యెడల, సాధన యందు భక్తుడు తన అంతరంగము నందలి పరమాత్మతో సంభాషణ జరుపుచూ, తన సందేహమునకు సమాధానమును అంతరంగము అందలి పరమాత్మ నుండి తెలుసు కొన కోరుచున్నాడు. అతను భగవంతుడు నుండి సమాధానమును సత్య అవగాహన రూపమున పొందుతున్నాడు. ఇదియే ఇరువురి మధ్యన సంభాషణ. నిగూఢ భావముతో చూసిన ఎడల అర్జునుడే ఆ భక్తుడు. అతనే తన గురువైన శ్రీకృష్ణుని కృపచే తన ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించినవాడు. మరియు అతను ( అర్జునుడు లేక సాధకుడు)విశ్వ చైతన్య స్థితిని అనుభవించుచు మానవ జీవిత రహస్యములను తెలుసుకొన కోరుచున్నాడు.
       
భక్తుడి ఆధ్యాత్మిక ఆపేక్షను అనుసరించి, మరియు ఆధ్యాత్మిక ప్రగతిని అనుసరించి, పరమాత్మ నుండి సమాధానములు స్వర రూపమున మాటల వలె వినిపించవచ్చును లేక స్వర ఉచ్చారణ రూపమున కాక మాటలను ఆలోచన రూపము ద్వారా అతనికి అందింప వచ్చును.లేక ఆత్మ యొక్క అతీంద్రియ అవగాహన శక్తి ద్వారా తెలుసుకొనవచ్చును - అది సూటి అయిన సత్య దర్శన అనుభవము. మరియు కల్మష రహితమైన అవగాహన విధానము. - మరియు విశ్వ చైతన్యము వ్యక్తము అగుట ద్వారా భక్తుడు జ్ఞానమును స్పష్టమైన అవగాహన లేక అనుభవం ద్వారా పొందవచ్చును. లేక దృశ్య రూపమున, లేక చెవులకు వినపడు మాటల ద్వారా, లేక శబ్దముల (ఓం)ద్వారా, ఆత్మ యొక్క సర్వజ్ఞత కలిగిన అతీంద్రియ శక్తి చే అవగాహన కల్పింపబడవచ్చును. లేక భగవంతుని విశ్వశక్తి యొక్క దివ్యమైన ఆజ్ఞగా భక్తునకు తెలియవచ్చును.
       
ఆలోచన యొక్క స్థూలమైన తరంగమే శక్తిగా మారును. అటువంటి శక్తిని ఒక రూపంతో ఉన్నదానిగా మనసు నందు చూడ వచ్చును. లేక స్వప్న రూపమున చూడవచ్చును. మరింత లోతైన ధ్యానంచే నిజమైన దృశ్యముగా చూడవచ్చును.
      
ఆలోచన మానసికముగా ఒక తరంగమును కల్పించును. అట్టి తరంగము శబ్దమును కలుగచేయును. మనసును మరింత లోతుగా కేంద్రీకరించుట వలన ఆ శబ్ద తరంగమును ఆలోచన యొక్క భావములను తెలియజేయు భాషగా మలచవచ్చును. భగవంతుని చైతన్యము నందు భూత ,భవిష్యత్తు, వర్తమాన కాల విషయములు అన్నియు ఒక కోశాగారమునందు నిక్షిప్త పరిచి ఉండును. అతీంద్రియ అవగాహనకు తెలియు విషయములు , లేక విశ్వ చైతన్యం వ్యక్తపరచు విషయములు శూన్యము నందు లిఖించబడిన ఆకాశ గ్రంథం వలె దృశ్య రూప పదములుగా ఉండును. లేక అట్టి విషయములు ఆకాశము నుండి వెలువడు శబ్ద తరంగములు వలె ఉండి వినగలిగినవిగా ఉండును. లేక ఆకాశము నుండి వెలువడు మాటలుగా లేక ఇంద్రియ జ్ఞానము చే తెలుసుకోగల వాసనలుగా, సువాసనలుగా, స్పర్శకు తెలియు తెలియుగా అనుభూతిగా, లేక నిజమైన దృశ్యముగా, లేక ప్రకాశవంతమైన ఆలోచనగా, లేక అతీంద్రియముగా తెలుసుకోగల శక్తివలె , స్వచ్ఛమైన ఆలోచన/ సంకల్పము యొక్క తరంగం వలే ఉండును. ఆ విధముగా అర్జునుడు అనంత పరమాత్మకు చెందిన జ్ఞానమును తానుగా అడిగి, తానుగా పొందెను.
14:22,23,24 & 25శ్లోకాలు
14:22 
అర్థం :-
దివ్య పరమాత్మ ఈ విధముగా పలికెను. ఓ అర్జున, త్రిగుణములైన సత్వ రజో తమో గుణములు తన యందు ఉన్నను వాటిని తిరస్కరింపనివాడు, లేక అవి లేనిచో, లేవు అని చింతింపనివాడు:

14: 23 
అర్థం:-
సృష్టి యందు అంతటను త్రిగుణములు ప్రవర్తించుచున్నవని తెలిసి, వాటిపై ఏ విధమైన శ్రద్ధను చూపక, వాటిచే కలత చెందని వాడు: మనో చాంచల్యము లేక ఆత్మయందే స్థితమైన వారు:
14:24 
అర్థము:-
తన ఆత్మ భావన స్థితియందు స్థిరంగా ఉండి సుఖ దుఃఖముల చేతను నిందవలన, పొగడ్తవలన కలత చెందక ఉండినవాడు: మట్టి ముద్దను రాయిని , స్వర్ణమును,సమదృష్టితో చూచు వారు: తనకు ప్రియమును కూర్చు మనుషుల పట్ల, అనుభముల పట్ల ,తనకు అప్రియమును కూర్చు మనుషుల పట్ల, అనుభవముల పట్ల ఒకే విధమైన వైఖరిని అవలంబించు వారు, స్థిరమైన మనసు కలవారు:
14:25 
అర్థము:-
గౌరవము, అమర్యాదచే ప్రభావితులు కాని వారు, స్నేహితులను, శత్రువులను సమభావముతో చూచువారు, కతృత్వ భావభ్రాంతిని విడచినవారు-అట్టివారు త్రిగుణాతీతులు అని చెప్పబడును.

14:22,23,24 & 25 వ్యాఖ్యానం:
శ్రీకృష్ణ పరమాత్మ ఈ నాలుగు శ్లోకముల యందు "ముక్తిని పొందిన ఆత్మ " అనగా దేహమును ధరించి జీవించుచున్నప్పుడే ముక్తిని పొందిన వాని యొక్క లక్షణములను తెలియజేయుచున్నారు.జీవన్ముక్తులు ప్రకృతికి చెందిన అత్యంత ఆశ్చర్యకరమైన కపటోపాయమును గెలిచి, అస్థిరమైన బ్రహ్మతో కూడిన, భ్రాంతి కరమైన ప్రపంచం నుండి వేరుపడిరి. 
      
సాధారణ మానవుడు జీవితమనునది చలన చిత్రం చూస్తూ త్రిగుణములచే నిరంతరము కలత చెందుతుండును. సాధారణ మానవుని యందు ప్రేమ, ద్వేషము, ఆకర్షణ, అయిష్టత భావమును మనసునందు దురభిప్రాయం కలిగించి మనసును కలవరపరచును. కానీ యోగి ప్రశాంత చిత్తముతో అటువంటి దురభిప్రాయములకు కలతలకు తావివ్వక జీవిత చిత్రములు చూచును. యోగి మనసును అంతర్గతము చేసి ఆత్మ యొక్క విచ్చల మైన ఆనందమును అనుభవించుచు తన జీవిత చిత్రమునందలి దృశ్యములచే భావోద్వేగమును పొందకుండును. 
       
సుఖ దుఃఖములు కల్పించు ద్వైత అనుభవములకు యోగి గురి అయినను, ఆ అనుభవములు అతని అంతరంగమును ప్రభావిత పరచవు. ఏల అనగా యోగి బంధ రాహిత్యముతోను, నిర్వ్యామోహంతోను ఉండును. యోగి కి అనుకూలమైన, ప్రతికూలమైన వ్యక్తులు ఎదురైనప్పుడు, లేక అనుకూల ప్రతికూల అనుభవములు కలిగినప్పుడు: అతనికి పొగడ్త ,నిందా కలిగినప్పుడు, గౌరవము ,అమర్యాద కలిగినప్పుడు, స్నేహితులు, విరోధులు కలిసినప్పుడు అతనికి కొంత సమయము స్థలము లభించును, రాతి భవనము కనిపించినను, బంగారపు ముద్ద లభించినను-అన్ని అనుభవలను అతడు జీవితము అనెడి చలన చిత్రం గా చూచెదడు. ఆ అనుభవములు అతని అంతరంగమును ప్రభావితము చెయ్యదు. జీవిత దృశ్యం అందలి అనుభవములు అన్నియు వెలుగునీడల ఫలితం అని విశ్వ కాంతి తరంగముల అందలి మార్పుచే భ్రాంతిని కలిగించు, రంగుల మయమైన, త్రిగుణము లచే కలిపింపబడినవని తెలిసిన యోగి జీవిత దృశ్యములన్నింటినీ ఏ విధమైన కలత లేని ప్రశాంతతతో చూచును.
        
భిన్నత్వముతో ఉన్నవనియు ఒకే కాంతితో ఏర్పడినవి అని తెలిసిన యోగి, వాటి యందు భిన్నత్వమును చూడక , అది ఒకే విధము అయినవని గ్రహించును. యోగి కి బంగారం యొక్క విలువ, మట్టి యొక్క విలువ తెలియదు అని కాదు.: ప్రియమైన, అప్రియమైన వ్యక్తుల మధ్య తారతమ్యమున తెలియక కాదు. లేక జీవిత అనుభవములకు అతను స్పందించని మొద్దు బారిన వ్యక్తియు కాదు: అతను భౌతిక ప్రపంచము నందు ఉండును ప్రపంచ విషయములయందు అతనికి ఆసక్తి ఉండదు.సృష్టి అంతయు అణువుల మార్పు వలన ఏర్పడు నీడలు అను సత్యమును గ్రహించి, అతను భ్రాంతియందు చిక్కుకొనక ఉండును.

14:26 
అర్థం:-
అచంచలమైన అనన్యమైన అరణ్యమైన భక్తితో నన్ను సేవించువారు త్రిగుణములను అధిగమించెదరు. అట్టివారు బ్రహ్మమును పొందుటకు అర్హులు అగుదురు.
వ్యాఖ్యానం:
అర్జునుడు 21వ శ్లోకమున "మనిషి ఏ విధముగా త్రిగుణములను అధిగమించును"అను ప్రశ్నను అడిగాను. శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రశ్నకు ఇచ్చట సమాధానము-"భక్తి యోగము చేత " అని సమాధానము ఇచ్చుచున్నారు. భగవంతునిపై అచంచలమైన భక్తి ,మరియు అతనిపై ప్రేమ- ఎంతటి పరిపూర్ణమై ఉండవలెను అనగా, భక్తునికి తనపై తనకు ధ్యాస లేని విధముగా ఉన్నంత ప్రేమ-ఉండవలెను.
       
ఈ సమాధానము ఎంతో మధురముగాను, మిక్కిలి సులభకరమైనదిగాను ఉండి భక్తునికి ఒక దివ్యమైన ఆశను, ప్రోత్సాహమును కల్పించుచున్నది.

14:27 
అర్థం:-
అనంతమునకు ఆధారము ను నేనే, శాశ్వతుడను, నాశరహితుడను నేనే, శాశ్వతమైన ధర్మమునకు ,అఖండమైన దివ్య ఆనందమునకు, ఆధారమును నేనే.
వ్యాఖ్యానం:-  
శ్లోకముల యందు శ్రీకృష్ణుడు ప్రత్యగాత్మ వలె పలుకుతున్నాడు. ప్రత్యగాత్మ అనగా నిశ్చల పరబ్రహ్మను పోలిన మనిషి యందలి నిజమైన తత్వము లేక ఆత్మ శ్రీకృష్ణుడి పలుకులు "అనంతము లకు నేనే ఆధారమై ఉన్నాను. అనునవి ఏసుక్రీస్తు పలికిన దివ్యమైన పలుకుల వలే హాఉన్నది". "ఏసుక్రీస్తు ఈ విధముగా పలికను నేను అబ్రహాం కన్నను ముందుగానే ఉన్నాను". శ్రీకృష్ణుడు ,ఏసుక్రీస్తు ఇరువురు ఆత్మసాక్షాత్కారపు లోతుల నుండి మాట్లాడిరి. ఆ విధముగా మాట్లాడు నప్పుడు వారికి "నేను మరియు నా తండ్రి ఒకటే" అను విషయము పూర్తి అవగాహన ఉన్న విధముగా తెలియుచున్నది.
     
సృష్టికి పూర్వము అవ్యక్త పరమాత్మ పరమ శ్రేష్టమైన నిలయముగా ఉన్నాడు. (తాను ఒక్కడే ఉన్నాడు). అట్టి నిలయము శాశ్వత ధర్మమునకు, న్యాయమునకు, ధర్మ మార్గమునకు, విశ్వమునకు ఆశ్రయము ఇచ్చు అనంతమైన పరమానందముగా ఉన్నారు.
     
భౌతిక ప్రపంచము ఏర్పడిన పిదప నిశ్చల పరబ్రహ్మ త్రివిధములైన పరమాత్మ అనబడు ఒక నిలయమై ఉన్నాడు. (1. తండ్రి అయిన సత్-అతను తరంగ సృష్టికి అతీతమైన వాడు. 2. కుమారుడైన తత్ తరంగ సృష్టి యందు ప్రజ్ఞఅయి ఉన్నవాడు. 3. పరిశుద్ధ ఆత్మ లేక ఓం- లేక విశ్వతరంగము లేక ప్రకృతి మాత). బైబిల్వా క్యము"స్వర్గము నా సింహాసనము మరియు భూమి నా పాదపీఠము: మీరు నా కొరకు ఏ విధమైన మందిరమును నిర్మింపగలరు" అని ప్రభువు పలికెను."నా విశ్రాంతి ప్రదేశము ఎటువంటిది (నేను ఉండే ప్రదేశము ఎటువంటిది)నా హస్తములే వీటి అన్నింటిని నిర్మింప లేదా"

27 శ్లోకాల 14 అధ్యాయము,  గుణత్రయ విభాగ యోగము సంపూర్ణం